...
...
Next Story

మార్కెట్ సూచీలు అంటే ఏమిటి? కొత్త ఇన్వెస్టర్లకు కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడి గైడ్

స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు ఎలా పనిచేస్తాయి? ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాలు పాటించాలి? కోటక్ సెక్యూరిటీస్ హెడ్ ఈక్విటీ రీసెర్చ్ శ్రీకాంత్ చౌహాన్ (Shrikant Chouhan, Head Equity Research, Kotak Securities) అందించిన సరళమైన విశ్లేషణ. వారి మాటల్లోనే చదవండి.

Published on: Jul 17, 2026, 11:15:51 IST
Advertisement

రోజూ టీవీల్లోనూ, వార్తల్లోనూ సెన్సెక్స్, నిఫ్టీ పెరిగిందని, లేదా సెన్సెక్స్, నిఫ్టీ పడిపోయిందని వింటూనే ఉంటాం. అసలు ఈ పదాలకు అర్థం ఏంటి? స్టాక్ మార్కెట్ సూచీలు (ఇండెక్స్‌లు) అనేవి మార్కెట్ ట్రెండ్స్, ఇన్వెస్టర్ల ఆలోచనలను ప్రతిబింబించే అత్యంత కీలకమైన సూచికలు. మార్కెట్ ఏ దిశగా ప్రయాణిస్తోందో ఇవి సులభంగా తెలియజేస్తాయి.

మార్కెట్ సూచీలు అంటే ఏమిటి? కొత్త ఇన్వెస్టర్లకు కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడి గైడ్
మార్కెట్ సూచీలు అంటే ఏమిటి? కొత్త ఇన్వెస్టర్లకు కోటక్ సెక్యూరిటీస్ నిపుణుడి గైడ్

భారతదేశంలో అత్యధిక మంది గమనించే రెండు ప్రధాన సూచీలు ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదైన టాప్ 30 కంపెనీల పనితీరును 'సెన్సెక్స్' ట్రాక్ చేస్తుంది. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఉన్న టాప్ 50 కంపెనీల పురోగతిని 'నిఫ్టీ 50' సూచిస్తుంది. ఇన్వెస్టర్లు మార్కెట్ మొత్తం పనితీరును అంచనా వేయడానికి ఈ సూచీలను బెంచ్‌మార్క్‌లుగా భావిస్తారు.

స్టాక్ ఎక్స్ఛేంజీల పాత్ర

స్టాక్ ఎక్స్ఛేంజ్ అనేది షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలకు వేదికగా నిలుస్తుంది. మన దేశంలో రెండు ప్రధాన ఎక్స్ఛేంజీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి:

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE): 1875లో ఏర్పాటైన ఈ ఎక్స్ఛేంజ్.. ఆసియాలోనే అత్యంత పురాతనమైనది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE): అత్యాధునిక సాంకేతికతతో నడుస్తూ, భారీ ట్రేడింగ్ వాల్యూమ్‌కు ఇది పేరుగాంచింది.

ఈ ఎక్స్ఛేంజీలు షేర్ల ట్రేడింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా మార్కెట్లో పారదర్శకతను కాపాడతాయి.

ఎవరి సలహాలు పాటించాలి?

స్టాక్ మార్కెట్లో సరైన లాభాలు సాధించాలంటే నమ్మకమైన వనరులను అనుసరించడం ముఖ్యం. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు ట్రెండ్స్‌ను విశ్లేషించి ఇచ్చే సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన 'సెబీ' (SEBI) ట్రేడింగ్ సజావుగా సాగేలా పర్యవేక్షిస్తుంది. వీటితో పాటు కంపెనీలు విడుదల చేసే వార్షిక నివేదికలు, త్రైమాసిక ఫలితాలు, ఇన్వెస్టర్ల ప్రెజెంటేషన్లను పరిశీలిస్తే ఆయా కంపెనీల ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుంది.

మార్కెట్లో వాడే కీలక పదాలు

ఇండెక్స్ (Index): మార్కెట్ మొత్తం పనితీరును కొలిచే కొలమానం.

మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization): మార్కెట్లో ఒక కంపెనీకి ఉన్న మొత్తం షేర్ల విలువను ఇది తెలియజేస్తుంది.

బుల్ మార్కెట్ (Bull Market): షేర్ల ధరలు నిరంతరం పెరుగుతూ మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు దీనిని బుల్ మార్కెట్ అంటారు.

బేర్ మార్కెట్ (Bear Market): ధరలు క్రమంగా పడిపోతూ మార్కెట్ నష్టాల బాట పట్టినప్పుడు దీనిని బేర్ మార్కెట్ అంటారు.

సెక్టోరల్ ఇండెక్స్ (Sectoral Indices): ఆటోమొబైల్, ఫార్మా వంటి ప్రత్యేక రంగాల పనితీరును ట్రాక్ చేసే సూచీలు.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్: మధ్యస్థ, చిన్న తరహా కంపెనీల షేర్ల కదలికలను ఇవి ప్రతిబింబిస్తాయి.

సరైన ఇండెక్స్‌ను ఎలా ఎంచుకోవాలి?

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉండే సూచీలను గమనించాలి. మీరు పెద్ద, స్థిరపడిన కంపెనీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెన్సెక్స్ లేదా నిఫ్టీ 50ని ఫాలో అవ్వడం మంచిది. ఒకవేళ చిన్న తరహా కంపెనీలపై ఆసక్తి ఉంటే బిఎస్ఈ స్మాల్ క్యాప్ లేదా ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ సూచీలను చూడాలి. ఏదైనా ఒక నిర్దిష్ట రంగంపై ఆసక్తి ఉంటే ఎన్ఎస్ఈ ఐటీ ఇండెక్స్ లేదా బిఎస్ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ వంటి సెక్టోరల్ సూచీలను పరిశీలించాలి.

సూచీలు అనేవి కేవలం అంకెలు మాత్రమే కాదు.. అవి మార్కెట్ గమనాన్ని చూపే దిక్సూచీలు. సరైన అవగాహన, నిరంతర పరిశీలన ఉంటే మార్కెట్లో విజయం సాధించడం సులువవుతుంది.

వ్యాసకర్త:

- శ్రీకాంత్ చౌహాన్,

హెడ్ ఈక్విటీ రీసెర్చ్,

కోటక్ సెక్యూరిటీస్

శ్రీకాంత్ చౌహన్, హెడ్ ఆఫ్ ఈక్విటీ రిసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్
 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe