...
...
Next Story

Electric scooters : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా? ఇండియాలో ఇప్పుడు ఇవే బెస్ట్​ సెల్లింగ్..

రోజువారీ అవసరాల కోసం మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్, టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 25, 2026, 10:45:03 IST
Advertisement

భారతదేశంలో విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగం నానాటికీ ఊపందుకుంటోంది. ముఖ్యంగా పెట్రోల్ ధరల భారం నుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్న వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 2026 నెలకు సంబంధించిన ఈవీ స్కూటర్ల విక్రయాల గణాంకాలు రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా 81,681 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి అది ఏకంగా 131.04 శాతం పెరిగి 1,88,714 యూనిట్లకు చేరింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఈ నేపథ్యంలో ఇండియాలో అమ్ముడవుతున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

అగ్రస్థానంలో బజాజ్ చేతక్..

ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లలో దేశాన్ని ఏలిన 'చేతక్' బ్రాండ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలోనూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది! ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడం వల్ల బజాజ్ సంస్థ ఆగస్టు నెలలో ఏకంగా 52,248 చేతక్ స్కూటర్లను విక్రయించి మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. మొత్తం మార్కెట్‌లో చేతక్ ఒక్కటే 27.69 శాతం వాటాను సొంతం చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో అమ్ముడైన 14,014 యూనిట్లతో పోలిస్తే, ఈసారి ఏకంగా 38,234 యూనిట్ల అదనపు విక్రయాలను సాధించి అత్యధిక వృద్ధి నమోదు చేసిన స్కూటర్‌గా నిలిచింది.

రెండో స్థానంలో టీవీఎస్ ఐక్యూబ్..

టీవీఎస్ మోటార్స్‌కు చెందిన ఐక్యూబ్ 42,882 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 75.50 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మొదటి, రెండు స్థానాల్లో ఉన్న చేతక్, ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కలిపి మొత్తం మార్కెట్‌లోని విక్రయాల్లో 50.41 శాతం వాటాను ఆక్రమించడం విశేషం!

రేసులో దూసుకొస్తున్న హీరో విడా, ఏథర్ రిజ్తా..

హీరో విడా : 25,558 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది విక్రయాల (12,273) కంటే ఇది రెట్టింపు కంటే ఎక్కువ.

ఈ మొదటి నాలుగు మోడళ్లు (చేతక్, ఐక్యూబ్, విడా, రిజ్టా) కలిసి మొత్తం ఆగస్టు మార్కెట్‌లో 75.92 శాతం వాటాను (1,43,274 యూనిట్లు) గుత్తాధిపత్యం చేశాయి.

మార్కెట్‌లో సరికొత్తగా అడుగుపెట్టిన టీవీఎస్ ఆర్బిటర్ 14,641 యూనిట్ల విక్రయాలతో 7.76 శాతం వాటా సాధించి ఐదో స్థానాన్ని ఆక్రమించింది.

జాబితాలోని ఇతర మోడళ్ల వివరాలు..

యాంపియర్ మ్యాగ్నస్: 9,772 యూనిట్లు (98.46% వృద్ధి)

  • ఏథర్ 450: 6,891 యూనిట్లు (27.30% వృద్ధి)
  • రివర్ ఇండీ: 6,567 యూనిట్లు (194.62% వృద్ధి)
  • యాంపియర్ రియో: 1,911 యూనిట్లు (271.79% వృద్ధి)
  • హోండా క్యూసీ1: 1,902 యూనిట్లు
  • బజాజ్ యులు: 1,500 యూనిట్లు
  • యాంపియర్ నెక్సస్: 756 యూనిట్లు
  • సుజుకీ ఈ-యాక్సెస్: 668 యూనిట్లు
  • యమహా ఈసీO6: 475 యూనిట్లు
  • ఏథర్ కోనార్క్: 217 యూనిట్లు

భారత ద్విచక్ర వాహన రంగంలో ఈవీల జోరు సమీప భవిష్యత్తులో మరింత తీవ్రతరం కానుందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మరి వీటిల్లో మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్​ని కొంటున్నారు?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks