Asian Games: ఆసియా క్రీడల్లో అదరగొట్టిన తెలుగు అమ్మాయిలు.. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్.. డైరెక్ట్ ఒలింపిక్స్ క్వాలిఫై
Asian Games: తెలుగు అమ్మాయిలు అదుర్స్. ఆసియా క్రీడలు 2026లో మన తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు అదరగొట్టారు. ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్ తో సత్తాచాటారు. ఏషియన్ గేమ్స్ ఆర్చరీలో రికార్డులు తిరగరాశారు. అంతే కాకుండా ఓ అమ్మాయి ఒలింపిక్స్ బెర్తు కూడా పట్టేసింది.
Asian Games: వావ్.. అదుర్స్.. అద్భుతం.. ఆసియా క్రీడలు 2026లో తెలుగు అమ్మాయిల ప్రదర్శన పొగడటానికి ఈ మాటలు కూడా సరిపోవు. అవును.. మన తెలుగు రాష్ట్రాల ఆర్చర్లు ఏషియన్ గేమ్స్ 2026లో అదరగొట్టారు. ఒకే రోజు ఏకంగా రెండు స్వర్ణాలు ఖాతాలో వేసుకున్నారు. ఆ తెలుగు తేజాలే.. వెన్నం జ్యోతి సురేఖ, చికితా రావు.

ఆసియా క్రీడలు 2026
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ కోసం ఇండియా గట్టిగా పోరాడుతోంది. ఎక్కువగా రజత పతకాలే రావడంతో దేశ ప్రజలు ఉసూరుమంటున్నారు. ఈ సమయంలో తెలుగమ్మాయిలు జ్యోతి సురేఖ, చికితా రావు బంగారు పతకాలతో అదరగొట్టారు.
చికితా రావు రెండు గోల్డ్ మెడల్స్
ఆసియా క్రీడలు 2026లో తెలంగాణ అమ్మాయి చికితా రావు సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఒకే రోజు వెంటవెంటనే రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ మహిళల టీమ్, మిక్స్ డ్ టీమ్ విభాగాల్లో చికితా ఛాంపియన్ గా నిలింది.
ఒలింపిక్స్ బెర్త్
చికితా గోల్డ్ మెడల్స్ తో అదరగొట్టడమే కాదు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్త్ కూడా పట్టేసింది. ఆ ఒలింపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీలో మిక్స్ డ్ టీమ్ విభాగంలో మాత్రమే పోటీలు పెట్టనున్నారు. ఇప్పుడు అదే విభాగంలో ఆసియా క్రీడల ఛాంపియన్ గా నిలిచిన చికితా-సాహిల్ జాదవ్ ఒలింపిక్స్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు.
ఉత్కంఠగా సాగిన కాంపౌండ్ ఆర్చరీ మిక్స్ డ్ టీమ్ విభాగం ఫైనల్లో చికితా-సాహిల్ జాదవ్ 158-157 తేడాతో ఫాంగ్యో- జిన్ యి (చైనా)పై షూటాఫ్ లో విక్టరీ సాధించింది. అంతకుముందు సెమీస్ లో కూడా భారత జోడీ ఒక్క పాయింట్ తేడాతోనే థాయ్ లాండ్ ఆర్చర్లను ఓడించింది.
జ్యోతికి పసిడి
మరోవైపు ఇండియాలో కాంపౌండ్ ఆర్చరీ అనగానే ముందుగా వినిపించేది జ్యోతి సురేఖ పేరే. ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అంతలా ఈ ఆటలో సత్తాచాటుతోంది. ఒలింపిక్స్ మినహా ఆమె పోటీపడని ఈవెంట్ లేదు, గెలవని పతకం లేదు. ఇప్పుడు ఆసియా క్రీడలు 2026లోనూ జ్యోతి మరోసారి మెరిసింది.
విమెన్ కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, చికితా, ప్రీతిక కలిసి 238-234 తేడాతో వునీర్, వాంగ్, ఫాంగ్యో (చైనా) త్రయాన్ని ఓడించారు. ప్రపంచ రికార్డును ఈక్వల్ చేస్తూ ఇండియాకు గోల్డ్ మెడల్ ను అందించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


