2020 ఢిల్లీ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర జరిపాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. జనవరి 5న జరిగిన విచారణలో ఆయనకు, మరో నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ ఇచ్చేందుకు ధర్మసనం నిరాకరించింది. అయితే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురికి మాత్రం కోర్టు ఊరటనిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
"జైలే నా ప్రపంచం"

కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తనను కలిసిన భాగస్వామి బానోజ్యోత్స్న లాహిరితో ఉమర్ ఖలీద్ తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలియజేశారు. తనతో పాటు జైల్లో ఉన్న మరో ఐదుగురికి బెయిల్ రావడంపై ఖలీద్ సంతోషం వ్యక్తం చేస్తూనే, తన పరిస్థితిపై నిరాశ చెందాడు.
"మిగతా వారికి బెయిల్ రావడం నాకు చాలా సంతోషంగా, ఊరటగా ఉంది" అని ఆయన పేర్కొన్నట్లు లాహిరి తెలిపారు. మంగళవారం జైలుకు వచ్చి కలుస్తానని ఆమె చెప్పగా.. ఖలీద్ స్పందిస్తూ, "తప్పకుండా రా.. ఇక ఇదే నా జీవితం (అబ్ యహీ జిందగీ హై)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్న అతడి మాటల్లో తీవ్రమైన నైరాశ్యం కనిపించింది.
కోర్టు ఏమన్నదంటే?
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన అభియోగాలు ప్రాథమికంగా నిజమని నమ్ముతున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
విచారణలో జాప్యం: విచారణ ప్రారంభం కావడంలో జరుగుతున్న ఆలస్యాన్ని బెయిల్ ఇవ్వడానికి 'ట్రంప్ కార్డు'గా పరిగణించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
బెయిల్ పొందిన వారు: గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆవేదనలో తండ్రి..
కోర్టు తీర్పుపై ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది చాలా దురదృష్టకరం. తీర్పు వచ్చేసింది, దీనిపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు" అంటూ క్లుప్తంగా స్పందించారు.
{{/usCountry}}కోర్టు తీర్పుపై ఉమర్ ఖలీద్ తండ్రి సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఇది చాలా దురదృష్టకరం. తీర్పు వచ్చేసింది, దీనిపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు" అంటూ క్లుప్తంగా స్పందించారు.
{{/usCountry}}2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లకు ఉమర్ ఖలీద్ మాస్టర్ మైండ్ అని పోలీసులు ఆరోపిస్తుండగా, అతడు మొదటి నుంచీ ఆ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాడు. ఈ కేసులో ఉమర్ ఖలీద్ ఐదేళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, కేసు విచారణ ఇంకా మొదలుకాలేదు.