Tesla Model Y : ఇండియాలో టెస్లా ‘మోడల్ వై’ ఈవీపై బంపర్ ఆఫర్- ఈఎంఐ నెలకు రూ. 29వేలే!
దిగ్గజ ఎలక్ట్రిక కార్ల తయారీ సంస్థ టెస్లా భారతీయులను ఆకర్షించే పనిలో పడింది! ఇందులో భాగంగా టెస్లా మోడల్ వై ఈవీపై భారీ డిస్కౌంట్ని ప్రకటించింది. ఫలితంగా రూ. 29వేల నెలవారీ ఈఎంఐకే లగ్జరీ ఈవీ కొనుగోలు చేయొచ్చని ప్రచారం చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతీయ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు.. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగని 'మోడల్ వై' ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం కంపెనీ సరికొత్త “ఈవీ స్విచ్ అండ్ సేవ్ ప్రోగ్రామ్”ను ప్రకటించింది. పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వదిలి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారిని ఆకర్షించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రూ. 3 లక్షల ఎక్స్ఛేంజ్ బోనస్.. మరిన్ని ప్రయోజనాలు
ఈ కొత్త స్కీమ్ కింద, వినియోగదారులు తమ వద్ద ఉన్న ఏదైనా పెట్రోల్ లేదా డీజిల్ వాహనాన్ని ఎక్స్ఛేంజ్ చేసి, టెస్లా మోడల్ వై 'రియర్ వీల్ డ్రైవ్' (ఆర్డబ్ల్యూడీ) వేరియంట్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 3,00,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు, వాహన ధరను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
తక్కువ ఈఎంఐతో లగ్జరీ కారు మీ సొంతం..
టెస్లా అందిస్తున్న ఫైనాన్స్ ప్లాన్ ద్వారా మోడల్ వై ఎలక్ట్రిక్ కారు కొనుగోలు ఇప్పుడు మరింత సులభతరం కానుంది:
డౌన్‌పేమెంట్: రూ. 6,00,000
నెలవారీ ఈఎంఐ: రూ. 49,000 నుంచి ప్రారంభం.
సేవింగ్: పెట్రోల్/డీజిల్ ఖర్చులు, మెయింటెనెన్స్ పరంగా నెలకు సుమారు రూ. 20,000 వరకు ఆదా అవుతుందని అంచనా.
ఎఫెక్టివ్ ఈఎంఐ: ఈ పొదుపును పరిగణనలోకి తీసుకుంటే, కస్టమర్‌పై పడే అసలు భారం నెలకు కేవలం రూ. 29,000 మాత్రమే అని సంస్థ చెబుతోంది.
అంతేకాకుండా, ప్రతి మోడల్ వై కొనుగోలుతో పాటు టెస్లా ఒక ‘వాల్ కనెక్టర్’ను ఉచితంగా అందిస్తోంది. దీనివల్ల ఇంట్లోనే కారును సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే ఖర్చు కేవలం రూ. 1 మాత్రమేనని టెస్లా పేర్కొంది.
షరతులు వర్తిస్తాయి..
ఈ ఆఫర్ పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను గుర్తుంచుకోవాలి:
గడువు: ఈ ఆఫర్ పొందాలంటే మార్చ్ 31, 2026 లోపు ఆర్డర్ చేసి డెలివరీ తీసుకోవాలి.
పరిమితులు: ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ కేవలం మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్‌లోని నిర్దిష్ట రంగులు, వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది.
డాక్యుమెంటేషన్: ఎక్స్ఛేంజ్ చేసే వాహన పత్రాలు సరిగ్గా లేకపోయినా లేదా అనుమానాస్పదంగా ఉన్నా దరఖాస్తును తిరస్కరిస్తారు.
ఇతర ఆఫర్లు: ఇతర ప్రమోషన్లతో దీనిని కలపడానికి వీలుండదు.
టెస్లా మోడల్ వై: ఫీచర్లు, రేంజ్..
ప్రస్తుతం గురుగ్రామ్, ముంబై, దిల్లీలలో టెస్లాకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. ఆయా నగరాల్లో 12 సూపర్ ఛార్జర్లు, 10 డెస్టినేషన్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.
టెస్లా మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, ఇంకొకటి లాంగ్ రేంజ్. స్టాండర్డ్ వేరియంట్ 500 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. మరో వేరియంట్ ఏకంగా 622 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ 0-100 కేఎంపీహెచ్ స్పీడ్‌ని 5.9 సెకన్లలో అందుకుంటుంది. లాంగ్ రేంజ్ వేరియంట్‌కి ఇది కేవలం 5.6 సెకన్లు. ఈ రెండు వేరియంట్ల టాప్ స్పీడ్ 201 కేఎంపీహెచ్. ఫాస్టా ఛార్జర్‌తో స్టాండర్డ్ వేరియంట్‌ని 15 నిమిషాల్లో 267 కి.మీ రేంజ్ పొందవచ్చు. లాంగ్ వేరియంట్‌కి అది 267 కి.మీగా ఉందని కంపెనీ వెల్లడించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


