ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్ ఈసారి దీపావళి పండుగను అక్కడే జరుపుకుంది. అడిలైడ్‌లోని 'బ్రిటీష్ రాజ్' అనే రెస్టారెంట్‌లో టీమ్ డిన్నర్ చేసుకున్నారు. ఈ రెస్టారెంట్‌కు, టీమిండియాకు మధ్య ఒక హిస్టరీ ఉంది. ఆ వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనాన్ని చదవండి.
టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్

ఈ ఏడాది దీపావళి సంబరాలలో తమ ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ, ఇండియన్ మెన్స్ క్రికెట్ టీమ్.. ఆస్ట్రేలియాలో ఈ పండుగను జరుపుకునే అవకాశాన్ని పొందింది. వైట్-బాల్ సిరీస్‌లో రెండో వన్డే కోసం అడిలైడ్‌కు చేరుకున్న తర్వాత, ఈ సౌత్ ఆస్ట్రేలియా నగరంలోని ఒక ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్‌లో పలువురు ప్రముఖ ఆటగాళ్లు కలిసి టీమ్ డిన్నర్ చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వంటి ప్రముఖ భారత క్రికెట్ స్టార్లు అడిలైడ్ శివారులోని టోర్రెన్స్‌విల్లేలో ఉన్న 'బ్రిటీష్ రాజ్' అనే రెస్టారెంట్‌కు బచ్చారు. ఈ ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లినప్పుడల్లా మన ప్లేయర్స్ కి ఇష్టమైన రెస్టారెంట్‌లలో ఇదీ ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
విదేశీ గడ్డపై తమ కుటుంబాలకు దూరంగా ఉన్న ఈ సూపర్ స్టార్స్‌కు ఇది ఇంటి రుచిని అందించింది. శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు కూడా అడిలైడ్‌లో జరిగిన ఈ టీమ్ డిన్నర్‌లో పాల్గొన్నారు. రెస్టారెంట్ యజమాని రోహిత్ శర్మతో సహా ఇతర ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు.
ఈ రెస్టారెంట్‌తో టీమిండియా హిస్టరీ ఇలా..
పెర్త్‌లో జరిగిన సిరీస్‌లోని మొదటి వన్డేలో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి తర్వాత, క్రికెట్ ఫీల్డ్ కి దూరంగా ఉంది టీమిండియా. అయితే ఈ టీమ్ డిన్నర్ ద్వారా ప్లేయర్స్ అందరూ మరోసారి కలిసి, రీబూట్ అయ్యే అవకాశం దక్కింది. చివరిసారిగా టీమ్ డిన్నర్ కోసం ఈ నెల మొదట్లోనే ప్లేయర్స్ వెళ్లారు. అప్పుడు వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఢిల్లీలోని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసానికి వెళ్లారు.
{{/usCountry}}పెర్త్‌లో జరిగిన సిరీస్‌లోని మొదటి వన్డేలో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి తర్వాత, క్రికెట్ ఫీల్డ్ కి దూరంగా ఉంది టీమిండియా. అయితే ఈ టీమ్ డిన్నర్ ద్వారా ప్లేయర్స్ అందరూ మరోసారి కలిసి, రీబూట్ అయ్యే అవకాశం దక్కింది. చివరిసారిగా టీమ్ డిన్నర్ కోసం ఈ నెల మొదట్లోనే ప్లేయర్స్ వెళ్లారు. అప్పుడు వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఢిల్లీలోని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నివాసానికి వెళ్లారు.
{{/usCountry}}భారత జట్టు 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు ముందు అడిలైడ్‌లోని బ్రిటిష్ రాజ్ రెస్టారెంట్‌లో భోజనం చేసింది. అయితే ఆ తర్వాత బ్రిటీష్ టీమ్ ఇండియన్ టీమ్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేయడంతో ఈ రెస్టారెంట్ తో అనుబంధంపై ఓ మచ్చ పడింది.
ఈసారి అడిలైడ్ ఓవల్‌లో మెరుగైన ఫలితం కోసం భారత జట్టు ఆశిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో అడిలైడ్ లో టీమిండియాకు అంత మంచి రికార్డేమీ లేదు. దీంతో రెండో వన్డేలో ఏం చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే తొలి వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లికి మాత్రం ఈ అడిలైడ్ లో అదిరిపోయే రికార్డు ఉంది. ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. మరి ఈ మ్యాచ్ లో అతడు ఎలా రాణిస్తాడో చూడాలి.