శివమణి డ్రమ్స్ తో, రిషబ్ శర్మ వీణతో మ్యాజిక్ చేశారు. వీళ్లు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే స్టేడియం మొత్తం ఊగిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో ఆడుతోంది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
ట్రోఫీతో రోహిత్

జెట్ ప్యాక్ తో ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చాడు. దీంతో కప్ ఎగురుతూ వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత ఐసీసీ ఛైర్మన్ జై షా, టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. రోహిత్ శర్మ ట్రోఫీ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే డ్రమ్స్ మోతతో స్టేడియం మార్మోగింది. అనంతరం అమెరికా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.
నోరా డ్యాన్స్
టాస్ వేసిన తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ కొనసాగింది. పాపులర్ ర్యాపర్ బాద్షా తన పాటలతో స్టేడియాన్ని ఊపేశాడు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తన డ్యాన్స్ మూవ్స్ తో ఆడియన్స్ తో డ్యాన్స్ చేయించింది.
బుమ్రా దూరం
టీ20 ప్రపంచకప్ 2026లో తమ ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే స్టార్ పేసర్ బుమ్రా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
నంబర్ వన్ టీమ్
టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ టీమ్ గా ఇండియా ఈ ప్రపంచకప్ లో ఆడుతోంది. అలాగే టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ, నంబర్ వన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇండియా క్రికెటర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మన టీమ్ పై భారీ అంచనాలున్నాయి. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలన్నది ప్రతి ఒక్క ఫ్యాన్ ఆశ.
డిఫెండింగ్ ఛాంపియన్
{{/usCountry}}టీ20 వరల్డ్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ టీమ్ గా ఇండియా ఈ ప్రపంచకప్ లో ఆడుతోంది. అలాగే టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ, నంబర్ వన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇండియా క్రికెటర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మన టీమ్ పై భారీ అంచనాలున్నాయి. సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలన్నది ప్రతి ఒక్క ఫ్యాన్ ఆశ.
డిఫెండింగ్ ఛాంపియన్
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. అప్పుడు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
టోర్నీ ఇలా
2026 టీ20 ప్రపంచకప్ కు ఇండియా, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. వీటిని నాలుగు గ్రూప్ లుగా విభజించారు. టీమ్-ఏ లో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా టీమ్స్ ఉన్నాయి. ఇప్పటికే టీ20 ప్రపంచకప్ స్టార్ట్ అయింది. శ్రీలంకలో పాక్ వర్సెస్ నెదర్లాండ్స్, కోల్ కతాలో వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ లు జరిగాయి. ఇండియా హోస్ట్ కాబట్టి ఈ అమెరికాతో మ్యాచ్ కంటే ముందు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించారు.