బడ్జెట్ 2026: ముహూర్తం ఖరారు.. నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు! కీలక తేదీలు ఇవే..

Budget 2026 dates: దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026 కోసం కసరత్తు పూర్తయింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ బడ్జెట్ సమావేశాల పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి.

Published on: Jan 14, 2026 12:15 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ‘కేంద్ర బడ్జెట్ 2026’ సమయం వచ్చేసింది. దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ వార్షిక ఆర్థిక ప్రణాళికను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Hindustan Times)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Hindustan Times)

నిర్మలా సీతారామన్ రికార్డు

ఈసారి బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అరుదైన రికార్డును సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు వరుసగా అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. వచ్చే ఏడాది కూడా ఆమె బడ్జెట్ ప్రవేశపెడితే, మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న 10 బడ్జెట్ల రికార్డును ఆమె సమం చేస్తారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని మూడవ ప్రభుత్వంలో ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కావడం గమనార్హం.

అసలు ‘కేంద్ర బడ్జెట్’ అంటే ఏమిటి?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం.. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం తన వార్షిక ఆదాయ, వ్యయాల పట్టికను పార్లమెంటు ముందు ఉంచాలి. దీనినే ‘కేంద్ర బడ్జెట్’ అంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తుంది? వేటికి ఖర్చు చేస్తుంది? పన్నుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి? ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది? వంటి కీలక అంశాలన్నీ ఇందులో ఉంటాయి.

నోట్ చేసుకోవాల్సిన కీలక తేదీలు:

బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కేవలం ఒక రోజు ప్రక్రియ కాదు. దీనికి సంబంధించి కీలకమైన షెడ్యూల్ ఇలా ఉంది:

  • జనవరి 28: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
  • జనవరి 31: ఆర్థిక మంత్రి పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే’ (Economic Survey) ప్రవేశపెడతారు. దేశ ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) వి. అనంత నాగేశ్వరన్ ఈ నివేదికను రూపొందిస్తారు.
  • ఫిబ్రవరి 1: ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ని ప్రవేశపెడతారు.
  • ఫిబ్రవరి 13: బడ్జెట్ సమావేశాల మొదటి విడత ముగుస్తుంది.
  • మార్చి 9: రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
  • ఏప్రిల్ 2: బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ముగుస్తాయి.

ఈ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా? సామాన్యులకు ఊరట లభిస్తుందా? అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More