Budget electric cars : రూ. 5లక్షల లోపే 2 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు- బేస్ వేరియంట్లలో ఏది బెస్ట్?
Tata Tiago EV vs MG Comet EV : బడ్జెట్ పరిమితులు ఉండి, నగర ప్రయాణాల కోసం ఒక మంచి ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ కామెట్ ఈవీలు మంచి ఆప్షన్లుగా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకం? ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది! టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్.. తన ఐసీఈ (పెట్రోల్) మోడల్ కంటే భిన్నమైన, సరికొత్త డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. మరోవైపు అఫార్డిబుల్ ధరలో, సిటీ రైడ్‌కి ఉపయోగపడే విధంగా రూపొందించిన ఎంజీ కామెట్ ఈవీకి కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారి కోసం టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్ ‘స్మార్ట్ 19’, దానికి గట్టి పోటీగా ఉన్న ఎంజీ కామెట్ ఈవీ బేస్ వేరియంట్ ‘ఎగ్జిక్యూటివ్’ ధరలు, రేంజ్, ఛార్జింగ్ ఫీచర్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బేస్ వేరియంట్ల ధరలు..
| టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బేస్ వేరియంట్ల ధరలు.. | ||
|---|---|---|
| టాటా టియాగో ఈవీ స్మార్ట్ 19 | ఎంజీ కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్ | |
| ధర (ఎక్స్‌షోరూం) | ₹6.99 lakh | ₹7.63 lakh |
| బీఏఏఎస్ | ₹4.69 lakh + 2.60/km | ₹4.99 lakh + ₹3.20/km |
బీఏఏఎస్ (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) అంటే ఏంటి?
ఈ స్కీమ్ కింద కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను మినహాయించి కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు చెల్లిస్తారు. దీనివల్ల కారు ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. ఆ తర్వాత మీరు కారును నడిపిన కిలోమీటర్లను బట్టి బ్యాటరీకి అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధానంలో కూడా టియాగో ఈవీ ప్రతీ కిలోమీటర్‌కు 60 పైసలు తక్కువ అద్దెతో కామెట్ ఈవీ కంటే లాభదాయకంగా ఉంది.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బేస్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు..
| టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బేస్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు | ||
|---|---|---|
| టాటా టియాగో ఈవీ | ఎంజీ కామెట్ ఈవీ | |
| బ్యాటరీ | 19.2 kWh | 17.3 kWh |
| రేంజ్ (ఏఆర్ఏఐ) | 226 km | 230 km |
| పీక్ పవర్ | 61 bhp | 41.42 bhp |
| పీక్ టార్క్ | 110 Nm | 110 Nm |
బ్యాటరీ, పవర్: టాటా టియాగో ఈవీ బేస్ వేరియంట్‌లో 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది ఎంజీ కామెట్ ఈవీ (17.3 kWh) కంటే కాస్త పెద్దది కావడం వల్ల టియాగో ఈవీ ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే టార్క్ విషయంలో రెండు కార్లు సమానంగా ఉన్నాయి.
రైడింగ్ రేంజ్: ఆన్-పేపర్ సర్టిఫైడ్ రేంజ్ విషయానికి వస్తే మాత్రం ఎంజీ కామెట్ ఈవీ.. టియాగో ఈవీ కంటే స్వల్పంగా ఎక్కువ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీలు పేర్కొన్నాయి. (టియాగో హయ్యర్ వేరియంట్ 24 kWh బ్యాటరీతో 285 కిమీ రేంజ్ ఇస్తుంది).
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనదారులకు ఛార్జింగ్ వేగం అనేది చాలా కీలకం. ఈ విభాగంలో టాటా టియాగో ఈవీ స్పష్టమైన ఆధిక్యతను కలిగి ఉంది.
టాటా టియాగో ఈవీ (డీసీ ఫాస్ట్ ఛార్జింగ్): ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 30 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. అలాగే 10 నుంచి 80 శాతం ఛార్జింగ్ కేవలం 35 నిమిషాల్లో పూర్తవుతుంది. అదే 7.2 kW AC ఛార్జర్ అయితే 10-100% కావడానికి 2.6 గంటలు, సాధారణ 3.3 kW ఛార్జర్ అయితే 6.9 గంటలు పడుతుంది.
ఎంజీ కామెట్ ఈవీ: కామెట్ ఈవీ బేస్ మోడల్‌కు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. దీనిని 7.4 kW AC ఛార్జర్ ద్వారా 0-100% ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంటలు పడుతుంది. అదే 3.3 kW సాధారణ ఛార్జర్ అయితే పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 7 గంటల సమయం పడుతుంది.
టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ ఎంజీ కామెట్ ఈవీ- బేస్ వేరియంట్లలో ఏది బెస్ట్?
మీకు సాంప్రదాయ హ్యాచ్‌బ్యాక్ లుక్, ఎక్కువ పవర్, అతి ముఖ్యంగా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ ధరలో కావాలనుకుంటే టాటా టియాగో ఈవీ స్మార్ట్ 19 పర్ఫెక్ట్ ఛాయిస్. అలా కాకుండా కేవలం సిటీ లోపల ఇరుకైన సందుల్లో తిరగడానికి చిన్న ఎలక్ట్రిక్ కారు చాలనుకుంటే ఎంజీ కామెట్ వైపు చూడవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


