గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 123 పాయింట్లు పడి 77,989 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 35 పాయింట్లు కోల్పోయి 24,197 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్లు పడి 56,086 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 382 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3428 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్‌గా నిఫ్టీ50కి 24,415 వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. రానున్న 1-2 రోజుల్లో సూచీ స్వల్పంగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ50కి 24,100- 24,000 లెవల్స్ వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.24 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.26శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.36 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 1.35శాతం పడి బ్యారెల్‌కి 98.05 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 1.35శాతం పడి బ్యారెల్‌కి 98.05 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
{{/usCountry}}నియోజెన్ కెమికల్స్- బై రూ. 1502, స్టాప్ లాస్ రూ. 1440, టార్గెట్ రూ. 1610
ఆస్ట్రా మైక్రోవేవ్- బై రూ. 1074, స్టాప్ లాస్ రూ. 1026, టార్గెట్ రూ. 11250
సెనోరెస్ ఫార్మా- బై రూ. 890, స్టాప్ లాస్ రూ. 847, టార్గెట్ రూ. 955
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్- బై రూ. 540, స్టాప్ లాస్ రూ. 515, టార్గెట్ రూ. 575
ఐఎఫ్సీఐ- బై రూ. 60.73, స్టాప్ లాస్ రూ. 57.6, టార్గెట్ రూ. 65.5