...
...
Next Story

Tata Nexon : బెస్ట్ సెల్లింగ్​ టాటా నెక్సాన్​లో కామో ఎడిషన్- బేస్ వేరియంట్​ నుంచే అదిరే ఫీచర్లు!

టాటా మోటార్స్ తన ప్రాసిద్ధ ఎస్‌యూవీ నెక్సాన్‌లో 'CAMO' ప్రత్యేక ఎడిషన్‌ను రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ మోడళ్లలో లభించే ఈ కొత్త ఎడిషన్ ఫీచర్లు, ధరల వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 7, 2026, 09:16:52 IST
Advertisement

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తమ ప్రాచుర్యాన్ని మరింత పెంచుకునేందుకు సరికొత్త అడుగు వేసింది. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే 'నెక్సాన్' ఎస్​యూవీలో ప్రత్యేకమైన ‘కామో ఎడిషన్’ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ కామో ఎడిషన్‌ను కేవలం ఒక్క ఇంజిన్‌కే పరిమితం చేయకుండా పెట్రోల్, డీజిల్, ఐ-సీఎన్జీ విభాగాల్లోని పలు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

సరికొత్త లుక్.. ఆకట్టుకునే స్టైలింగ్

టాటా నెక్సాన్ కామో ఇదిగో..
టాటా నెక్సాన్ కామో ఇదిగో..

సాధారణ నెక్సాన్ మోడల్‌తో పోలిస్తే ఈ కామో ఎడిషన్ బాహ్య, అంతర్గత రూపంలో పలు ఆకర్షణీయమైన మార్పులను పొందింది.

ప్రత్యేక రంగులు: ఈ మోడల్‌ను రెండు సరికొత్త ఎక్స్‌క్లూజివ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. అందులో ఒకటి ‘మున్నార్ మిస్ట్’ కాగా మరొకటి ‘కూర్గ్ క్లౌడ్’.

డిజైన్ స్పర్శ: ముందు వైపు ఫెండర్లపై ప్రత్యేకమైన 'CAMO' బ్యాడ్జింగ్‌ను అందించారు. అంతేకాకుండా లోపలి భాగంలో ఉన్న సీట్ల హెడ్‌రెస్ట్‌లపై కామో థీమ్‌తో కూడిన పర్‌ఫొరేటెడ్ డిజైన్ వాహనానికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

కొత్తగా ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ ఫీచర్..

ఈ కామో ఎడిషన్‌ ద్వారా టాటా మోటార్స్ ఒక సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇందులో వాహనం 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌తో అనుసంధానమై పనిచేసే ‘ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్ రికార్డర్’ని అందించారు.

ఇది నిరంతరం రికార్డింగ్ చేస్తుంది. ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలను సేఫ్‌గా భద్రపరుస్తుంది. రికార్డైన వీడియోలను ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పైనే నేరుగా వీక్షించవచ్చు. యూఎస్‌బీ డ్రైవ్ ద్వారా 256జీబీవరకు డేటాను నిల్వ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ వైఫై హాట్‌స్పాట్ ద్వారా వీడియోలను స్మార్ట్‌ఫోన్‌కు సులభంగా బదిలీ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

బేస్ వేరియంట్ నుంచే అధునాతన ఫీచర్లు..!

హైయర్ వేరియంట్లకు వెళ్లేకొద్దీ.. 7 రకాల ఫంక్షన్లతో కూడిన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), వాయిస్ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సబ్‌వూఫర్‌తో కూడిన 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, బ్లైండ్-వ్యూ మానిటర్, వెనుక కిటికీలకు సన్‌షేడ్స్, ప్రీమియం లెథరెట్ సీట్లు లభిస్తాయి.

టాటా నెక్సాన్ కామో ఎడిషన్- 5 స్టార్ రేటింగ్..

భద్రత విషయంలో టాటా నెక్సాన్ రికార్డు మారలేదు. భారత్ ఎన్‌సీఏపీ, గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్స్ రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన ప్లాట్‌ఫారమ్‌పైనే ఈ కామో ఎడిషన్ కూడా రూపొందింది. ప్రమాద సమయాల్లో కాపాడటానికి 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్​పీ), ఎమర్జెన్సీ, బ్రేక్‌డౌన్ కాల్ ఫంక్షన్లు, 360-డిగ్రీ కెమెరాతో పాటు అడాస్ (అడాస్) సాంకేతికతలో భాగమైన అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్. హై బీమ్ అసిస్ట్ వంటి సురక్షితమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు..

సాంకేతికంగా ఈ ఎస్​యూవీ మెకానికల్ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ నెక్సాన్‌లో లభించే మూడు ఇంజిన్ ఆప్షన్లే ఇక్కడా అందుబాటులో ఉంటాయి:

1.2-లీటర్ టర్బో-పెట్రోల్: 120 PS పవర్, 170 Nm టార్క్.

1.5-లీటర్ డీజిల్: 115 PS పవర్, 260 Nm టార్క్.

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఐ-సీఎన్జీ: 100 PS పవర్, 170 Nm టార్క్.

గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే మ్యాన్యువల్, ఏఎంటీ, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సీఎన్జీ వేరియంట్లలో కూడా ఈ కామో ఎడిషన్‌ను కొనుగోలు చేయవచ్చు.

వేరియంట్లు, ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్)..

1. క్రియేటివ్ కామో :

పెట్రోల్: రూ. 9.99 లక్షలు (MT) | రూ. 11.09 లక్షలు (AMT) | రూ. 11.59 లక్షలు (DCA)

డీజిల్: రూ. 11.54 లక్షలు (MT) | రూ. 12.14 లక్షలు (AMT)

సీఎన్‌జీ: రూ. 11.39 లక్షలు (MT)

2. క్రియేటివ్ + ఎస్ కామో:

పెట్రోల్: రూ. 10.64 లక్షలు (MT) | రూ. 11.34 లక్షలు (AMT)

డీజిల్: రూ. 11.79 లక్షలు (MT) | రూ. 12.44 లక్షలు (AMT)

సీఎన్‌జీ: రూ. 11.69 లక్షలు (MT)

3. క్రియేటివ్ + పిఎస్ కామో :

పెట్రోల్: రూ. 11.64 లక్షలు (MT) | రూ. 12.79 లక్షలు (DCA)

సీఎన్‌జీ: రూ. 12.59 లక్షలు (MT)

4. ఫియర్‌లెస్ + పిఎస్ కామో :

పెట్రోల్: రూ. 12.59 లక్షలు (MT)

సీఎన్‌జీ: రూ. 13.54 లక్షలు (MT)

5. ఫియర్‌లెస్ + ఎ పిఎస్ కామో:

పెట్రోల్: రూ. 13.94 లక్షలు (DCA)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe