...
...
Next Story

Tesla cars : టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్​- తేడా రూ. 2లక్షలే.. కానీ ఫీచర్లు, రేంజ్​ అధికం!

Tesla Model Y vs Model Y L : భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్​లో టెస్లా తన పట్టును బిగిస్తోంది. ఇప్పటికే ఉన్న మోడల్ వైకి అదనంగా మరింత స్థలం, ఎక్కువ రేంజ్‌తో 'మోడల్ వై ఎల్' (లాంగ్ వీల్‌బేస్) వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు, ధర, ఫీచర్ల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి..

Published on: Apr 24, 2026, 14:00:13 IST
Advertisement

దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా లవర్స్​కి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సాధారణ మోడల్ వై కంటే మరింత సౌకర్యవంతంగా, ఆరుగురు ప్రయాణించే వీలున్న టెస్లా మోడల్ వై ఎల్​ భారత్‌లో అడుగుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇన్ని అదనపు ఫీచర్లు ఉన్నప్పటికీ, ధరలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది ఎవరికి బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్- క్యాబిన్, డైమెన్షన్స్..

టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్..
టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్..

ఈ రెండు మోడళ్ల మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం వాటి పొడవు.

పొడవు: సాధారణ మోడల్ వై పొడవు 4,790ఎంఎం కాగా, మోడల్ వై ఎల్ పొడవు 4,969ఎంఎం. అంటే 179ఎంఎం అదనపు పొడవు పెరిగింది. దీనివల్ల మూడవ వరుస సీట్లను చేర్చి, 6-సీటర్ లేఅవుట్‌ను టెస్లా అందించగలిగింది.

వీల్‌బేస్: వీల్‌బేస్ 2,890ఎంఎం నుంచి 3,040ఎంఎంకి పెరిగింది. దీనివల్ల వెనుక సీట్లో కూర్చునే వారికి లెగ్ స్పేస్ పుష్కలంగా ఉంటుంది.

ఎత్తు: మోడల్ వైఎల్ ఎలక్ట్రిక్ కారు సాధారణ కారు కంటే 44ఎంఎం ఎత్తుగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా స్వల్పంగా 169ఎంఎంకి పెంచారు.

టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..

మోడల్ వై ఎల్ : ఇందులో భారీ 88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సిస్టమ్‌తో వస్తుంది. దీని రేంజ్ ఏకంగా 681 కి.మీ. కావడం విశేషం. కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్- ఫీచర్లు, లగ్జరీ..

మోడల్ వై బేస్ మోడల్‌గా ఉంటే, మోడల్ వై ఎల్ ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంది:

డిస్‌ప్లే: టెస్లా మోడల్ వై ఎల్​ ఎలక్ట్రిక్​ కారులో పెద్దదైన 16- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది.

కంపర్ట్: రెండవ వరుసలో పవర్డ్ ఆర్మ్‌రెస్ట్‌లు, మూడవ వరుసలో పవర్డ్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్ సౌకర్యం ఉన్నాయి.

అదనపు హంగులు: హీటెడ్ స్టీరింగ్ వీల్, 19- ఇంచ్ అల్లాయ్ వీల్స్, అడాప్టివ్ సస్పెన్షన్, 18-స్పీకర్ల భారీ ఆడియో సిస్టమ్ దీని సొంతం.

టెస్లా మోడల్​ వై వర్సెస్​ మోడల్​ వై ఎల్- ధరల వ్యత్యాసం..

టెస్లా మోడల్ వై ఎల్ ధర: రూ. 61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇది సాధారణ మోడల్ వై కంటే కేవలం రూ. 2.10 లక్షలు మాత్రమే ఎక్కువ. అధిక బ్యాటరీ, ఎక్స్‌ట్రా సీట్లు, ప్రీమియం ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే, మోడల్ వై ఎల్ తీసుకోవడమే లాభదాయకంగా కనిపిస్తోంది.

ఏ మోడల్ ఎవరికి సూట్ అవుతుంది?

ఫీచర్మోడల్ వైమోడల్ వై ఎల్
ప్రయాణికులుచిన్న కుటుంబాలకు (5 మంది)పెద్ద కుటుంబాలకు (6 మంది)
ప్రయాణ దూరంసిటీ రైడింగ్, అప్పుడప్పుడు హైవేతరచుగా లాంగ్ ట్రిప్స్ చేసేవారికి
డ్రైవింగ్సింపుల్ రియర్ వీల్ డ్రైవ్పవర్‌ఫుల్ ఆల్ వీల్ డ్రైవ్

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. టెస్లా మోడల్ Y Lలో ఎన్ని సీట్లు ఉన్నాయి?

మోడల్ Y Lలో మూడు వరుసల సీట్లు ఉంటాయి, ఇది ఆరుగురు (6-seater) సౌకర్యవంతంగా ప్రయాణించేలా రూపొందించబడింది.

2. మోడల్ Y L పూర్తి ఛార్జింగ్‌పై ఎంత దూరం ప్రయాణిస్తుంది?

దీనిలోని 88 kWh బ్యాటరీ సహాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 681 కి.మీ. రేంజ్ (Claimed) ఇస్తుంది.

3. ఈ రెండింటిలో ఏది వేగంగా వెళ్తుంది?

మోడల్ Y L వేగంగా వెళ్తుంది. ఇది 0-100 కి.మీ వేగాన్ని కేవలం 5 సెకన్లలోనే అందుకుంటుంది, సాధారణ మోడల్ Y కి 5.9 సెకన్లు పడుతుంది.

4. రూ. 2.10 లక్షల అదనపు ధరకు మోడల్ Y L విలువైనదేనా?

ఖచ్చితంగా! పెద్ద బ్యాటరీ, ఆల్ వీల్ డ్రైవ్, 6 సీట్లు, అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్ వంటి ఫీచర్ల కోసం రూ. 2.10 లక్షలు అదనంగా చెల్లించడం చాలా తక్కువ ఖర్చుతో కూడిన మంచి డీల్.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe