...
...
Next Story

Sunil Gavaskar: ఆ డబ్బుతో భారతీయులను చంపుతారు-కావ్య మారన్‌పై గవాస్కర్ నిప్పులు-పాక్ ప్లేయర్ కొనుగోలుపై సంచలన కామెంట్లు

Sunil Gavaskar: పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తన సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ కోసం ఇండియన్ అయిన కావ్య మారన్ కొనుగోలు చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై స్పందిస్తూ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశారు. పాక్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు ఇండియన్ల చావు కోసమేనని కావ్య మారన్ పై నిప్పులు చెరిగాడు.

Published on: Mar 16, 2026, 12:53:34 IST
Advertisement

భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ది హండ్రెడ్' లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ (SRL) తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇండియన్ కావ్య మారన్ ఓనర్ గా ఉన్న టీమ్ లోకి పాక్ ప్లేయర్ ను ఎలా తీసుకుంటారని భారత నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై తాజాగా రియాక్టయిన గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు.

రూ.2.3 కోట్లు

సునీల్ గవాస్కర్ (AFP Images)
సునీల్ గవాస్కర్ (AFP Images)

ది హండ్రెడ్ లీగ్ లో కావ్య మారన్ కు సన్‌రైజర్స్ లీడ్స్ అనే టీమ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను రూ.2.3 కోట్లకు ఆ టీమ్ కొనుగోలు చేసింది. దీనిపై భారత ప్రజలు భగ్గుమన్నారు. కావ్య మారన్ ను దేశద్రోహి అని, ఆమెకు సిగ్గులేదు అంటూ తీవ్రంగా విమర్శించారు.

గవాస్కర్ కామెంట్లు

అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడం వల్ల సన్‌రైజర్స్ లీడ్స్, కావ్య మారన్ పై వస్తున్న విమర్శలు అర్థం చేసుకోదగినవేనని సునీల్ గవాస్కర్ అన్నాడు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ విమర్శలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య శత్రుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ఇండియన్లు చావుకు

పాకిస్థాన్ క్రికెటర్ పై ఖర్చు చేసే డబ్బు పరోక్షంగా ఇండియన్ల చావు కోసమే వాడతారని సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్లు చేశాడు. ‘‘ది హండ్రెడ్‌లో ఒక పాకిస్థానీ ఆటగాడిని భారత యజమాని కొనుగోలు చేయడంపై వచ్చిన ఈ గందరగోళం ఆశ్చర్యకరం కాదు. 2008 నవంబర్‌లో ముంబై దాడుల తర్వాత, భారత ఫ్రాంచైజీ యజమానులు ఐపీఎల్ కోసం పాకిస్థానీ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదు.

‘‘ఇండియన్ ఫ్రాంఛైజీ అయినా లేదా అనుబంధ టీమ్ అయినా కూడా ఓనర్ ఇండియన్ అయితే పాక్ క్రికెటర్ కు ఇచ్చే డబ్బుతో భారతీయుల చావుకు కారణమవుతారు. 'ది హండ్రెడ్'లో జట్టు కోచ్, న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరికి ఇది అర్థం కాకపోవచ్చు. అందుకే టీమ్ లో పాకిస్థానీ ఆటగాళ్లను కోరుకోవచ్చు. కానీ ఓనర్ దీన్ని అడ్డుకోవాల్సింది. ఏ ఇతర దేశం ఆడనటువంటి ఫార్మాట్‌లో టోర్నమెంట్ గెలవడం భారతీయ జీవితాల కంటే చాలా ముఖ్యమా?’’ అని మిడ్ డేకు రాసిన కాలమ్ లో గవాస్కర్ ప్రశ్నించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks