India vs England: టీమిండియాకు ఏమైంది? ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. 76 రన్స్ కే ఆలౌట్.. ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు!

Ind vs Eng: ఇది టీ20 ప్రపంచ ఛాంపియన్ టీమేనా? వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఇలాగేనా ఆడేది?.. ఇవీ ఇంగ్లాండ్ తో మూడో టీ20లో టీమిండియా ఆట చూసిన తర్వాత రేకెత్తుతున్న అనుమానాలు. దారుణమైన ఆటతీరుతో భారత్ అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది. చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. 

Published on: Jul 8, 2026, 06:15:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

India vs England: వరుసగా రెండు సార్లు ప్రపంచ టీ20 ఛాంపియన్ టీమిండియా. జట్టులో ప్రపంచ స్థాయి టీ20 ఆటగాళ్లు. అపోనెంట్ ఏదైనా తుక్కురేగ్గొడుతూ వరుస విజయాలు సాధించిన టీమ్ అది. కానీ ఇప్పుడు ఒక్క విక్టరీ కోసం ఎదురు చూస్తోంది. ఇంగ్లాండ్ తో మూడో టీ20లో దారుణ పరాభవాన్ని ఖాతాలో వేసుకుంది. అసలు టీమిండియాకు ఏమైంది?

టీమిండియాకు ఏమైంది? ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. 76 రన్స్ కే ఆలౌట్.. ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు!
టీమిండియాకు ఏమైంది? ఇంగ్లాండ్ చేతిలో దారుణ ఓటమి.. 76 రన్స్ కే ఆలౌట్.. ఫస్ట్ టైమ్ చెత్త రికార్డు!

చెత్త రికార్డు

మంగళవారం (జూలై 7) రాత్రి ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అత్యంత అవమానకరమైన రీతిలో ఓటమి పాలైంది. టీ20 చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. భారత జట్టు ఏకంగా 125 రన్స్ తేడాతో ఓడిపోయింది.

ఇదేం బ్యాటింగ్?

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70), సామ్ కరణ్ (24 బంతుల్లో 41 నాటౌట్) చెలరేగారు. భారీ ఛేజింగ్ లో భారత్ బొక్కబోర్లా పడింది. కనీసం 100 రన్స్ కూడా చేయలేకపోయింది. 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.

టాప్ బ్యాటర్లు

ఇంగ్లాండ్ తో మూడో టీ20లో ఇండియన్ బ్యాటర్ల బ్యాటింగ్ చూశాక షాక్ కలగక తప్పదు. టీమ్ లో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్, నంబర్ టూ అభిషేక్ శర్మ ఉన్నాడు. వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టాలెంటెడ్ తిలక్ వర్మ ఉన్నారు. కానీ ఇలాంటి టీమ్ మొత్తం కలిపి చేసింది ఓన్లీ 76 రన్స్.

నలుగురే

ఈ మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో కేవలం నలుగురు మాత్రమే 10కి పైగా స్కోరు చేశారంటే, మన బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ శర్మ (10), వైభవ్ (13), ఇషాన్ కిషన్ (13), అక్షర్ పటేల్ (10) ఆ ఘనత అందుకున్నారు. మ్యాచ్ జరిగింది ఇంగ్లాడ్ లో కావొచ్చు, అపోనెంట్ బౌలర్లు ప్రమాదకరంగా ఉండొచ్చు.. కానీ భారత బ్యాటర్లు కనీసం పోరాడకుండా చేతులెత్తేయడం మాత్రం ఊహించనిదే.

టీమ్ కు ఏమైంది?

టీ20 వరల్డ్ ఛాంపియన్ టీమిండియా ఇలా ఆడుతుందని ఏ అభిమాని అనుకోని ఉండడు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఏదీ కలిసి రావడం లేదని చెప్పొచ్చు. పసికూన ఐర్లాండ్ పై వరుసగా రెండు టీ20లు ఓడిపోయింది టీమ్. ఇప్పుడు ఇంగ్లాండ్ పై వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. భారత జట్టు గత అయిదు టీ20ల్లో ఒక్క విక్టరీ కూడా సాధించకపోవడం ఇదే ఫస్ట్ టైమ్.

ప్లానింగ్ ఏదీ?

ఐర్లాండ్ తో సిరీస్ లో భారత బౌలింగ్, బ్యాటింగ్ లోపాలు బయటపడ్డాయి. కానీ దిద్దుబాటు చర్యలే లేవు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ లోనూ టీమ్ ప్లానింగ్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. బౌన్సీ, సీమ్ పిచ్ లు ఉండే ఇంగ్లాండ్ లో సెకండ్ టీ20లో ఇండియా ముగ్గురు స్పిన్నర్లను ఆడించింది. ఫలితం.. రవి బిష్ణోయ్ పేలవ బౌలింగ్ తో మ్యాచ్ చేజారింది.

స్పిన్నర్ల బౌలింగ్

మూడో టీ20లో ఇండియా ఏకంగా ముగ్గురు పేసర్లు, ఓ పేస్ ఆల్ రౌండర్ ను బరిలో దించింది. కానీ స్పిన్నర్లతోనే ఏకంగా 7 ఓవర్లు వేయించింది. ఈ 7 ఓవర్లలో 84 రన్స్ వచ్చాయి. ఒక్కటే వికెట్ పడింది. ఇక బ్యాటింగ్ మరీ దారుణం. సొంత కండీషన్లలో ఇంగ్లాండ్ పేసర్లు చెలరేగుతారని తెలుసు. కానీ అందుకు తగ్గ ప్రిపరేషన్ కనిపించలేదు. దీంతో ఆర్చర్, టాంగ్ వికెట్ల పండగ చేసుకున్నారు.

టీమిండియా ఇప్పటికైనా మారాలి. ముఖ్యంగా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోగానే అగ్ని పరీక్ష ఎదుర్కుంటున్న శ్రేయస్ అయ్యర్ తన ప్లాన్స్ మార్చాలి. అలా అయితేనే టీమ్ మళ్లీ విక్టరీ అందుకుంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More