కార్ల విషయంలో భారతీయుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. గతంలో కార్లలో ఏసీ ఉంటే చాలనుకునేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీట్ల నుంచి చల్లని గాలిని ఇచ్చే ‘వెంటిలేటెడ్ సీట్స్’ ఫీచర్.. కారు కొనేవారి ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. వేసవిలో లాంగ్ డ్రైవ్‌లు చేసేటప్పుడు చెమట పట్టకుండా, హాయిగా ప్రయాణించడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ నేపథయ్యంలో ఇండియాలో ఈ వెంటిలేటెడ్ సీట్స్ కలిగిన టాప్-5 అఫార్డిబుల్ ఎస్‌యూవీల వివరాలను ఇక్కడ చూసేయండి..
బడ్జెట్ ధరలో లభించే టాప్-5 ఎస్‌యూవీలు..
వెంటిలేటెడ్ సీట్స్ కావాలంటే భారీగా ఖర్చు చేయక్కర్లేదు. రూ. 10 లక్షల బడ్జెట్ నుంచి అందుబాటులో ఉన్న టాప్ ఆప్షన్లు ఇక్కడ చూడండి:
1. రెనాల్ట్ కైగర్..
దేశంలోనే వెంటిలేటెడ్ సీట్స్ ఫీచర్‌ను అత్యంత తక్కువ ధరకు అందిస్తున్న కారు ఈ రెనాల్ట్ కైగర్.
ధర: రూ. 8.42 లక్షల నుంచి రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ప్రత్యేకత: రూ. 10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో ఈ ఫీచర్ ఇస్తున్న ఏకైక కారు ఇదే. దీనిలోని 'ఎమోషన్' వేరియంట్‌లో ఈ సౌకర్యం లభిస్తుంది.
2. కియా సోనెట్..
సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కియా సోనెట్ ఒక వెలుగు వెలుగుతోంది.
ధర: రూ. 11.65 లక్షల నుంచి రూ. 14.17 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వేరియంట్లు: హెచ్‌టీఎక్స్, జీటీఎక్స్+, ఎక్స్-లైన్ వేరియంట్లలో ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ, ఫీచర్ల పరంగా ఇది బెస్ట్ ఛాయిస్.
3. స్కోడా కైలాక్..
{{/usCountry}}3. స్కోడా కైలాక్..
{{/usCountry}}స్కోడా నుంచి వస్తున్న సరికొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కైలాక్ కూడా ఈ రేసులో ఉంది.
ధర: రూ. 11.75 లక్షల నుంచి రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
ప్రత్యేకత: దీనిలోని ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్లలో వెంటిలేటెడ్ సీట్స్ పొందవచ్చు. యూరోపియన్ స్టైలింగ్‌తో పాటు కంఫర్ట్ కూడా తోడవుతుంది.
4. హ్యుందాయ్ వెన్యూ..
భారత మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన వెన్యూ సెకండ్ జనరేషన్ మోడల్‌లో ఈ కూలింగ్ ఫీచర్ ఉంది.
ధర: రూ. 11.91 లక్షల నుంచి రూ. 15.40 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వేరియంట్లు: హెచ్ఎక్స్8, హెచ్ఎక్స్10 ట్రిమ్స్ తీసుకునే వారికి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్ల వెసులుబాటు ఉంటుంది.
5. కియా సైరోస్- రేర్ సీట్ స్పెషల్!
సాధారణంగా కార్లలో ముందు మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. కానీ కియా సైరోస్ ఒక అడుగు ముందుకు వేసింది.
ధర: రూ. 12.10 లక్షల నుంచి రూ. 15.94 లక్షలు (ఎక్స్-షోరూమ్).
హైలైట్: ముందు సీట్లతో పాటు వెనుక సీట్లకు కూడా వెంటిలేషన్ ఇస్తున్న అత్యంత చౌకైన కారు ఇదే. వెనుక కూర్చునే వారికి స్లైడింగ్, రెక్లైనింగ్ ఆప్షన్లు కూడా ఉండటం వల్ల ప్రయాణం విలాసవంతంగా మారుతుంది.
అసలు వెంటిలేటెడ్ సీట్స్‌తో ప్రయోజనం ఏంటి?
కారు ఏసీ క్యాబిన్‌ను చల్లబరుస్తుంది, కానీ సీటుకు ఆనుకుని ఉండే వీపు భాగం, తొడల భాగంలో గాలి తగలక చెమట పడుతుంది. వెంటిలేటెడ్ సీట్లు నేరుగా సీటు రంధ్రాల ద్వారా చల్లని గాలిని అందించి ప్రయాణికులను పొడిగా, హాయిగా ఉంచుతాయి.