...
...
Next Story

Upcoming Kia cars : భారత మార్కెట్​లో కియా హవా! సైరోస్​ ఈవీతో పాటు మరో 3 కార్లు లాంచ్​- ఎప్పుడంటే..

Kia Syros EV : సెల్టోస్‌తో సక్సెస్ అందుకున్న కియా మోటార్స్, ఇప్పుడు భారత మార్కెట్​లో తన పట్టును మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదిలోపు నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో హైబ్రిడ్ కార్లతో పాటు సరికొత్త కియా సైరోస్​ ఈవీ కూడా ఉంది.

Published on: Mar 17, 2026, 07:30:32 IST
Advertisement

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా.. రాబోయే నెలల్లో సరికొత్త మోడళ్లతో వాహనదారులను పలకరించనుంది. సెల్టోస్ వంటి పాపులర్ మోడళ్ల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నాలుగు కొత్త మోడల్స్​ని మార్కెట్​లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఆ కొత్త కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం:

1. కియా సైరోస్ ఈవీ-

కియా సైరోస్​
కియా సైరోస్​

మొదట 2026 ప్రారంభంలోనే వస్తుందని భావించినప్పటికీ, ఈ కియా సైరోస్​ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ఈ ఏడాది మధ్య నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 35-45 kWh సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. లోకల్‌గా తయారైన ఎక్సైడ్ ఎనర్జీ ఎల్‌ఎఫ్‌పీ సెల్స్‌ను ఇందులో వాడుతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా.

2. కియా కార్నివాల్ హైబ్రిడ్-

ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి కియా తన ప్రీమియం మినివాన్ 'కార్నివాల్'లో హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. ఇందులో 1.6-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కలయిక ఉంటుంది. ఇది మొత్తం 242 హెచ్‌పీ పవర్​ని, 367 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ కొరియాలో ఇది లీటరుకు 14 కి.మీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో 18.6 కిమీ మైలేజీ ఇస్తోంది. భారత్‌లో మైలేజీపై భారీ అంచనాలు ఉన్నాయి.

3. కియా MQ4i-

కియా నుంచి వస్తున్న మరో మూడు వరుసల ఎస్‌యూవీ ఈ'ఎంక్యూ4ఐ'. ఇది గ్లోబల్ మార్కెట్​లో ఉన్న 'సోరెంటో' ఆధారంగా రూపొందుతోంది. ఇది నేరుగా మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓతో తలపడనుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2027 మొదటి త్రైమాసికంలో (క్యూ1) ఇది అందుబాటులోకి రావొచ్చు.

కియాకు అత్యంత ప్రజాదరణ తెచ్చిన సెల్టోస్‌లో కూడా తొలిసారిగా హైబ్రిడ్ వెర్షన్ రాబోతోంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన ఈ కారు లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని అంచనా. ఎంక్యూ4ఐ విడుదలైన కొద్ది కాలానికే ఇది మార్కెట్​లోకి రానుంది. మైలేజీని కోరుకునే భారతీయ వినియోగదారులకు ఇది గొప్ప ఎంపిక కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks