పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు రంగం సిద్ధమవుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ అమలు చేసే రాజ్యాంగ సవరణ బిల్లుకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచడంతో పాటు, ప్రతి రాష్ట్రం ప్రస్తుత స్థానాల వాటాను 2051 వరకు స్తంభింపజేసేలా ఈ ప్రతిపాదనను రూపొందించారు.

నవంబర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు అనుగుణంగా ఈ సమావేశాలు డిసెంబర్ 3న ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. నవంబర్ 30న లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చలో ప్రతిపక్షాలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏప్రిల్‌లో వీగిపోయిన బిల్లు.. విమర్శలకు తెర?
గత ఏప్రిల్ 17న మూడు రోజుల ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్‌సభ గరిష్ఠ స్థానాల సంఖ్యను 550 నుంచి 850కి పెంచాలని ఆ బిల్లు ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి గరిష్ఠంగా 815 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 35 మంది సభ్యులు ఉండేలా, 2029 ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా రూపొందించారు. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలు ఉన్నాయి.
ఆ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ (అప్పట్లో 352) అవసరం కాగా, ఆ బలం దక్కలేదు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అదే తొలిసారి.
అప్పట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి నిమిషంలో ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని బిల్లులో చేరుస్తామని హామీ ఇచ్చినా, విపక్షాలన్నీ ఏకమై బిల్లును అడ్డుకున్నాయి. ఆ తర్వాత సాధారణ మెజారిటీ సరిపోయే మరో రెండు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సమానంగా సీట్లు పెంచుతామన్న హామీ సభలో ప్రసంగాలకే పరిమితమైందని, బిల్లుల పాఠంలో రాయలేదని విపక్షాలు, దక్షిణాది రాష్ట్రాలు అప్పట్లో విమర్శించాయి. ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానంగా బిల్లులో స్పష్టత తెచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
జనాభా లెక్కలు, దక్షిణాది వాదన నేపథ్యం
{{/usCountry}}అప్పట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చివరి నిమిషంలో ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచుతామని బిల్లులో చేరుస్తామని హామీ ఇచ్చినా, విపక్షాలన్నీ ఏకమై బిల్లును అడ్డుకున్నాయి. ఆ తర్వాత సాధారణ మెజారిటీ సరిపోయే మరో రెండు అనుబంధ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సమానంగా సీట్లు పెంచుతామన్న హామీ సభలో ప్రసంగాలకే పరిమితమైందని, బిల్లుల పాఠంలో రాయలేదని విపక్షాలు, దక్షిణాది రాష్ట్రాలు అప్పట్లో విమర్శించాయి. ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానంగా బిల్లులో స్పష్టత తెచ్చేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
జనాభా లెక్కలు, దక్షిణాది వాదన నేపథ్యం
{{/usCountry}}సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, తాజాగా ప్రచురించిన జనాభా లెక్కల (వాస్తవంగా 2011 జనాభా లెక్కల) ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని గతంలో ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు ద్వారా ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్‌లకు కూడా ఈ మార్పులను వర్తింపజేయాలని భావించారు.
అదనపు సీట్లను ఎలా పంచుతారనే అంశంపైనే ప్రధాన వివాదం తలెత్తింది. 2011 జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే ఉత్తరాది రాష్ట్రాల వాటా పెరిగి, దేశ జీడీపీలో సుమారు 30-31 శాతం వరకు సహకరిస్తున్న దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గుతుందని విమర్శకులు వాదించారు. కేవలం జనాభా ఒక్కటే ప్రాతినిధ్యాన్ని నిర్ణయించకూడదని దక్షిణాది రాష్ట్రాలు పలుమార్లు స్పష్టం చేశాయి.
ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు 50 శాతం పెరిగితే లోక్‌సభ సంఖ్య సుమారు 815కి చేరుతుందని, ప్రస్తుత వాటా అలాగే ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కానీ అప్పటి బిల్లుల పాఠంలో నిర్దిష్ట నిష్పత్తిని, 2051 వరకు వాటా స్తంభన వంటి అంశాలను పొందుపరచలేదు. మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తామని కానీ డీలిమిటేషన్‌కు కాదని విపక్షాలు తేల్చిచెప్పాయి. విపక్షాల వైఖరి వల్ల మహిళా సాధికారతకు దెబ్బ తగిలిందని అధికార పక్షం ఆరోపించింది.
తటస్థ పార్టీలపైనే కీలక ఆశలు
ఎన్డీఏకు సొంతంగా మూడింట రెండొంతుల మెజారిటీ లేనందున, తాజా ప్రయత్నం కూడా తటస్థ పార్టీలు, నిర్ణయం తీసుకోని సభ్యుల మద్దతుపైనే ఆధారపడి ఉంది. సభలో ప్రతీ ఓటు, ప్రతీ గైర్హాజరు బిల్లు భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.
ABOUT THE AUTHOR
ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.