IPL 2026: అభిమానికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన క్లాసెన్- ఫొటో తీస్తే కొడతానంటూ- మా లీగ్‌లో ఆడుతూ, మ‌మ్మ‌ల్నే బెదిరిస్తావా?

IPL 2026: స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ విధ్వంసక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ ఫ్యాన్ కు అతను డెడ్లీ వార్నింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫొటోలు తీస్తే కొడతానంటూ క్లాసెన్ సీరియస్ అయ్యాడు. దీంతో మా లీగ్ లో ఆడుతూ, మమ్మల్నే అవమానిస్తావా? అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Published on: May 2, 2026, 17:07:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

IPL 2026: స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో క్లాసెన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయే ఈ బ్యాటర్ ను తెలుగు జనాలు అభిమానిస్తారు. స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ కు ఆడుతున్నప్పటి నుంచి క్లాసెన్ ను ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. కానీ తాజాగా ఓ అభిమాని పట్ల క్లాసెన్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

క్లాసెన్ (AFP)
క్లాసెన్ (AFP)

ఫ్యామిలీతో క్లాసెన్

రీసెంట్ గా స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో బయట తిరిగాడు. కూతురు, భార్యతో కలిసి చక్కర్లు కొట్టాడు. అయితే తమ అభిమాన ఆటగాడు కనిపించినప్పుడు ఫొటో తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఓ ఫ్యాన్ కూడా దీని కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో క్లాసెన్ తీరు షాకింగ్ గా ఉంది.

ఫ్యాన్ కు వార్నింగ్

బయట ఏదో ఒక చోట క్లాసెన్ తో ఫొటో దిగేందుకు, వాళ్ల ఫ్యామిలీని వీడియోలు తీసేందుకు ఓ అభిమాని ప్రయత్నించాడు. అంతే క్లాసెన్ కు చిర్రెత్తుకొచ్చింది. పట్టరాని కోపంతో ఊగిపోయాడు.

‘‘అలా చేయకు. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. నా ఫొటోలు తీయకు. నేను వెనక్కి తిరగగానే నా ఫొటో, నా ఫ్యామిలీ ఫొటోలు తీశావనుకో నిన్ను కచ్చితంగా కిందపడేలా కొడతా. కాబట్టి అటు తిరిగి వెళ్లిపో. ఇది నా ఫ్యామిలీ. ఫొటోలు తీయకు’’ అని క్లాసెన్ వార్నింగ్ ఇచ్చాడు.

వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. క్లాసెన్ తీరు పట్ల కొంతమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఓ అభిమాని ఫొటో అడిగాడు. దానికే ఇంత సీన్ చేయాలా? అది క్షణంలో అయిపోయేది. మన లీగ్ ల నుంచి డబ్బు సంపాదిస్తూ, మనల్నే ద్వేషిస్తున్నారు’’ అని ఓ యూజర్ ఫైర్ అయ్యాడు.

సూపర్ ఫామ్

ఐపీఎల్ 2026లో హెన్రిచ్ క్లాసెన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతను 9 మ్యాచ్ ల్లో 414 పరుగులు చేశాడు. ఇదులో 4 హాఫ్ సెంచరీలున్నాయి. క్లాసెన్ స్ట్రైక్ రేట్ 157.41గా ఉంది. మరో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా సంచలన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతను 9 మ్యాచ్ ల్లో 425 రన్స్ కొట్టాడు.

మూడో ప్లేస్ లో

ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం మూడో ప్లేస్ లో ఉంది. ఆ టీమ్ 9 మ్యాచ్ ల్లో 6 గెలిచింది. మూడు ఓడింది. సన్ రైజర్స్ ఖాతాలో ఇప్పుడు 12 పాయింట్లున్నాయి. పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ వరుసగా టాప్-2 స్థానాల్లో ఉన్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More