T20 World Cup : టీ20 ప్రపంచ కప్​ నుంచి బంగ్లాదేశ్​ ఔట్​- బీసీబీ ఆదాయంలో 60శాతం ఫట్​!

భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ స్పష్టం చేయడంతో, ఐసీసీ వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ నిర్ణయం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన వార్షిక ఆదాయంలో 60 శాతాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

Published on: Jan 25, 2026, 08:15:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత్, శ్రీలంక వేదికలుగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం లేదు. ఇది ఇప్పుడు అఫీషియల్​ వార్త. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం తమ జాతీయ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిరాకరించింది. అయితే ఇది టోర్నీ కన్నా బీసీబీకే ఎక్కువ నష్టాన్ని కలిగించేలా ఉంది! 2026 టీ20 వరల్డ్​ కప్​ ఆడకపోతే బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోక తప్పేడట్టు లేదు.

బంగ్లాదేశ్​ క్రికెట్​ టీమ్​.. (AP)
బంగ్లాదేశ్​ క్రికెట్​ టీమ్​.. (AP)

2026 టీ20 వరల్డ్ కప్- బీసీబీకి ఆర్థిక నష్టాలు..

కేవలం గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో పాల్గొనడం ద్వారా వచ్చే ఫీజుల రూపంలోనే బంగ్లాదేశ్ సుమారు 300,000 డాలర్ల నుంచి 500,000 డాలర్ల (సుమారు 3.6 నుంచి 6.7 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు) నష్టపోయే అవకాశం ఉంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. 'సభ్యత్వ భాగస్వామ్య ఒప్పందం' (ఎంపీఏ) కింద, సరైన కారణం లేకుండా టోర్నీ కోసం ప్రయాణించడానికి నిరాకరిస్తే, గ్లోబల్ బాడీ సుమారు 2 మిలియన్ డాలర్ల (సుమారు 24 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు) వరకు జరిమానా విధించవచ్చు.

అంతేకాకుండా, ఒకవేళ టోర్నీ ఆదాయ వాటా నుంచి బంగ్లాదేశ్‌ను మినహాయిస్తే, ఆ బోర్డు ఏకంగా 27 మిలియన్ డాలర్ల (సుమారు 325-330 కోట్ల బంగ్లాదేశ్ టాకాలు) వరకు నష్టపోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇది బీసీబీ మొత్తం వార్షిక ఆదాయంలో దాదాపు 60 శాతం కావడం గమనార్హం!

ఇది మాత్రమే కాకుండా, అంతర్జాతీయ బ్రాండ్‌లతో ఆటగాళ్లకు ఉన్న కాంట్రాక్టులు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. ముఖ్యంగా భారతీయ క్రీడా సామాగ్రి దిగ్గజాలైన ఎస్​జీ, ఎస్​ఎస్​ వంటి సంస్థలతో ఉన్న ఒప్పందాలను ఆయా సంస్థలు పునఃసమీక్షిస్తున్నాయి. దీనివల్ల స్టార్ ఆటగాళ్లు మైదానం బయట సంపాదించే కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

అసలు వివాదం ఏంటి?

భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భద్రతా కారణాలను చూపుతూ తాము భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ ముందే ఐసీసీకి సమాచారం ఇచ్చింది. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని, బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచులు భారత్‌లోనే ఉంటాయని ఐసీసీ పునరుద్ఘాటించింది. టోర్నీలో ఆడటంపై తన తుది నిర్ణయాన్ని వెల్లడించడానికి ఐసీసీ బీసీబీకి 24 గంటల గడువు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో పాల్గొంటుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శనివారం ధృవీకరించింది.

వేదిక ఏదైనా సరే పోటీ పడాలని ఆటగాళ్లు ఆసక్తిగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ, బోర్డు మాత్రం వారిని ఏమాత్రం సంప్రదించలేదని తెలుస్తోంది. ఇండియాలో 2026 టీ20 వరల్డ్​ కప్​ ఆడకూడదన్న నిర్ణయాన్ని పూర్తిగా ప్రభుత్వం మాత్రమే తీసుకుంది. ఇండియాలో ఎటువంటి భద్రతా ముప్పు లేదని ఐసీసీ భరోసా ఇచ్చినప్పటికీ, బంగ్లాదేశ్ బోర్డు మాత్రం తన పట్టు వీడలేదు.

టీ20 ప్రపంచ కప్​ నుంచి తప్పుకోవాలని బంగ్లాదేశ్​ నిర్ణయం తీసుకోవడంపై ఇండియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశం ఆడకపోతే ప్రపంచ కప్​కి వచ్చే నష్టం ఏమీ లేదని కొందరు సెటైర్లు వేస్తుంటే, ఇంకొందరు మాత్రం బీసీబీతో క్రికెట్​ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐకి చెబుతున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More