...
...
Next Story

Stocks to buy : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​తో లాభాలు?

ఫిబ్రవరి 2, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 2, 2026, 08:15:44 IST
Advertisement

బడ్జెట్​ 2026 సందర్భంగా ఆదివారం నిర్వహించిన ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1547 పాయింట్లు పడి 80,723 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 495 పాయింట్లు పతనమై 24,825 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1193 పాయింట్లు పడి 58,417 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

ఆదివారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 611.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 853.33 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

జనవరి నెలలో ఎఫ్​ఐఐలు మొత్తం మీద రూ. 41,435.22 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,220.74 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“కీలకమైన 25,000 సపోర్ట్​ని నిఫ్టీ50 బ్రేక్​ చేసింది. ఇది సానుకూల విషయం కాదు. ఛార్ట్​ పాటర్న్​ కూడా నెగిటివ్​గా ఉంది. నిఫ్టీ50కి 24,500- 24,400 వద్ద మరో సపోర్ట్​ ఉంది. 24,900- 25,000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.3 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.4శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.2 శాతం డౌన్​ అయ్యింది.

మేదాంత్​- బై రూ. 1120, స్టాప్​ లాస్​ రూ. 1080, టార్గెట్​ రూ. 1200

నెట్​వెబ్​ టెక్నాలజీస్​- బై రూ. 3305, స్టాప్​ లాస్​ రూ. 3190, టార్గెట్​ రూ. 3535

విప్రో- బై రూ. 241, స్టాప్​ లాస్​ రూ. 230, టార్గెట్​ రూ. 262

టీసీఎస్​- బై రూ. 3180, స్టాప్​ లాస్​ రూ. 3100, టార్గెట్​ రూ. 3400

మ్యాక్స్​ హెల్త్​- బై రూ. 974, స్టాప్​ లాస్​ రూ. 950, టార్గెట్​ రూ. 1010

కేన్స్​ టెక్నాలజీ- బై రూ. 3560, స్టాప్​ లాస్​ రూ. 3480, టార్గెట్​ రూ. 3760

ఏథర్​ ఎనర్జీ- బై రూ. 626, స్టాప్​ లాస్​ రూ. 612, టార్గెట్​ రూ. 666

ఆస్టర్​ డీఎం హెల్త్​కేర్​- బై రూ. 570, స్టాప్​ లాస్​ రూ. 556, టార్గెట్​ రూ. 615

బంగారం, వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్​లో స్పాట్ గోల్డ్ ధర 1.5 శాతం క్షీణించి, ఒక ఔన్సు బంగారం ధర 4,793.97 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే, ఫిబ్రవరి డెలివరీకి సంబంధించి అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ మాత్రం 1.6 శాతం పెరిగి 4,818.10 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మరోవైపు, మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయిన వెండి ధరలు స్వల్పంగా కోలుకున్నాయి. స్పాట్ సిల్వర్ ధర 1.6 శాతం పెరిగి ఒక ఔన్సు 85.98 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

భారతీయ కమోడిటీ మార్కెట్‌ ఎంసీఎక్స్​లో ఆదివారం ముగిసిన ట్రేడింగ్‌లో ధరలు భారీగా పడిపోయాయి:

బంగారం: ఏప్రిల్ ఫ్యూచర్స్ గోల్డ్ రేటు ఏకంగా రూ. 4,242 (2.87%) తగ్గి, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,104 వద్ద ముగిసింది.

వెండి ధరల్లో ఊహించని పతనం చోటుచేసుకుంది. మార్చి ఫ్యూచర్స్ సిల్వర్ ధర ఏకంగా 9 శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్​ను తాకింది. ఒక్కరోజే కిలో వెండిపై రూ. 26,273 తగ్గడంతో ధర రూ. 2,65,652 వద్ద స్థిరపడింది.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks