IND vs ZIM : గెలిస్తే సరిపోదు గురూ.. సెమీస్ చేరాలంటే టీమిండియా ముందున్న భారీ లక్ష్యం ఇదే!

IND vs ZIM T20 world cup : దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ భారీగా పడిపోవడంతో, జింబాబ్వేపై భారత్ కేవలం గెలవడమే కాదు.. భారీ మార్జిన్‌తో విజయం సాధించాల్సి ఉంది.

Published on: Feb 26, 2026, 10:01:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత టీ20 వరల్డ్ కప్ సూపర్-8 ప్రయాణం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది! దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య, భారీ ఓటమి టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా, నెట్ రన్ రేట్‌ను మైనస్‌లోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో గురువారం జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ భారత్‌కు కేవలం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ మాత్రమే కాదు.. నెగిటివ్​లో కూరుకుపోయిన రన్​ రేట్​ని పాజిటివ్​లోకి తెచ్చుకునేందుకు చేయాల్సిన పోరాటం కూడా!

టీమిండియా కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​.. (PTI )
టీమిండియా కెప్టెన్​ సూర్యకుమార్​ యాదవ్​.. (PTI )

ఈ నేపథ్యంలో రన్ రేట్ మెరుగుపడాలంటే జింబాబ్వేపై సూర్యకుమార్​ యాదవ్​ సేన ఏ రేంజ్​లో విజయం సాధించాలో ఇక్కడ తెలుసుకోండి..

ఇండియా వర్సెస్​ జింబాబ్వే- రన్​ రేట్​ మెరుగుపడాలంటే..

సూపర్​ 8 గ్రూప్​ ఏలో దక్షిణాఫ్రికాపై ఓటమి అనంతరం టీమిండియా రన్​ రేట్​ - 3.8కి పడిపోయింది. ప్రస్తుతం ఈ టేబుల్​లో సూర్యకుమార్​ యాదవ్​ సేన 3వ స్థానంలో ఉంది. వెస్టిండీస్​ (5.3) సౌతాఫ్రికా (3.8)తో 1,2 స్థానాల్లో ఉన్నాయి.

అందుకే సెమీస్​ రేసులో నిలవాలంటే జింబాబ్వే మ్యాచ్​ టీమిండియాకు అత్యంత కీలకం.

భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే: 77 పరుగుల తేడాతో గెలవాలి

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాబట్టి, ఆ లోటును భర్తీ చేసి రన్ రేట్‌ను పాజిటివ్‌లోకి తీసుకురావాలంటే జింబాబ్వేపై భారత్ కనీసం 77 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే.. స్కోరు బోర్డు లక్ష్యాలు ఇలా ఉండాలి:

భారత్ 170 పరుగులు చేస్తే: జింబాబ్వేను 92 లేదా అంతకంటే తక్కువ పరుగులకే కట్టడి చేయాలి.

భారత్ 180 పరుగులు చేస్తే: ప్రత్యర్థిని 103 పరుగుల లోపే ఆలౌట్ చేయాలి.

భారత్ 200 పరుగులు చేస్తే: జింబాబ్వే 123 పరుగుల కంటే ఎక్కువ చేయకుండా అడ్డుకోవాలి.

తొలి బ్యాటింగ్ చేస్తే గెలుపు మార్జిన్ స్పష్టంగా ఉంటుంది కాబట్టి, భారత్‌కు ఇది కాస్త సులువైన మార్గంగా కనిపిస్తోంది.

భారత్ రెండోసారి బ్యాటింగ్ చేస్తే (ఛేజింగ్): వేగంగా ముగించాలి..

ఒకవేళ భారత్ లక్ష్య ఛేదనకు దిగితే.. లెక్కలు పూర్తిగా మారిపోతాయి. సాధారణంగా 16 లేదా 17 ఓవర్లలో మ్యాచ్ ముగిస్తే రన్ రేట్ మెరుగుపడుతుంది కానీ, అది పాజిటివ్‌లోకి రాకపోవచ్చు. రన్ రేట్ వెంటనే ప్లస్​లోకి రావాలంటే భారత్ ఆ విధ్వంసాన్ని తొలి బంతి నుంచే మొదలుపెట్టి 10 నుంచి 12 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాల్సి ఉంటుంది.

ఛేజింగ్ లెక్కలు ఇలా ఉండవచ్చు:

జింబాబ్వే 140 పరుగులు చేస్తే: భారత్ 10.4 ఓవర్లలోనే 141 పరుగులు చేయాలి.

జింబాబ్వే 160 పరుగులు చేస్తే: టీమ్ ఇండియా 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించాలి.

జింబాబ్వే 200 పరుగులు చేస్తే: కేవలం 12.1 ఓవర్లలోనే భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది.

అంటే, ఛేజింగ్‌లో భారత్ ఏమాత్రం నెమ్మదించినా రన్ రేట్ విషయంలో ఇబ్బందులు తప్పవు.

ఇండియా వర్సెస్​ జింబాబ్వే- టాస్ గెలిస్తే ఏం చేయాలి?

టీ20 ప్రపంచ కప్​ 2026లో ప్రస్తుత సమీకరణాలను బట్టి చూస్తే, భారత్ టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ ఎంచుకోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే 77 పరుగుల మార్జిన్ అనేది ఒక స్థిరమైన లక్ష్యం. అదే ఛేజింగ్‌కు వెళితే.. ప్రతి ఓవర్‌కు రన్ రేట్ మారుతూ ఒత్తిడి పెరుగుతుంది.

ఇక భారత్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో సాధించే విజయం ఎంత భారీగా ఉండాలనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More