Toyota Land Cruiser FJ : అదిరే రెట్రో లుక్‌తో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే- ధర తెలిస్తే షాక్..
బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026 వేదికగా టయోటా తన సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జేని లాంచ్ చేసింది. లాడర్-ఫ్రేమ్ ఛాసిస్, 4డబ్ల్యూడీ పవర్‌తో వస్తున్న ఈ ఎస్‌యూవీ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.
టయోటా సంస్థ తన మోస్ట్ ఎవైటెడ్ ఎస్‌యూవీ ‘ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే’ ను ఎట్టకేలకు లాంచ్ చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 47వ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026లో ఈ వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా ఇప్పుడు మోడల్ని అధికారికంగా రివీల్ చేసింది. అంతేకాదు, ఈ నెలాఖరు నుంచే థాయ్‌లాండ్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అక్కడ ఈ మోడల్ కేవలం 4డబ్ల్యూడీ 2.7 వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. దీని ప్రారంభ ధరను 1.269 మిలియన్ బాట్ (భారత కరెన్సీలో సుమారు రూ. 36.40 లక్షలు) గా నిర్ణయించారు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే విశేషాలు..
ప్రస్తుత కాలంలో వస్తున్న చాలా కాంపాక్ట్ ఎస్‌యూవీలు కార్ల ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి తయారవుతున్నాయి. కానీ, ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే మాత్రం పాత పద్ధతినే అనుసరించింది. ఇది టయోటాకు చెందిన అత్యంత నమ్మకమైన 'IMV0 లాడర్-ఫ్రేమ్' ఆర్కిటెక్చర్‌పై నిర్మితమైంది. థాయ్‌లాండ్‌లో ఈ బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణం వల్ల దీనిని ట్యాక్సేషన్ ప్రయోజనాల కోసం 'ట్రక్-బేస్డ్ ఎస్‌యూవీ'గా వర్గీకరించారు.
డైమెన్షన్స్ విషయానికి వస్తే.. ఇది 4,610 ఎంఎం పొడవు, 1,855 ఎంఎం వెడల్పు, 1,890 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 2,580 ఎంఎంగా ఉంది.
ఈ కొత్త ఎఫ్‌జే మోడల్ రెట్రో లుక్‌ని తలపిస్తోంది. ఇది బాక్సీ, నిటారుగా ఉండే బాడీతో చూడగానే పాత తరం 'ఎఫ్‌జే క్రూయిజర్'ను గుర్తుకు తెస్తుంది. ముందు భాగంలో గ్రిల్ పైన స్పష్టంగా కనిపించే 'TOYOTA' లోగో, దానికి ఇరువైపులా సీ-షేప్డ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఆప్షనల్ కింద రెట్రో స్టైల్ రౌండ్ ల్యాంప్స్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. సైడ్ ప్రొఫైల్‌లో స్టెప్డ్ గ్లాస్‌హౌస్, మందపాటి సీ-పిల్లర్ దీనికి కరుడుగట్టిన ఆఫ్-రోడర్ లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో ఆక్టాగోనల్ ఆకారంలో ఉండే సైడ్-హింజ్డ్ టెయిల్‌గేట్‌తో పాటు బయటి వైపు అమర్చిన స్పేర్ వీల్ దీని ప్రత్యేకత.
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే- టెక్నాలజీ..
కారు లోపలి భాగంలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు:
డిస్‌ప్లే: 7- ఇంచ్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో పాటు 12.3- ఇంచ్ భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్.
కనెక్టివిటీ: యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం.
ఆడియో అండ్ క్లైమేట్: ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్, పీఎం2.5 ఫిల్ట్రేషన్ సెటప్‌తో కూడిన డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.
సీటింగ్: బ్లాక్ సింథటిక్ లెదర్ అప్హోల్స్టరీ, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 4-వే మాన్యువల్ ప్యాసింజర్ సీట్.
చార్జింగ్: మూడు యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి.
సామాగ్రిని ఉంచే కార్గో ఏరియాలో మిలిటరీ తరహా 'MOLLE' మౌంటింగ్ ప్యానెల్స్‌ను ఇచ్చారు. దీనివల్ల అవుట్‌డోర్ గేర్ లేదా ఇతర వస్తువులను సురక్షితంగా కట్టుకోవడానికి వీలవుతుంది.
Dhurandhar 2 : ఆదిత్య ధర్ పీక్ డీటైలింగ్! ధురంధర్ 2లో వాడిన క్రేజీ కార్లు ఇవే..
టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
థాయ్-స్పెక్ మోడల్‌లో ఫార్చ్యూనర్‌లో కనిపించే 2TR-FE 2.7-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఫోర్-సిలిండర్ ఇంజిన్ 5,200 ఆర్పఎం వద్ద 166 పీఎస్ పవర్‌ను, 4,000 ఆర్పీఎం వద్ద 245 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీక్వెన్షియల్ షిఫ్ట్ ఫంక్షన్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
సాధారణ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలతో పోలిస్తే ఇది మెకానికల్ పరంగా ఎంతో భిన్నమైనది. ఇందులో పార్ట్-టైమ్ ఫోర్-వీల్-డ్రైవ్ సెటప్‌తో పాటు హీలక్స్ నుంచి తీసుకున్న లో-రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేస్ హార్డ్‌వేర్‌ను అమర్చారు.
భారత మార్కెట్లోకి ఎప్పుడు?
టయోటా ఈ ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్జేని మరో రెండేళ్లలోపు భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం భారత మార్కెట్లో కాంపాక్ట్ సైజులో ఉంటూ, అసలైన లాడర్-ఫ్రేమ్ ఛాసిస్, లో-రేంజ్ ఫోర్-వీల్-డ్రైవ్ హార్డ్‌వేర్ కలిగిన వాహనాలు చాలా తక్కువ. ఆ లోటును భర్తీ చేస్తూ ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్‌జే ఇక్కడ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


