భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరల భారం వల్ల వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో సరికొత్తగా విడుదలైన ‘టాటా సియెర్రా ఈవీ’, లగ్జరీ లుక్‌తో దూసుకెళుతున్న 'మహీంద్రా బీఈ 6' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- బ్యాటరీ ప్యాక్, రేంజ్..

రెండు కార్లు కూడా లాంగ్ డ్రైవ్స్ కోసం పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.
ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 63 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్డబ్ల్యూడీ) మోడల్ 234 బీహెచ్పీ పవర్, 315 ఎన్ఎం టాక్‌ను ఇస్తుంది. పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్డబ్ల్యూడీ) మోడల్ 206.5 బీహెచ్పీ పవర్, 315 ఎన్ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్‌లో ఇదే 75 kWh బ్యాటరీతో డ్యూయల్ మోటార్స్ వస్తాయి.. ఇది గరిష్టంగా 302 బీహెచ్పీ పవర్, 504 ఎన్ఎం టాక్‌ను జనరేట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది గరిష్టంగా 665 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.
మహీంద్రా బీఈ 6-
మహీంద్రా సైతం రెండు బ్యాటరీ ఆప్షన్లను ఇస్తోంది. 59 kWh బ్యాటరీ వెర్షన్ 228 బీహెచ్పీ పవర్, 79 kWh బ్యాటరీ వెర్షన్ 282 బీహెచ్పీ పవర్‌ను ఇస్తాయి. అయితే రెండింటిలోనూ టార్క్ 380 ఎన్ఎంగానే ఉంటుంది. ఇది కేవలం సింగిల్ మోటార్ రియర్-వీల్ డ్రైవ్‌తోనే వస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది గరిష్టంగా 683 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుంది.
టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ఫీచర్లు..
సాంకేతికత, లగ్జరీ ఫీచర్ల పరంగా రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా దేనికదే సాటిగా నిలుస్తున్నాయి.
{{/usCountry}}సాంకేతికత, లగ్జరీ ఫీచర్ల పరంగా రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా దేనికదే సాటిగా నిలుస్తున్నాయి.
{{/usCountry}}టాటా సియెర్రా ఈవీ-
ఇందులో ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ (10.24 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్, 12.3 ఇంచ్ ప్యాసింజర్ డిస్‌ప్లే)
- ఫ్రంట్ వెంటిలేటెడ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు
- హెడ్స్-అప్ డిస్‌ప్లే
- టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (6 మోడ్స్)
- 540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా
- వయర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
- ముందు ఉండే ప్యాసింజర్ కోసం గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్
మహీంద్రా బీఈ 6 ఫీచర్లు-
- డ్యూయల్ 12.3 ఇంచ్ స్క్రీన్స్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్‌ఫోటైన్‌మెంట్)
- 16-స్పీకర్ల ప్రీమియం హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
- 16 మిలియన్ కలర్ ఆప్షన్లతో అంబియంట్ లైటింగ్
- 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు
- గెస్టర్-కంట్రోల్డ్ పవర్డ్ టెయిల్‌గేట్ (డిక్కీ ఆటోమేటిక్ ఓపెనింగ్)
- డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ధరలు..
ధరల విషయంలో రెండు బ్రాండ్లు కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా కాంపిటీటివ్ ప్రైసింగ్‌ను అందించాయి.
టాటా సియెర్రా ఈవీ ధర: రూ. 18.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 24.79 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). (ఏడబ్ల్యూడీ ఎడిషన్ రూ. 25.99 లక్షల వరకు ఉంది).
మహీంద్రా బీఈ 6 ధర: రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్ రూ. 26.90 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
టాటా సియెర్రా ఈవీ వర్సెస్ మహీంద్రా బీఈ 6- ఎది కొనాలి?
మీకు ఆఫ్-రోడింగ్ సామర్థ్యం ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ), ప్యాసింజర్ కోసం అదనపు స్క్రీన్ కావాలనుకుంటే టాటా సియెర్రా ఈవీ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా ఫ్యూచరిస్టిక్ డిజైన్, అదిరిపోయే మ్యూజిక్ సిస్టమ్ (16 స్పీకర్లు), అత్యధిక రేంజ్ (683 కిమీ) కావాలనుకుంటే మహీంద్రా బీఈ 6 అద్భుతంగా సరిపోతుంది.