Cruise Control Bikes in India : సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతిసారీ యాక్సిలరేటర్‌ను పట్టుకుని ఉండటం రైడర్లకు కొంత కష్టంతో కూడుకున్న పని. ఈ సమస్యను అధిగమించేందుకు వచ్చిందే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్! నిర్దిష్ట వేగాన్ని సెట్ చేసుకుంటే, యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా బైక్ అదే వేగంతో దూసుకుపోతుంది. తాజాగా భారతీయ టూ-వీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, టీవీఎస్ వంటి సంస్థలు బడ్జెట్ బైకుల్లోనూ ఈ అద్భుతమైన ఫీచర్‌ను అందిస్తున్నాయి. వాటి వివరాలు..
క్రూయిజ్ కంట్రోల్ ఉన్న టాప్-5 అఫార్డిబుల్ బైక్స్ ఇవి..

1. హీరో గ్లామర్ ఎక్స్..
భారతదేశంలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను పరిచయం చేసిన మొట్టమొదటి బడ్జెట్ బైక్‌గా హీరో గ్లామర్ ఎక్స్ రికార్డు సృష్టించింది.
ధర: దీని బేస్ వేరియంట్ ధర రూ. 86,567 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ప్రత్యేకత: క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కావాలనుకునే వారు దీని 'డిస్క్ వేరియంట్'ను ఎంచుకోవాలి. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 95,786. లక్ష రూపాయల లోపు బడ్జెట్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చే ఏకైక బైక్ ఇదే కావడం విశేషం.
2. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్..
స్పోర్టీ లుక్ ఇష్టపడే యువతను ఆకట్టుకుంటున్న ఈ బైక్, క్రూయిజ్ కంట్రోల్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
పర్ఫార్మెన్స్: 124.7సీసీ ఇంజిన్‌తో 11.5 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ధర: దీని టాప్-స్పెక్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్‌లో ఈ ఫీచర్ లభిస్తుంది. దీని ధర సుమారు రూ. 1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్).
3. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ..
హీరో సంస్థ నుంచి క్రూయింజ్ కంట్రోల్‌తో వస్తున్న మూడో బైక్ ఇది. 163.2సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో లాంగ్ రైడ్స్‌కు ఇది చక్కగా సరిపోతుంది.
ధర: క్రూయిజ్ కంట్రోల్ ఉన్న ఈటీబీ వేరియంట్ ధర రూ. 1,36,500 (ఎక్స్-షోరూమ్). ఇది 17 హెచ్‌పీ పవర్‌ని, 14.6 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
{{/usCountry}}ధర: క్రూయిజ్ కంట్రోల్ ఉన్న ఈటీబీ వేరియంట్ ధర రూ. 1,36,500 (ఎక్స్-షోరూమ్). ఇది 17 హెచ్‌పీ పవర్‌ని, 14.6 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.
{{/usCountry}}4. టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300..
పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 ఒక ఉత్తమ ఎంపిక.
ప్రత్యేకత: ఇందులో అన్ని వేరియంట్లలోనూ క్రూయిజ్ కంట్రోల్ 'స్టాండర్డ్' ఫీచర్‌గా వస్తుంది.
ధర: రూ. 1.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ బైక్ 35.5 హెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. హైవేలపై దూసుకుపోయేందుకు ఇది సరైన జోడి.
5. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310..
అత్యంత సరసమైన క్రూయిజ్ కంట్రోల్ బైకుల జాబితాలో ఐదో స్థానంలో అపాచీ ఆర్టీఆర్ 310 నిలిచింది.
పర్ఫార్మెన్స్: 312.12 సీసీ ఇంజిన్‌తో 35 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది.
ధర: దీని ప్రారంభ ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే లుక్ దీని సొంతం.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. బైకుల్లో క్రూయిజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది?
హైవేలపై ప్రయాణించేటప్పుడు మీరు ఒక నిర్దిష్ట వేగాన్ని (ఉదాహరణకు 60 కేఎంపీహెచ్) సెట్ చేస్తే, మీరు యాక్సిలరేటర్ వదిలేసినా బైక్ అదే వేగంతో వెళుతుంది. బ్రేక్ వేయగానే ఈ ఫీచర్ ఆగిపోతుంది.
2. బడ్జెట్ బైకుల్లో ఈ ఫీచర్ సురక్షితమేనా?
అవును, కంపెనీలు భద్రతా ప్రమాణాలను అనుసరించే వీటిని రూపొందిస్తాయి. అయితే, రద్దీగా ఉండే నగర రోడ్ల కంటే ఖాళీగా ఉండే హైవేలపైనే దీన్ని వాడటం మంచిది.
3. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత చౌకైన క్రూయిజ్ కంట్రోల్ బైక్ ఏది?
హీరో గ్లామర్ ఎక్స్ (డిస్క్ వేరియంట్) ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన క్రూయిజ్ కంట్రోల్ బైక్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 95,786 మాత్రమే.