భారత ఆటోమొబైల్ మార్కెట్‌కు ఆగస్టు నెల కీలకంగా మారనుంది! కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థలు పలు క్రేజీ మోడల్స్‌ని ఆగస్టులో లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఎస్‌యూవీల ఫేస్‌లిఫ్ట్‌ల నుంచి గేమ్‌చేంజర్‌గా మారబోతున్న ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వరకు పలు రకాల మోడళ్లు రోడ్డెక్కడానికి రెడీగా ఉన్నాయి. ఆగస్టులో ఇండియన్ మార్కెట్‌ను ఊపేయడానికి వస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-3 కార్ల వివరాలు ఇక్కడ చూద్దాము..
మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్..

అంచనా ధర: రూ. 13.50 లక్షల నుంచి రూ. 25 లక్షలు
అంచనా లాంచ్ తేదీ: ఆగస్టు 14 - 15, 2026
భారతీయ ఎస్‌యూవీ రంగానికి రాజాలా భావించే తన "బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీ" స్కార్పియో-ఎన్‌కు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను తీసుకొచ్చేందుకు మహీంద్రా సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా (ఆగస్టు 15న) ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేయనున్నారు. బయటి వైపు డిజైన్‌లో చిన్నపాటి మార్పులు — అంటే నయా ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్, కొత్తగా తీర్చిదిద్దిన బంపర్లు ఉన్నప్పటికీ.. క్యాబిన్ లోపల మాత్రం మైండ్ బ్లాకింగ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ చేయనున్నారు.
ఈ కొత్త స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌లో భారీ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించనున్నారు. ప్రాథమిక వర్షన్లలో సింగిల్-పేన్ సన్‌రూఫ్ లభించే అవకాశముంది.
ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 10.25-ఇంచుల డిస్‌ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
హై-డెఫినిషన్ 360-డిగ్రీ వ్యూ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డోల్బీ ఆట్మాస్‌తో కూడిన హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్‌ను జోడిస్తున్నారు.
ఇంజన్ పరంగా మునుపటి లాగే 2.0-లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో-పెట్రోల్, 2.2-లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్లను ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో కొనసాగించనున్నారు.
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్..
అంచనా ధర: రూ. 10 లక్షల నుంచి రూ. 18.50 లక్షలు
{{/usCountry}}అంచనా ధర: రూ. 10 లక్షల నుంచి రూ. 18.50 లక్షలు
{{/usCountry}}అంచనా లాంచ్ తేదీ: ఆగస్టు 18, 2026
ఇటీవలే కుషాక్ అప్‌డేటెడ్ వర్షన్‌ను తీసుకొచ్చిన స్కోడా, ఇప్పుడు సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు 'స్లావియా' ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేస్తోంది. సరికొత్త డిజైన్ ఎలిమెంట్స్, మెరుగైన ఫీచర్లతో పాటు ఒక ప్రధాన మెకానికల్ మార్పుతో ఈ కారు మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో నూతన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం.
నయా ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ బంపర్ జియోమెట్రీ, ముందు, వెనుక భాగాల్లో నయా ఎల్ఈడీ లైటింగ్ డిజైన్ కలవు.
క్యాబిన్ లోపల రీఫ్రెష్డ్ అప్‌హోల్‌స్టరీ, పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక సీట్లలో మసాజర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
115hp పవర్ ఇచ్చే 1.0L 3-సిలిండర్ టర్బో పెట్రోల్, 150hp పవర్ ఇచ్చే 1.5L 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. 1.0L మోడల్‌కు కొత్తగా 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 1.5L మోడల్‌కు 7-స్పీడ్ డీఎస్జీ గేర్‌బాక్స్ అందిస్తున్నారు.
కొత్త ఎంజీ ఎస్‌యూవీ - ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఈవీ..
అంచనా ధర: రూ. 22 లక్షల నుంచి రూ. 30 లక్షలు
అంచనా లాంచ్ తేదీ: ఆగస్టు చివరి వారంలో
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే సరికొత్త ‘అడాప్ట్’ ప్లాట్‌ఫారమ్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విభిన్న పవర్‌ట్రెయిన్లతో సరికొత్త 7-సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీని భారత్‌లో పరిచయం చేయనుంది. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న ఎంజీ స్టార్‌లైట్ 560కి భారతీయ వర్షన్‌గా ఇది రాబోతోంది. ఇది ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లలో లభించనుంది.
ఈవీ వర్షన్: 69 kWh బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్-యాక్సిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో రానుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 600 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ప్లగ్-ఇన్ హైబ్రిడ్: 1.5L నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్, 20.5kWh బ్యాటరీ ప్యాక్‌ను జతచేశారు. ఇది కలిపి 197bhp పవర్, 230Nm టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 100 కిలోమీటర్లు, పెట్రోల్+ఈవీ రెండూ కలిపి ఏకంగా 1,100 కిలోమీటర్ల మైలేజ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కంటే పెద్దదైన 2810ఎంఎం వీల్‌బేస్‌తో ఈ 7-సీటర్ రానుంది. ఇందులో ఫ్లోటింగ్ 12.8-ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి.
ఈ మోడల్స్‌కి చెందిన లాంచ్ డేట్, ఫీచర్లు సహా ఇతర వివరాలను ఆయా సంస్థలు అధికారికంగా ప్రకటించనున్నాయి.