దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశారు. సుమారు ఏడేళ్ల విరామం తర్వాత వాషింగ్టన్, కరాకస్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు నోచుకున్న కొద్ది రోజులకే ట్రంప్ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం.
బేస్‌బాల్ విజయం.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్

వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ (WBC) సెమీఫైనల్లో ఇటలీపై వెనిజులా 4-2 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంపై స్పందిస్తూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రశంసలు కురిపించారు.
"వావ్! బేస్‌బాల్ సెమీఫైనల్లో ఇటలీని వెనిజులా 4-2తో ఓడించింది. వారు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మధ్య కాలంలో వెనిజులాకు అన్నీ మంచి రోజులే నడుస్తున్నాయి! అసలు ఈ మ్యాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర హోదా (STATEHOOD).. #51.. ఎవరైనా సిద్ధమేనా?" అని ట్రంప్ ప్రశ్నించారు.
గతంలో కెనడాను అమెరికాలో కలవాలని కోరిన ట్రంప్, గ్రీన్లాండ్‌ను కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించి అప్పట్లో దుమారం రేపారు. అయితే, వెనిజులా విషయంలో ఆయన నేరుగా 'స్టేట్‌హుడ్' (రాష్ట్ర హోదా) అనే పదాన్ని వాడటం ఇదే మొదటిసారి.
మారిన రాజకీయ ముఖచిత్రం
ట్రంప్ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం, జనవరి 3న అమెరికా 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్' పేరుతో ఒక భారీ సైనిక చర్య చేపట్టింది. కరాకస్‌లో జరిగిన ఈ మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అమెరికా ప్రత్యేక దళాలు బంధించాయి. వారిని నేరుగా న్యూయార్క్ తరలించి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు.
మదురోను గద్దె దించిన తర్వాత, వెనిజులాలో అధికారం సజావుగా బదిలీ అయ్యే వరకు అమెరికాయే ఆ దేశాన్ని నడిపిస్తుందని ట్రంప్ అప్పట్లోనే ప్రకటించారు. ముఖ్యంగా వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలపై ఆయన కన్నేశారు. "మేము ఆ చమురు సంపదను తిరిగి తీసుకుంటాం. అమెరికాకు చెందిన దిగ్గజ చమురు కంపెనీలు అక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడతాయి. భూగర్భంలో ఉన్న ఆ భారీ సంపదను వెలికితీస్తాం" అని ట్రంప్ బహిరంగంగానే పేర్కొన్నారు.
డెల్సీ రోడ్రిగ్జ్ పాలన.. మెరుగుపడుతున్న సంబంధాలు
{{/usCountry}}మదురోను గద్దె దించిన తర్వాత, వెనిజులాలో అధికారం సజావుగా బదిలీ అయ్యే వరకు అమెరికాయే ఆ దేశాన్ని నడిపిస్తుందని ట్రంప్ అప్పట్లోనే ప్రకటించారు. ముఖ్యంగా వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలపై ఆయన కన్నేశారు. "మేము ఆ చమురు సంపదను తిరిగి తీసుకుంటాం. అమెరికాకు చెందిన దిగ్గజ చమురు కంపెనీలు అక్కడ బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడతాయి. భూగర్భంలో ఉన్న ఆ భారీ సంపదను వెలికితీస్తాం" అని ట్రంప్ బహిరంగంగానే పేర్కొన్నారు.
డెల్సీ రోడ్రిగ్జ్ పాలన.. మెరుగుపడుతున్న సంబంధాలు
{{/usCountry}}ప్రస్తుతం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ హయాంలో అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏడేళ్ల తర్వాత కరాకస్‌లో అమెరికా రాయబార కార్యాలయం మళ్లీ తెరుచుకుంది. మొదట్లో మదురో బంధీని 'కిడ్నాప్' అని విమర్శించిన రోడ్రిగ్జ్, ఆ తర్వాత ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెత్తబడ్డారు.
ఇటీవలే అమెరికాకు 5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా చేసేందుకు ఆమె ఒప్పందంపై సంతకం చేశారు. అలాగే, ప్రైవేటు చమురు కంపెనీలకు అనుమతినిస్తూ కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో 18 శాతం (సుమారు 304 బిలియన్ బ్యారెళ్లు) వెనిజులాలోనే ఉండటం గమనార్హం.
ముందున్న అసలు పోరు
మంగళవారం రాత్రి మయామిలో జరగనున్న వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ ఫైనల్‌లో అమెరికా, వెనిజులా జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ట్రంప్ చేసిన '51వ రాష్ట్రం' వ్యాఖ్యలు అటు క్రీడా రంగంలో, ఇటు రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నాయి.