Tata Sumo 2026 : ఇండియన్ మార్కెట్లోకి ఐకానిక్ టాటా సుమో రీ-ఎంట్రీ? టాటా మోటార్స్ క్రేజీ ప్లాన్ ఇదేనా?

Tata Sumo : భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2031 ఆర్థిక సంవత్సరం నాటికి సరికొత్త విభాగాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఒకప్పటి ఐకానిక్ మోడల్ ‘టాటా సుమో’ పేరుతో సరికొత్త 3-రో ఎంపీవీని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ వివరాలు..

Published on: Jun 25, 2026, 17:20:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాల పాటు శాసించిన ఐకానిక్ కార్లలో 'టాటా సుమో' ఒకటి! ఇప్పుడు ఇదే బ్రాండ్ నేమ్‌ను సరికొత్త ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి టాటా మోటార్స్ తెరవెనుక వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లో 6 సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో పాటు ప్రస్తుతం ఉన్న మోడళ్లకు 20కి పైగా ఫేస్‌లిఫ్ట్‌లు, అప్‌డేట్లను తీసుకురానున్నట్లు టాటా ఇప్పటికే ప్రకటించింది. ఈ కొత్త వ్యూహంలో భాగంగానే.. కంపెనీ ఇప్పటివరకు లేని సరికొత్త విభాగాల్లోకి ప్రవేశించనుంది! అందులో అత్యంత ముఖ్యమైనది.. 3-రో ఎంపీవీ విభాగం.

పాత టాటా సుమో..
పాత టాటా సుమో..

టాటా సుమో పేరుతో సరికొత్త 3-రో కారు?

ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం.. టాటా మోటార్స్ ఒక సరికొత్త ఎస్‌యూవీ స్టైల్ 3-రో (మూడు వరుసల సీటింగ్) వాహనాన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది అటు కమర్షియల్ (ట్రావెల్స్), ఇటు ప్రైవేట్ (ఫ్యామిలీ) కస్టమర్లను లక్ష్యంగా చేసుకోనుంది. ప్రస్తుతం ఈ విభాగంలో మారుతీ సుజుకీ ఎర్టిగా, ఎక్స్‌ఎల్6, కియా కారెన్స్ క్లావిస్ వంటి కార్ల ఆధిపత్యం నడుస్తోంది.

గతంలో 'సియెర్రా' బ్రాండ్‌ను వెనక్కి తెచ్చినట్లే.. ఈ కొత్త 3-రో మోడల్‌కు కూడా ‘టాటా సుమో’ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సాధారణంగా టాటా మోటార్స్ భవిష్యత్తు కార్లను ఆటో ఎక్స్‌పో వేదికగా చూపిస్తుంది కాబట్టి, రాబోయే 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2027'లో ఈ కొత్త సుమో కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ కొత్త ఎంపీవీని సియెర్రా ఐసీఈ మోడల్‌కు ఉపయోగించిన అధునాతన 'ARGOS' ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేయవచ్చని అంచనా.

లైన్‌లోకి సరికొత్త 'టాటా స్కార్లెట్' ఎస్‌యూవీ!

3-రో ఎంపీవీతో పాటు టాటా మోటార్స్ సబ్-4 మీటర్ విభాగంలో ఒక సరికొత్త లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీని కూడా డెవలప్ చేస్తోందని సమాచారం. దీనికి కంపెనీ అంతర్గతంగా ‘టాటా స్కార్లెట్’ అనే కోడ్‌నేమ్ పెట్టినట్లు సమాచారం.

ఈ కొత్త ఎస్‌యూవీ డిజైన్ ఎలిమెంట్స్ చాలా వరకు టాటా సియెర్రా పోలికలతో ఉండనున్నాయి. మార్కెట్లోకి వస్తే ఇది రెనాల్ట్ బ్రిడ్జర్, మహీంద్రా విజన్ ఎస్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. టాటా కార్ల లైనప్‌లో ఈ 'స్కార్లెట్' ఎస్‌యూవీ కారు.. పాపులర్ మోడల్ అయిన ‘నెక్సాన్’, సరికొత్త 'కర్వ్' మోడళ్ల మధ్య స్లాట్ కానుంది.

ఒకవైపు సుమో రీ-ఎంట్రీ ఊహాగానాలు, మరోవైపు సరికొత్త స్కార్లెట్ ఎస్‌యూవీ ప్లాన్లతో రాబోయే రోజుల్లో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో మరింత అగ్రెసివ్‌గా దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More