ఉన్నత నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులు, విద్యార్థులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులను ప్రకటించింది. 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానాల్లో స్కిల్డ్ వర్కర్ల కనీస వేతన పరిమితులు, హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్ (హెచ్‌పీఐ) వీసా విస్తరణ, గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు వంటివి ఉన్నాయి.

అక్టోబర్ 28న హెచ్‌ఎమ్ ట్రెజరీ సమర్పించిన యూకే బడ్జెట్ 2026లో ఈ ప్రతిపాదనలను పొందుపరిచారు. తక్కువ, మోస్తరు నైపుణ్యం కలిగిన వలసలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తూనే.. నిపుణులైన విదేశీ ఉద్యోగులకు మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనేది బ్రిటన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందే విదేశీయులు, అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగం కోల్పోయిన స్పాన్సర్డ్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.
స్కిల్డ్ వర్కర్ల వేతన పరిమితుల్లో మార్పులు
2027 స్ప్రింగ్ (వసంతకాలం) నుంచి స్కిల్డ్ వర్కర్ వీసా మార్గంలో వృత్తి-నిర్దిష్ట కనీస వేతన పరిమితుల్లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న మీడియన్ వేతనానికి బదులుగా, 25వ పర్సంటైల్ (25th percentile) ప్రాతిపదికన ఈ వేతనాలను నిర్ధారించనున్నారు. 2026 వేతన డేటాను ఆధారంగా చేసుకుని సాధారణ వేతన పరిమితిని కూడా నవీకరిస్తారు. మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ (ఎమ్‌ఏసీ) ఇచ్చిన సిఫార్సుల మేరకు బ్రిటన్ కార్మిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సంస్కరణల ద్వారా వేతన మినహాయింపుల విధానాన్ని సరళీకృతం చేస్తున్నారు. విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు, వృత్తిపరమైన శిక్షణ పొందుతున్న వారికి ఇస్తున్న వేర్వేరు రాయితీలను రద్దు చేసి, 'న్యూ ఎంట్రంట్' (New Entrant) పేరుతో ఒకే మినహాయింపును తీసుకొస్తున్నారు. పీహెచ్‌డీ అర్హత కలిగిన వారికి ఇప్పటివరకు లభిస్తున్న ప్రత్యేక వేతన రాయితీని పూర్తిగా తొలగించనున్నారు. తుది వేతన గణాంకాలు, ఇతర అమలు వివరాలను ప్రభుత్వం త్వరలోనే వెల్లడించనుంది.
టాప్ 150 వర్సిటీ విద్యార్థులకు హెచ్‌పీఐ వీసా
విదేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన యువతను ఆకర్షించేందుకు 'హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్' (హెచ్‌పీఐ) వీసా పరిధిని విస్తరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ 150 విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందిన వారికి ఈ వీసా పొందే అవకాశం కల్పిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ వీసాల మొత్తం పరిమితిని కూడా పెంచనున్నారు. అర్హత సాధించే వర్సిటీల జాబితా, సవరించిన వీసా కోటా వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు
{{/usCountry}}విదేశాల నుంచి అత్యంత ప్రతిభావంతులైన యువతను ఆకర్షించేందుకు 'హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్' (హెచ్‌పీఐ) వీసా పరిధిని విస్తరిస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ 150 విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీ పొందిన వారికి ఈ వీసా పొందే అవకాశం కల్పిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈ వీసాల మొత్తం పరిమితిని కూడా పెంచనున్నారు. అర్హత సాధించే వర్సిటీల జాబితా, సవరించిన వీసా కోటా వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ వీసా కాలపరిమితి పొడిగింపు
{{/usCountry}}2027 జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే సాధారణ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ వీసా (పోస్ట్ స్టడీ వర్క్ వీసా) వ్యవధిని 18 నెలలకు తగ్గిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఉన్నత ప్రమాణాలు, నిబంధనలు పాటించే (High-compliance) విశ్వవిద్యాలయాల్లో చదివి, మంచి ఉద్యోగ అవకాశాలు సాధించిన విద్యార్థులకు రెండు సంవత్సరాల గ్రాడ్యుయేట్ వీసా సదుపాయం లభిస్తుంది. ఈ అర్హత కలిగిన విద్యాసంస్థల ప్రమాణాలు, వివరాలను బ్రిటన్ ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
ఉద్యోగం కోల్పోయిన వర్కర్లకు 6 నెలల గడువు
ఉద్యోగం కోల్పోయిన నైపుణ్యం కలిగిన విదేశీ వర్కర్లకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న గడువు ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మరొక స్పాన్సర్‌ను వెతుక్కునేందుకు 6 నెలల సమయం (Curtailment Period) ఇచ్చే ప్రతిపాదనపై పనిచేస్తోంది. 2027 నాటికి ఈ విధానాన్ని పట్టాలెక్కించాలని యోచిస్తోంది.
గ్లోబల్ టాలెంట్ వీసా విస్తరణ
2027 స్ప్రింగ్ నాటికి గ్లోబల్ టాలెంట్ వీసా పరిధిలోని ఎండార్స్‌డ్ ఫండర్ మార్గాన్ని మరింత విస్తరించనున్నారు. బ్రిటన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యూకేఆర్‌ఐ) ప్రాంతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ, పరిశోధన రంగానికి ప్రాధాన్యమిచ్చే కంపెనీలను గుర్తించి, అంతర్జాతీయ నైపుణ్యాలను ఆకర్షించేందుకు వీలుగా స్పాన్సర్‌షిప్ సౌకర్యాన్ని కల్పించనుంది.
ఈ వీసా సవరణలకు సంబంధించిన పూర్తి సమయపట్టికను బడ్జెట్‌లో వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో శాఖలవారీగా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.