...
...
Next Story

Tata Punch EV : సరికొత్తగా టాటా పంచ్​ ఈవీ- ఫేస్​లిఫ్ట్​ వెర్షన్​ లాంచ్​ రేపే..

2026 మచ్​ అవైటెడ్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అప్డేట్స్​లో ఒకటైన టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ఫిబ్రవరి 20న లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Feb 19, 2026 02:31 PM IST
Advertisement

టాటా మోటార్స్ తన పాపులర్ మైక్రో ఎలక్ట్రిక్​ ఎస్‌యూవీ “పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్” వెర్షన్‌ను రేపు, ఫిబ్రవరి 20, 2026 అధికారికంగా లాంచ్ చేయనుంది. పెట్రోల్ వెర్షన్ పంచ్‌లో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుంటూ, మరిన్ని హై-టెక్ ఫీచర్లతో ఈ కొత్త ఈవీ రాబోతోంది.

2026 టాటా పంచ్​ ఈవీ..
2026 టాటా పంచ్​ ఈవీ..

ఈ కొత్త మోడల్‌లో ఆశించే ప్రధాన మార్పులు, విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- హైలైట్స్​ ఇవి!

1. ఎక్స్​టీరియర్​ డిజైన్​..

ముందు భాగం: 2026 టాటా పంచ్ ఈవీలో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఉంటుంది. పాత మోడల్‌లో ఉన్న బ్లాక్ స్ట్రిప్‌ను తొలగించి, క్లీన్ సీల్డ్-ఆఫ్ గ్రిల్‌ను అందించారు.

లైటింగ్: ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్ (డీఆర్​ఎల్స్​), సీక్వెన్షియల్ ఇండికేటర్లు కొనసాగుతాయి.

సైడ్ ప్రొఫైల్: కొత్త 16 ఇంచ్​ ఏరో-డిజైన్ అల్లాయ్ వీల్స్ మినహా మిగిలిన రూపం పాత మోడల్ తరహాలోనే ఉంటుంది. డోర్లపై 'Tata.ev' బ్యాడ్జింగ్ కనిపిస్తుంది.

వెనుక భాగం: పెట్రోల్ పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాగే, దీనికి కూడా కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉంది.

2. ఇంటీరియర్​ అండ్​ ఫీచర్స్​..

పెద్ద స్క్రీన్: ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో ప్రస్తుతమున్న 10.25-ఇంచ్​ స్క్రీన్ స్థానంలో, భారీ 12.3- ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది.

సేఫ్టీ (అడాస్​): ఈ అప్‌డేట్‌లో అతిపెద్ద హైలైట్ లెవల్ 2 అడాస్​ (అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెన్స్​ సిస్టెమ్​). దీని ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

3. బ్యాటరీ అండ్​ రేంజ్..

మీడియం రేంజ్: 25 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ (సుమారు 315 కి.మీ రేంజ్).

లాంగ్ రేంజ్: 35 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ (సుమారు 421 కి.మీ రేంజ్).

అయితే టాటా మోటార్స్​ ఇటీవలే ఒక వీడియో రిలీజ్​ చేసింది. అందులో 2026 టాటా పంచ్​ ఈవీ ఉంది. ఆ వీడియోలో టాటా పంచ్​ ఈవీ సింగిల్​ ఛార్జ్​తో 590 కి.మీ కన్నా ఎక్కువ తిరిగినట్టు చెప్పారు. ఈ భారీ రేంజ్​కి కారణాలను లాంచ్​ టైమ్​లో సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.

590 కి.మీ రేంజ్​ టాటా పంచ్​ ఈవీ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

పవర్: చిన్న బ్యాటరీ 80 హెచ్​పీ పవర్‌ను, పెద్ద బ్యాటరీ 120 హెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి.

టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​- ధర (అంచనా)..

కొత్త ఫీచర్ల కారణంగా ఈ టాటా పంచ్​ ఈవీ ఫేస్​లిఫ్ట్​ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

ప్రారంభ ధర: రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

టాప్ వేరియంట్: రూ. 15.49 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe