బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్. పాతకాలపు రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తూనే, నేటి తరం టెక్నాలజీని జోడించి రూపొందించే 'నియో రెట్రో' బైకులకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. 2025లో కూడా ఈ క్రేజ్ కొనసాగింది. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్భుతమైన డిజైన్లతో ఈ ఏడాది లాంచ్ అయిన టాప్ 5 నియో రెట్రో బైక్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
2025లో లాంచ్ అయిన టాప్ 5 నియో రెట్రో బైక్స్..

1. హోండా సీబీ350సీ
350 సీసీ విభాగంలో పట్టు సాధించేందుకు హోండా ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ. 2.02 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కేవలం హోండా 'బిగ్‌వింగ్' డీలర్‌షిప్‌లలో మాత్రమే లభించే ఈ బైక్.. ఆకర్షణీయమైన కలర్ స్కీమ్స్, కొత్త గ్రాఫిక్స్‌తో వస్తోంది.
సిటీలో తిరగడానికైనా, హైవేపై లాంగ్ డ్రైవ్‌కైనా దీనిలోని పవర్‌ఫుల్ టార్క్ అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
2. హోండా సీబీ650ఆర్..
క్లాసిక్ లుక్‌తో పాటు రేసింగ్ బైక్ పవర్‌ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. హోండా సీబీఆర్650ఆర్కి ఇది నేకెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. దీనిలో విప్లవాత్మకమైన 'ఈ-క్లచ్' టెక్నాలజీని ప్రవేశపెట్టారు. 649 సీసీ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్.. 94 బీహెచ్పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 9.60 లక్షల నుంచి రూ. 10.30 లక్షల వరకు ఉంది.
3. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350..
కుర్రాళ్ల ఫేవరెట్ హంటర్ 350 బైక్‌ని 2025లో మరింత కొత్తగా తీర్చిదిద్దింది రాయల్ ఎన్‌ఫీల్డ్. కొత్త రంగులతో పాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, మొబైల్ ఛార్జింగ్ కోసం టైప్-సీ పోర్ట్, సౌకర్యవంతమైన సీటు వంటి అప్‌గ్రేడ్స్ ఇచ్చారు. ముఖ్యంగా దీనిలోని స్లిప్పర్ క్లచ్, కొత్త సస్పెన్షన్ రైడింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తాయి.
దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ఉండటం విశేషం.
{{/usCountry}}దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ఉండటం విశేషం.
{{/usCountry}}4. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650..
బైక్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన వెహికిల్ ఇది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన 'ట్విన్ ఇంజిన్' ఇప్పుడు క్లాసిక్ లుక్‌లో రోడ్డు మీదకు వచ్చింది. దీని ఫినిషింగ్, క్రోమ్ టచ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
పాత క్లాసిక్ 500 స్ఫూర్తితో రూపొందించిన ఈ బైక్ ధర రూ. 3.37 లక్షల నుంచి రూ. 3.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
5. ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200
అందానికి అందం, పవర్‌కు పవర్.. అదే ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200! టియర్-డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్ దీనికి వింటేజ్ లుక్‌ను ఇస్తాయి. 1200 సీసీ ఇంజిన్‌తో ఏకంగా 103 బీహెచ్పీ పవర్‌ను ఇచ్చే ఈ మెషీన్ ధర రూ. 13.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.