ఇంకొన్ని రోజుల్లో Tata Sierra SUV లాంచ్- బుకింగ్స్ షురూ..!
టాటా సియెర్రా ఎస్‌యూవీ అనధికారిక బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుకింగ్ అమౌంట్, ఫీచర్స్ సహా ఈ ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టాటా మోటార్స్‌కి చెందిన ఐకానిక్ సియెర్రా.. ఇప్పుడు సరికొత్తగా భారతీయుల ముందుకు రానుంది. ఈ టాటా సియెర్రా ఎస్‌యూవీ నవంబర్ 25న లాంచ్ కానుంది. కొన్ని డీలర్ల వద్ద ఇప్పటికే అనధికారిక బుకింగ్స్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రూ. 21వేల టోకెన్ అమౌంట్‌తో మీరు ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్‌యూవీ..
టాటా మోటార్స్ సంస్థ 1990ల నాటి ఐకానిక్ సియెర్రా పేరును పునరుద్ధరిస్తూ, ఈ సరికొత్త ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. ఈ కొత్త వెర్షన్ సమకాలీన స్టైలింగ్‌తో పాటు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రీమియం క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇది గతంలో కాన్సెప్ట్ రూపంలో, ఆ తర్వాత ఉత్పత్తికి ముందున్న రూపంలో పలుమార్లు కనిపించింది.
కొత్త సియెర్రాలో మూడు డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, రెండు కొత్త ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
టాటా సియెర్రా- డిజైన్, ఎక్స్టీరియర్..
సియెర్రాలోని క్లాసిక్ బాక్సీ సిల్హౌట్‌ని ముందుకు తీసుకువెళుతూనే ఆధునిక స్టైలింగ్ అంశాలతో రీడిజైన్ చేసింది టాటా మోటార్స్. ఇందులో నిటారుగా ఉండే డిజైన్ ప్రధానంగా కనిపిస్తుంది. గ్లోస్-బ్లాక్ ప్యానెల్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, డీఆర్‌ఎల్‌లు, బ్రాండ్ లోగో, ఆకర్షణీయమైన "Sierra" అక్షరాలను అతుకు లేకుండా కలుపుతాయి.
ముందు బంపర్‌లోకి చక్కగా అనుసంధానించిన స్కిడ్ ప్లేట్, ట్విన్ ఫాగ్ ల్యాంప్స్ దీనికి మరింత పటిష్టమైన రూపాన్ని ఇస్తాయి.
టాటా సియెర్రా- ఇంటీరియర్, ఫీచర్లు..
టాటా సియెర్రా లోపల మూడు డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లేలు ఉన్నాయి:
- డ్రైవర్ కోసం ఒకటి (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్).
- ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరో రెండు డిస్‌ప్లేలు, ఇవి కంటెంట్‌ను సులభంగా పంచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఇది టాటా కర్వ్ మోడల్‌లో ఉన్న తరహాలో, ప్రకాశించే లోగో, టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్‌తో కూడిన 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను ఉపయోగిస్తుంది.
ఈ ఎస్‌యూవీ క్యాబిన్ బ్లాక్-అండ్-గ్రే థీమ్‌లో రూపొందించిన. పనోరమిక్ సన్‌రూఫ్ సీ-పిల్లర్ వరకు విస్తరించి, లోపల మరింత విశాలంగా, వెలుతురుతో కూడిన అనుభూతిని ఇస్తుంది. ఇందులో ఐదుగురు కూర్చోవడానికి సీటింగ్ ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ బీజ్, గ్రే రంగుల్లో ఉంటాయి. ప్రతి సీటుకు అడ్జెస్ట్ చేయగల హెడ్‌రెస్ట్‌లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి.
టాటా సియెర్రా- ఇంజిన్ ఆప్షన్స్..
కొత్త టాటా సియెర్రాలో కార్ల తయారీదారు తొలిసారిగా తీసుకొస్తున్న 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఈ ఇంజిన్‌ను ఆటో ఎక్స్‌పో 2023లో మొదటిసారి ప్రదర్శించారు.
1.5-లీటర్ టర్బో-పెట్రోల్: ఇది సుమారు 170 హెచ్‌పీ పవర్‌ని, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్- ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
నివేదికల ప్రకారం.. టాటా ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది 118 హెచ్‌పీ పవర్‌ని, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది టాటా కర్వ్, నెక్సాన్‌లో ఉపయోగించిన ఇంజిన్ యూనిట్.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


