రష్యా నుంచి ముడిచమురు, సహజ వాయువును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి ప్రధాన దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు! రష్యాపై రూపొందించిన కఠిన ఆంక్షలు, పెనాల్టీ సుంకాల అమలును నిలిపివేస్తూ ఆయన సంచలన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. 'జాతీయ ప్రయోజనాల' దృష్ట్యా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ చట్టం అధికారికంగా అమల్లోకి రావడానికి కేవలం ఒక్క రోజు సమయం మాత్రమే ఉండగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గ్రాహమ్ చట్టం.. 100 శాతం పన్నుల ముప్పు!

గత నెలలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 'లిండ్సే ఓ గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026' ఆధారంగా రష్యాతో వాణిజ్యం జరిపే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు పొందారు. వాషింగ్టన్ రూపొందించిన ఈ చట్టం వల్ల రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాతో పాటు మరో 8 దేశాలు తీవ్ర ఆర్థిక ముప్పును ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది.
ఒకవేళ ట్రంప్ ఈ 100 శాతం పెనాల్టీ సుంకాన్ని భారత్పై విధించి ఉంటే, అది తీవ్ర నష్టాన్నే మిగిల్చేది! ఇప్పటికే బలవంతపు కార్మికుల ఉత్పత్తుల ఆరోపణల పేరుతో అమెరికా మన ఎగుమతులపై వేస్తున్న 10 శాతం పన్నుకు ఇది అదనం అయ్యేది. దీనివల్ల అమెరికాకు వెళ్లే భారతీయ ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్, ఆటో విడిభాగాల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడేది.
చమురు భద్రతపై భారత్ స్పష్టమైన వైఖరి..
అమెరికా కాంగ్రెస్లో ఈ ఆంక్షల బిల్లు ఆమోదం పొందిన సమలోనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ స్పష్టమైన వైఖరిని వ్యక్తపరిచింది.
"140 కోట్లకు పైగా ఉన్న దేశ ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా వైవిధ్యభరితమైన మార్గాల ద్వారా చమురు సేకరణను కొనసాగిస్తాం," అని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
{{/usCountry}}"140 కోట్లకు పైగా ఉన్న దేశ ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా వైవిధ్యభరితమైన మార్గాల ద్వారా చమురు సేకరణను కొనసాగిస్తాం," అని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.
{{/usCountry}}రష్యాతో భారతదేశ చమురు వాణిజ్యం గురించిన అంశాన్ని ఇటీవల అమెరికా ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో నిశితంగా వివరించినట్లు దౌత్య వర్గాలు వెల్లడించారు. ఈ ఆంక్షల వల్ల రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో తలెత్తే పరిణామాలను వాషింగ్టన్కు స్పష్టంగా తెలియజేశారు.
గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం.. ఎందుకీ వెనకడుగు?
అమెరికాలో నవంబర్ మిడ్ టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఇరాన్తో యుద్ధం కారణంగా డీజిల్, ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా ఇంధనంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తే అంతర్జాతీయంగా చమురు లభ్యత తగ్గి, అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ధరలు మరింత మండిపోయే ప్రమాదం ఉంది. పైగా అమెరికా మార్కెట్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, రష్యా నుంచి డీజిల్ దిగుమతులు చేసుకోవడానికి వీలుగా ట్రంప్ ఈ ఆంక్షల సడలింపులను ప్రకటించారు.
భారత్ తక్కువ ధరకు రష్యా ముడిచమురును దిగుమతి చేసుకుని శుద్ధి చేయడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా స్థిరంగా ఉందనే నిజాన్ని అమెరికా ఆర్థిక నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. తాజా మినహాయింపుతో భారతీయ రిఫైనరీలు, ఎగుమతిదారులు పెద్ద ఊపిరి పీల్చుకున్నారు.