2026 Renault Duster : కొత్త రెనాల్ట్ డస్టర్ నచ్చిందా? బుకింగ్స్, డెలివరీ వివరాలు..
ఒకప్పుడు భారతదేశంలో ఎస్‌యూవీల ట్రెండ్ సెట్ చేసిన 'రెనాల్ట్ డస్టర్' సరికొత్త అవతారంలో తిరిగొచ్చింది. జనవరి 26న అధికారికంగా విడుదలైన ఈ మోడల్, అదిరిపోయే డిజైన్, స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ బుకింగ్స్, డెలివరీ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న, అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన ‘రెనాల్ట్ డస్టర్’.. కొన్నేళ్ల విరామం తర్వాత మన మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. పూర్తిస్థాయిలో రీ-డిజైన్ చేసిన స్టైలింగ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ఫీచర్లతో ‘2026 రెనాల్ట్ డస్టర్’.. ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరో స్థాయికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం భారత్‌లో క్విడ్, కైగర్, ట్రైబర్‌లను విక్రయిస్తున్న రెనాల్ట్.. ఈ కొత్త డస్టర్‌తో భారతీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో తన వాటాను గణనీయంగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మీకు ఈ ఎస్యూవీ నచ్చితే, కొనేందుకు ప్లాన్ చేస్తుంటే.. 2026 2026 రెనాల్ట్ డస్టర్‌కి సంబంధించిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
2026 రెనాల్ట్ డస్టర్- ధర, బుకింగ్స్, డెలివరీ..
2026 రెనాల్ట్ డస్టర్‌ని సంస్థ సోమవారం లాంచ్ చేసింది. కానీ ధరలను వెల్లడించలేదు. మార్చ్‌లో ధరలను ప్రకటించే అవకాశం ఉంది. కాగా ప్రీ-బుకింగ్స్‌ని మాత్రం సంస్థ ప్రారంభించింది. ఆసక్తి గల కొనుగోలుదారులు రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ‘ఆర్ పాస్’ కొనుగోలు చేయడం ద్వారా ఈ ఎస్‌యూవీని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లకు ప్రయారిటీ డెలివరీ (ముందుగా డెలివరీ పొందే అవకాశం), ఇనీషియల్ ప్రైజింగ్ బెనిఫిట్స్, బ్రాండెడ్ మర్చండైజ్ వంటి లాభాలు కలుగుతాయి.
ఈ బుకింగ్స్‌ని అధికారిక రెనాల్ట్ షోరూమ్‌లలో లేదా కంపెనీ ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా చేసుకోవచ్చు.
ఇక ఏప్రిల్ నుంచి 2026 రెనాల్ట్ డస్టర్ డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే, టర్బోచార్జ్డ్ ఇంజిన్ కలిగిన డస్టర్ వేరియంట్లు ఏప్రిల్ నుంచే అందుబాటులోకి రాగా, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వచ్చే ఎస్యూవీ డెలివరీలు మాత్రం ఈ ఏడాది దీపావళి సమయంలో మొదలవుతాయని గుర్తుపెట్టుకోవాలి.
2026 రెనాల్ట్ డస్టర్- ఇంజిన్..
విభిన్న రకాల ఇంజిన్ ఆప్షన్లు కొత్త డస్టర్ విస్తృత శ్రేణి పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తోంది. ఇందులో 1.0-లీటర్ టర్బో టీసీఈ పెట్రోల్, 1.3-లీటర్ టర్బో టీసీఈ పెట్రోల్, 1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ పెట్రోల్ యూనిట్లు ఇందులో ఉన్నాయి.
1.0-లీటర్ టర్బో పెట్రోల్: ఇది ఇప్పటికే రెనాల్ట్ కైగర్‌లో ఉన్న ఇంజిన్. ఇది 101 హెచ్‌పీ గరిష్ట పవర్‌ని, 160 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డస్టర్‌లో దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
1.3-లీటర్ టర్బో పెట్రోల్: ఈ మోటార్ 6-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది 161 బీహెచ్పీ పవర్‌ని, 280 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
1.8-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఇది 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తోంది. దీని పవర్, టార్క్ వివరాలను రెనాల్ట్ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు కానీ, ఈ వేరియంట్‌ను కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లో కూడా నడపవచ్చని ధృవీకరించింది. నగర పరిస్థితులలో డస్టర్‌ను 80% వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే డ్రైవ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


