Tata Sierra EV price : 2026లో బిగ్గెస్ట్ లాంచ్‌గా నిలిచిన టాటా సియెర్రా ఈవీని మీరు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్..

టాటా సియెర్రా ఈవీ ప్యూర్ 63 ఆర్డబ్ల్యూడీ- రూ. 19.76 లక్షలు
ప్యూర్ ఎస్ 63 ఆర్డబ్ల్యూడీ- రూ. 21.01 లక్షలు
అడ్వెంచర్ 63 ఆర్డబ్ల్యూడీ- రూ. 22.06 లక్షలు
అడ్వెంచర్ 75 ఆర్డబ్ల్యూడీ- రూ. 23.49 లక్షలు
ఎంపవర్డ్ 63 ఆర్డబ్ల్యూడీ- రూ. 23.94 లక్షలు
ఎంపవర్డ్ 75 ఆర్డబ్ల్యూడీ- రూ. 25.17 లక్షలు
ఎంపవర్డ్ ఏ 75 ఆర్డబ్ల్యూడీ- రూ .26.22 లక్షలు
ఎంపవర్డ్ ఏ 75 క్యూడబ్ల్యూడీ- రూ. 27.47 లక్షలు.
అంటే.. హైదరాబాద్‌లో టాటా సియెర్రా ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 19.76లక్షల నుంచి రూ. 27.47 లక్షల వరకు ఉంటుందని అర్థం.
సాధారణంగా ఒక కారును లాంచ్ చేస్తున్నప్పుడు ఆటోమొబైల్ సంస్థలు.. దాని ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే రివీల్ చేస్తాయి. కానీ ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది ఎక్స్‌షోరూం ధర కన్నా ఎక్కువగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరువేరుగా ఉండటం ఇందుకు కారణం.
అందుకే ఏదైనా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
{{/usCountry}}అందుకే ఏదైనా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. దాని ఎక్స్‌షోరూం ధరతో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
{{/usCountry}}మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్లు, టెస్ట్ డ్రైవ్ వంటివి తెలుసుకోవచ్చు.
టాటా సియెర్రా ఈవీ- బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లు..
టాటా సియెర్రా ఈవీలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 63 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ఆప్షన్లను అందించారు. ఇవి రెండు రకాల డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్స్‌తో వస్తాయి.
63 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది కేవలం రియర్-వీల్-డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ) సెటప్‌తో మాత్రమే లభిస్తుంది.
75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్: ఇది రియర్-వీల్-డ్రైవ్, పవర్‌ఫుల్ క్వాడ్-వీల్-డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
వేరియంట్లు, బ్యాటరీ బట్టి టాటా సియెర్రా ఈవీ రియల్ వరల్డ్ రేంజ్ 460 కి.మీ నుంచి 500 కి.మీ వరకు ఉంటుంది.
టాటా సియెర్రా ఈవీ వేరియంట్ల వారీగా ఫీచర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
టాటా సియెర్రా ఈవీ- ఛార్జింగ్ టైమ్..
టాటా సియెర్రా ఈవీలోని 2 బ్యాటరీలు కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. 63 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కేవలం 25 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. పెద్దదైన 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 20% నుంచి 80% ఛార్జింగ్ స్థాయిని చేరుకోవడానికి దాదాపు 26 నిమిషాల సమయం తీసుకుంటుంది.