భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు టెక్నో సంస్థ తన సరికొత్త 'పోవా కర్వ్ 2 5జీ' స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. గతేడాది మే నెలలో మార్కెట్లోకి వచ్చిన పోవా కర్వ్ 5జీకి కొనసాగింపుగా ఈ హ్యాండ్‌సెట్‌ను సంస్థ తీసుకొస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లకు సంబంధించిన అధికారిక వివరాలను టెక్నో పంచుకుంది. అయితే ఇతర కీలకమైన స్పెసిఫికేషన్లను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టెక్నో పోవా కర్వ్ 2- లాంచ్ తేదీ, సమయం..

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టెక్నో పోవా కర్వ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ జరగనుంది. ఈ మేరకు ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా లాంచ్ తేదీని ప్రకటించడంతో పాటు డివైజ్‌కు సంబంధించిన మొదటి అధికారిక లుక్‌ను కూడా సంస్థ వెల్లడించింది. ఈ ఫోటోను గమనిస్తే, గత మోడల్‌తో పోలిస్తే రియర్ లేఅవుట్, కెమెరా అమరికలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.
టెక్నో పోవా కర్వ్ 2- డిజైన్, కీలక ఫీచర్లు ..
టెక్నో పోవా కర్వ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది, ఇది ఎడ్జెస్కి వెళ్లే కొద్దీ సన్నగా మారుతుంది. దీని రియర్ ప్యానెల్ మ్యాట్-స్టైల్ ఫినిషింగ్‌ను కలిగి ఉండి, మునుపటి పోవా కర్వ్ 5జీ తరహాలోనే లైన్లను కలిగి ఉంది. సిరీస్ డిజైన్ కొనసాగింపును కాపాడటం కోసం టెక్నో ఈ ఎలిమెంట్లను అలాగే ఉంచింది.
అయితే, కెమెరా మాడ్యూల్‌లో మాత్రం భారీ మార్పు కనిపిస్తోంది! పాత మోడల్‌లో ఉన్న వర్టికల్ కెమెరా లేఅవుట్‌ను పక్కన పెట్టి, ఈసారి ‘ట్రయాంగ్యులర్’, అసమాన కెమెరా ఐలాండ్‌ను టెక్నో ఎంచుకుంది. దీనిలో ఒక హారిజాంటల్ పిల్-షేప్డ్ సెక్షన్‌లో రెండు కెమెరా లెన్స్‌లు ఉండగా, మూడవ లెన్స్ విడిగా కింద భాగంలో అమర్చారు. ఆ కింద లెన్స్ పక్కనే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. బ్యాక్ ప్యానెల్‌పై పోవా బ్రాండింగ్, రెగ్యులేటరీ టెక్స్ట్ కూడా కనిపిస్తాయి.
టెక్నో పోవా కర్వ్ 2- రంగులు, బ్యాటరీ..
ఈ టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ధృవీకరించింది. భారతీయ వినియోగదారులు బ్లాక్, సిల్వర్, వైలెట్ రంగుల్లో దీనిని ఎంచుకోవచ్చు. ప్రతి కలర్ వేరియంట్లోనూ బ్యాక్ ప్యానెల్ దిగువన ఒక చిన్న సెమీ-ట్రాన్స్పరెన్ట్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే, స్టోరేజ్ వేరియంట్లను బట్టి రంగుల్లో ఏవైనా మార్పులు ఉంటాయా అనే విషయంపై క్లారిటీ లేదు.
{{/usCountry}}ఈ టెక్నో పోవా కర్వ్ 2 స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ ధృవీకరించింది. భారతీయ వినియోగదారులు బ్లాక్, సిల్వర్, వైలెట్ రంగుల్లో దీనిని ఎంచుకోవచ్చు. ప్రతి కలర్ వేరియంట్లోనూ బ్యాక్ ప్యానెల్ దిగువన ఒక చిన్న సెమీ-ట్రాన్స్పరెన్ట్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే, స్టోరేజ్ వేరియంట్లను బట్టి రంగుల్లో ఏవైనా మార్పులు ఉంటాయా అనే విషయంపై క్లారిటీ లేదు.
{{/usCountry}}కంపెనీ అధికారికంగా హార్డ్‌వేర్ వివరాలను వెల్లడించనప్పటికీ, పలు నివేదికల ప్రకారం ఈ ఫోన్ మీడియాటెక్ ఎంటీ6858 ప్రాసెసర్ (డైమెన్సిటీ 7100) పై పనిచేసే అవకాశం ఉంది. ఇది 12జీబీ వరకు ర్యామ్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, టీయూవీ సర్టిఫికేషన్ ప్లాట్‌ఫామ్ ప్రకారం, ఈ ఫోన్‌లో 7,750ఎంఏహెచ్ లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉండవచ్చని తెలుస్తోంది.
పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలను లాంచ్ ఈవెంట్ రోజైన ఫిబ్రవరి 13న కంపెనీ ప్రకటించనుంది.