భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ టాటా మోటార్స్ ఇటీవల తన ఐకానిక్ మోడల్ 'సియెర్రా ఈవీ'ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. టాటా ఈవీ పోర్ట్‌ఫోలియోలో చేరిన ఈ 6వ ఎలక్ట్రిక్ కారు.. ముఖ్యంగా తన క్వాడ్-వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూడీ) ఆప్షన్‌తో వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, టాటా లైనప్‌లో ఈ క్యూడబ్ల్యూడీ టెక్నాలజీతో పరిచయమైన మొదటి కారు సియెర్రా కాదు. అంతకంటే ముందే మార్కెట్లోకి అడుగుపెట్టిన ‘టాటా హారియర్ ఈవీ’లోనే కంపెనీ ఈ పవర్‌ఫుల్ సెటప్‌ను మొదట తీసుకొచ్చింది.

మరి ఒకే బ్రాండ్ నుంచి దాదాపు ఒకే రకమైన ఫీచర్లతో కనిపిస్తున్న ఈ రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మధ్య ఉన్న అసలు తేడాలేంటి? పవర్, మైలేజ్, ధరల్లో ఏది ముందంజలో ఉందో ఇక్కడ తెలుసుకోండి..
క్యూడబ్ల్యూడీ అంటే ఏంటి?
క్యూడబ్ల్యూడీ అంటే క్వాడ్ వీల్ డ్రైవ్. ఆటోమొబైల్ కంపెనీలు ఉపయోగించే మార్కెటింగ్ టర్మ్ ఇది. ఇందులో డ్యూయెల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్.. ఫ్రెంట్- రేర్ యాక్సిల్కి ఇండిపెండెంట్‌గా పవర్‌ని సప్లై చేస్తుంది. దీని వల్ల పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ సులభం అవుతుంది. సేఫ్టీ సైతం పెరుగుతుంది.
టాటా హారియర్ ఈవీ వర్సెస్ టాటా సియెర్రా ఈవీ- పర్ఫార్మెన్స్..
ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలోనూ టాటా మోటార్స్ విభిన్న అవసరాలకు తగ్గట్టుగా విడివిడి బ్యాటరీ ఆప్షన్లను అందించింది.
టాటా సియెర్రా ఈవీ: ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. బేస్ 63 kWh బ్యాటరీ వెర్షన్ (ఆర్డబ్ల్యూడీ) 234 బీహెచ్పీ పవర్‌ను, 315 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. అలాగే పెద్దదైన 75 kWh బ్యాటరీ సింగిల్ మోటార్ వెర్షన్ 206.5 బీహెచ్పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇక దీని టాప్ ఎండ్ క్వాడ్-వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ వేరియంట్ ఏకంగా 302 బీహెచ్పీ పవర్‌ను, 504 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌పై 665 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
టాటా హారియర్ ఈవీ: ఇందులో 65 kWh బేస్ బ్యాటరీ (ఆర్డబ్ల్యూడీ) 234.67 బీహెచ్పీ పవర్, 315 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ సింగిల్ మోటార్ వెర్షన్ కూడా ఇదే పవర్‌ను ఇస్తుంది. అయితే, హారియర్ ఈవీ టాప్ ఎండ్ క్యూడబ్ల్యూడీ డ్యూయల్ మోటార్ వేరియంట్ పవర్లో సియెర్రా కంటే చాలా ముందంజలో ఉంది. ఇది గరిష్టంగా 390 బీహెచ్పీ పవర్‌ను, 504 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని రేంజ్ సింగిల్ చార్జ్‌పై 622 కిలోమీటర్లుగా ఉంది.
{{/usCountry}}టాటా హారియర్ ఈవీ: ఇందులో 65 kWh బేస్ బ్యాటరీ (ఆర్డబ్ల్యూడీ) 234.67 బీహెచ్పీ పవర్, 315 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 75 కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ సింగిల్ మోటార్ వెర్షన్ కూడా ఇదే పవర్‌ను ఇస్తుంది. అయితే, హారియర్ ఈవీ టాప్ ఎండ్ క్యూడబ్ల్యూడీ డ్యూయల్ మోటార్ వేరియంట్ పవర్లో సియెర్రా కంటే చాలా ముందంజలో ఉంది. ఇది గరిష్టంగా 390 బీహెచ్పీ పవర్‌ను, 504 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని రేంజ్ సింగిల్ చార్జ్‌పై 622 కిలోమీటర్లుగా ఉంది.
{{/usCountry}}ఆఫ్‌రోడ్ పంచ్: ప్యూర్ పర్ఫార్మెన్స్ పవర్ విషయంలో హారియర్ ఈవీ (390 bhp) టాప్‌లో ఉండగా, ఎక్కువ రేంజ్/మైలేజ్ (665 కిమీ) కావాలనుకునే వారికి సియెర్రా ఈవీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
టాటా హారియర్ ఈవీ వర్సెస్ టాటా సియెర్రా ఈవీ- ఫీచర్ల జాతర..
ఫీచర్ల విషయానికి వస్తే రెండు కార్లూ లగ్జరీ ఇంటీరియర్‌తో పోటీ పడుతున్నాయి. అయితే డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌లో ప్రధాన వ్యత్యాసం కనిపిస్తుంది.
సియెర్రా ఈవీ ఫీచర్లు: ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి. దీని ప్రధాన ఆకర్షణ ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్. ఇందులో 10.24-ఇంచ్ డిజిటల్ క్లస్టర్, 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3-ఇంచ్ డిస్‌ప్లేను ఇచ్చారు. అదనంగా 6 టెర్రైన్ మోడ్స్, 540-డిగ్రీ కెమెరా, బూస్ట్ మోడ్ ఉన్నాయి.
హారియర్ ఈవీ ఫీచర్లు: ఇందులో మరింత భారీ సైజ్ గల 14.5-ఇంచ్ డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. వెల్‌కమ్ రిట్రాక్ట్ గల 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 4-వే పవర్డ్ కో-డ్రైవర్ సీట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎమ్, వైర్‌లెస్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. అంతేకాకుండా, రిమోట్ కీ ద్వారా కారును కంట్రోల్ చేసే ‘సమన్ మోడ్’, ఆటో పార్క్ అసిస్ట్, లెవెల్ 2 అడాస్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టాటా హారియర్ ఈవీ వర్సెస్ టాటా సియెర్రా ఈవీ- ధరల్లో తేడా ఎంత?
బడ్జెట్ విషయానికి వస్తే ఈ రెండు కార్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర రూ. 18.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండగా.. సైజులో కాస్త పెద్దదైన, మరింత పవర్‌ఫుల్ ఇంజన్ గల టాటా హారియర్ ఈవీ ప్రారంభ ధర రూ. 21.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
టాటా హారియర్ ఈవీ వర్సెస్ టాటా సియెర్రా ఈవీ- ఏది బెస్ట్?
మీకు బడ్జెట్ పరిధిలో ఉంటూ, అదిరిపోయే ట్రిపుల్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్, వింటేజ్ లుక్, ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే టాటా సియెర్రా ఈవీ పర్ఫెక్ట్ ఛాయిస్. అలా కాకుండా, రోడ్డుపై తిరుగులేని పవర్, భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సమన్ మోడ్, అడ్వాన్స్‌డ్ లెవెల్ సేఫ్టీ ఫీచర్లే ముఖ్యం అనుకుంటే మరికొంత బడ్జెట్ పెంచి టాటా హారియర్ ఈవీని ఎంచుకోవడం ఉత్తమం.