నేటి మార్కెట్‌లో ఎస్‌యూవీలకు ఉన్నంత క్రేజ్ సెడాన్‌లకు లేకపోవచ్చు, కానీ ఈ మోడల్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. వీళ్లకి ఎస్‌యూవీల కన్నా క్లాసీ, స్టైలిష్ లుక్ ఇచ్చే సెడాన్లే నచ్చుతాయి. అందుకే పలు ఆటోమొబైల్ సంస్థలు కొత్త మోడల్స్‌ని లాంచ్ చేయడంతో పాటు ఉన్న వాటిని రెగ్యూలర్‌గా అప్డేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోండా, స్కోడా ఆటో, వోక్స్‌వ్యాగన్ వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఈ ఏడాది భారతదేశంలో తమ అప్డేటెడ్ సెడాన్ మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

కొత్త ఫీచర్లు, మెరుగైన సౌకర్యం, ఉత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా సెడాన్ సెగ్మెంట్‌ను మళ్లీ ఫ్రెష్‌గా మార్చడం ఈ అప్డేట్స్ ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది రాబోతున్న ఆ మూడు కీలక సెడాన్ల వివరాలు ఇవే:
1. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్..
రాబోయే లాంచ్‌లలో హోండా సిటీ ముందు వరుసలో ఉంది. ప్రస్తుత తరం మోడల్‌కు ఇది రెండో ఫేస్‌లిఫ్ట్. ఇది మే 22న మార్కెట్లోకి రానుంది.
ఎక్స్టీరియర్: బయటి వైపు మార్పులు చాలా స్వల్పంగా ఉండనున్నాయి. రివైజ్డ్ బంపర్లు, అప్‌డేటెడ్ లైటింగ్ ఎలిమెంట్స్, కొత్త అలాయ్ వీల్స్ ఇందులో ఉండబోతున్నాయి.
ఇంటీరియర్- టెక్నాలజీ: లోపలి భాగంలో సౌకర్యం, టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టారు. వెన్టిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఈ సెడాన్ పొందే అవకాశం ఉంది. అలాగే హోండా సెన్సింగ్ అడాస్ సూట్‌ను కూడా మరింత మెరుగుపరచనున్నారు.
2. స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టుస్..
ఈ ఏడాది చివరిలో స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టుస్ కూడా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను అందుకోనున్నాయి.
డిజైన్ మార్పులు: ఈ రెండు మోడళ్లలో అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త గ్రిల్స్, ఫ్రెష్ అలాయ్ వీల్ డిజైన్లు ఉండబోతున్నాయి. కొత్త కలర్ ఆప్షన్లు, ఇల్యూమినేటెడ్ (వెలిగే) లోగోలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
{{/usCountry}}డిజైన్ మార్పులు: ఈ రెండు మోడళ్లలో అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త గ్రిల్స్, ఫ్రెష్ అలాయ్ వీల్ డిజైన్లు ఉండబోతున్నాయి. కొత్త కలర్ ఆప్షన్లు, ఇల్యూమినేటెడ్ (వెలిగే) లోగోలను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
{{/usCountry}}అదనపు ఫీచర్లు: ఇంటీరియర్స్‌లో ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ కనిపిస్తాయి. 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మెరుగైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను ఆశించవచ్చు. స్కోడా స్లావియాలో వెనుక సీటు ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
| ఫీచర్ | హోండా సిటీ (మే 22) | స్లావియా / వర్టస్ (ఏడాది చివరిలో) |
|---|---|---|
| ప్రధాన మార్పు | అడాస్ అప్‌గ్రేడ్, వెన్టిలేటెడ్ సీట్లు | 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ |
| డిస్ప్లే | పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ | 10.25-ఇంచ్ డిజిటల్ క్లస్టర్ |
| డిజైన్ | కొత్త బంపర్లు, అలాయ్ వీల్స్ | కొత్త గ్రిల్స్, ఇల్యూమినేటెడ్ లోగోస్ |
మెరుగైన డ్రైవింగ్, కొత్త గేర్‌బాక్స్..
ఈ అప్‌డేట్స్‌లో అత్యంత కీలకమైన మార్పు ఇంజిన్ పర్ఫార్మెన్స్‌లో రాబోతోంది.
8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్: 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పరిచయం చేయనున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ యూనిట్ స్థానంలో వస్తుంది.
ఈ మార్పు వల్ల కారు మైలేజ్ పెరగడమే కాకుండా, డ్రైవింగ్ మరింత స్మూత్‌గా, ఆహ్లాదకరంగా మారుతుంది.
వీటి లాంచ్, లేటెస్ట్ ఫీచర్స్, ధర వంటి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.