Bank Holiday : ఈ రోజు బ్యాంకులకు సెలవు- ఈ నెలలో 10కి పైనే..!
Is today a bank holiday : మే నెల వచ్చేసింది.. ఈ నెలలో బ్యాంకు పనులేమైనా ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే. 2026 మే నెలలో ప్రాంతీయ పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు పలు రోజులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారుతుంటాయి.
Telangana Bank holiday : మే నెల వచ్చేసింది. మహారాష్ట్ర దినోత్సవం, మే డే కారణంగా మే మొదటి రోజే దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా నేడు మూతపడి ఉన్నాయి. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు కూడా సెలవు ఉంది. ఈ నేపథ్యంలో ఈ మే 2026కి సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..

మే 1: మహారాష్ట్ర దినోత్సవం, మే డే..
మే 1వ తేదీన దేశంలోని మెజారిటీ నగరాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. మహారాష్ట్ర దినోత్సవం, మే డే, బుద్ధ పూర్ణిమ వంటి సందర్భాల వల్ల హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే అహ్మదాబాద్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, జైపూర్ వంటి ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు తెరిచే ఉంటాయి.
ప్రాంతీయ సెలవుల వివరాలు..
మే నెలలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి:
మే 9: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులు మూతపడతాయి.
మే 16: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ బ్యాంకులకు సెలవు.
మే 26: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలో బ్యాంకులు పనిచేయవు.
మే 27, 28: బక్రీద్ (ఈద్-ఉల్-అద్ హా) సెలవులు :
మే చివరి వారంలో బక్రీద్ పండుగ సందర్భంగా వరుసగా రెండు రోజులు వివిధ ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి.
మే 27: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మే 28: బెంగుళూరు, చెన్నై, ముంబై, నాగ్‌పూర్, పనాజీ వంటి నగరాల్లో మే 28న బ్యాంకులు మూతపడతాయని ఆర్‌బీఐ సెలవుల క్యాలెండర్ పేర్కొంది.
వారాంతపు సెలవులు ఇలా..
మే 3- ఆదివారం,
మే 9- రెండో శనివారం,
మే 10- ఆదివారం,
మే 17- ఆదివారం,
మే 23- నాలుగో శనివారం
మే 24- ఆదివారం,
మే 31- ఆదివారం.
బ్యాంకు సెలవు ఉన్నా ఇబ్బంది లేదు!
బ్యాంకు బ్రాంచీలు మూతపడినప్పటికీ, డిజిటల్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఏటీఎం : నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
డిజిటల్ పేమెంట్స్: యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.
కార్డు సేవలు: డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు.
చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే, మీ సమీపంలోని బ్యాంకులు ఎప్పుడు తెరిచి ఉంటాయో ముందే సరిచూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మే చివరి వారంలో వరుస సెలవులు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


