టాటా సియెర్రా ఎస్‌యూవీ హిట్ అవ్వడంతో టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది! బుకింగ్స్ ప్రారంభమైన తొలి రోజే 70వేలకుపైగా మంది కస్టమర్లు ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవడం ఆటోమొబైల్ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోకస్ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ వర్షెన్‌పై షిఫ్ట్ అయ్యింది! టాటా సియెర్రా ఈవీని సంస్థ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది 2026లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం 2026 సంవత్సరానికి భారీ ప్రణాళికలనే రచిస్తోంది! 2026లో లాంచ్‌కు రెడీ అవుతున్న టాటా కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
2026లో లాంచ్ అయ్యే టాటా కార్లు ఇవి..

1. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్-
- లాంచ్ అంచనా: 2026 ఆరంభంలో
- ధర అంచనా: రూ. 6 లక్షల నుంచి రూ. 9.5 లక్షలు
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా పంచ్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోంది. టెస్ట్ మోడల్‌కి సంబంధించి ఇప్పటికే అనేక స్పై షాట్స్ ఆన్లైన్లో కనిపించాయి.
ఈ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి పంచ్ ఈవీని పోలి ఉంటుంది. కొత్త లైట్ బార్, స్టైలిష్ బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్‌తో ఇది మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. క్యాబిన్లో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి.
ఈ ఎస్‌యూవీలో ఇంజిన్ పరంగా మార్పులేమీ లేవు. పాత 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతోనే ఇది కొనసాగుతుంది.
2. టాటా సియెర్రా ఈవీ-
- లాంచ్: 2026 మొదటి త్రైమాసికంలో
- ధర అంచనా: రూ. 16 లక్షల నుంచి రూ. 25 లక్షలు
టాటా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సియెర్రా ఈవీ' 2026 మార్చి నాటికి రోడ్లపైకి రానుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ప్రత్యేకమైన ‘ఆర్గోస్’ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు.
కర్వ్ ఈవీలో వాడిన 55కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ లేదా హారియర్ ఈవీలో వచ్చే 65కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూడా వాడే అవకాశం ఉంది.
{{/usCountry}}కర్వ్ ఈవీలో వాడిన 55కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ లేదా హారియర్ ఈవీలో వచ్చే 65కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌నే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూడా వాడే అవకాశం ఉంది.
{{/usCountry}}ఐసీఈ మోడల్‌తో పోలిస్తే, ఈవీ వర్షెన్ ముందు భాగం క్లోజ్డ్ గ్రిల్‌తో విభిన్నంగా ఉంటుంది.
హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. నెక్ట్స్ జనరేషన్ టాటా నెక్సాన్-
- లాంచ్ అంచనా: 2026 చివరిలో
- ధర అంచనా: రూ. 8 లక్షల నుంచి రూ. 17 లక్షలు
టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ 'నెక్సాన్'లో భారీ మార్పులు చేస్తోంది! ‘గరుడ్’ అనే కోడ్ నేమ్‌తో తయారవుతున్న ఈ కొత్త తరం నెక్సాన్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత నెక్సాన్ ప్లాట్‌ఫామ్ మారుతుండటం విశేషం! దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పూర్తిగా కొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో ఉండబోతోంది.
అప్డేటెడ్ వర్షెన్‌లో 1.2 లీటర్ పెట్రోల్, సీఎన్జీ మోడల్స్ కన్ఫర్మ్ అయ్యాయి కానీ, కఠినతరమైన బీఎస్7 నిబంధనల వల్ల డీజిల్ వర్షెన్ ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.
వీటితో పాటు మరిన్ని ఎగ్జైటింగ్ మోడల్స్‌ని కూడా టాటా మోటార్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
మొత్తానికి 2026లో ఎలక్ట్రిక్- పెట్రోల్ విభాగాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా మోటార్స్ సిద్ధమవుతోంది. ముఖ్యంగా సియెర్రా ఈవీ, నెక్ట్స్ జన్ నెక్సాన్ మార్కెట్ ట్రెండ్‌ను మార్చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు!