భారతీయ కార్ల మార్కెట్లో ఎస్‌యూవీల హవా మునుపెన్నడూ లేని విధంగా కొనసాగుతోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఏడాది అక్టోబర్ నెల ఒక ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతోంది. ప్రత్యేకించి పండుగల సీజన్‌లో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉండటంతో, వాహన తయారీ దిగ్గజాలు తమ కొత్త మోడళ్లను రోడ్డెక్కించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి.

ఈ రేసులో ప్రధానంగా హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ నుంచి వస్తున్న సరికొత్త ఎస్‌యూవీ బేయాన్ ప్రముఖంగా నిలుస్తున్నాయి. వీటితో పాటు రోడ్లపై రచ్చ చేసేందుకు టాటా సఫారీ ఈవీ, మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు కూడా అక్టోబర్ నెలలోనే క్యూ కడుతున్నాయి.
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్: సరికొత్త మెరుపులు!
మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేసిన హోండా ఎలివేట్, మొదటిసారిగా మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో రాబోతోంది. దీపావళి వేళ సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా హోండా ఈ మార్పులు చేసింది.
ఎక్స్టీరియర్ డిజైన్: ముందు భాగంలో మరింత అగ్రెసివ్‌గా ఉండే బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ లైటింగ్, సరికొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్‌ను అందించనున్నారు.
ఇంటీరియర్ అండ్ ఫీచర్లు: వేసవిలో ఉపశమనం ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మరియు మెరుగైన లెవెల్-2 అడాస్ భద్రతా సాంకేతికతను ఇందులో జోడించారు.
ఇంజిన్ సామర్థ్యం: ఇందులో విశ్వసనీయమైన 1.5-లీటర్ 4-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగిస్తున్నారు. ఇది 121హెచ్‌పీ పవర్, 145ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
హ్యుందాయ్ బేయాన్- ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీతో!
హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఈ కొత్త 'బేయాన్' కొలువుతీరనుంది. దాదాపు 4.3 మీటర్ల పొడవు ఉండే ఈ క్రాసోవర్ ఎస్‌యూవీ అనేక వినూత్న ఫీచర్లతో వస్తోంది.
{{/usCountry}}హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఈ కొత్త 'బేయాన్' కొలువుతీరనుంది. దాదాపు 4.3 మీటర్ల పొడవు ఉండే ఈ క్రాసోవర్ ఎస్‌యూవీ అనేక వినూత్న ఫీచర్లతో వస్తోంది.
{{/usCountry}}ప్రత్యేక డిజైన్: బాణం ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, వైడ్-మెష్ ఫ్రంట్ గ్రిల్, బూమరాంగ్ తరహా ఎల్ఈడీ టెయిల్-లైట్లు, దృఢమైన సైడ్ క్లాడింగ్‌తో ఇది డిఫరెంట్ లుక్‌ని కలిగి ఉంటుంది.
హైటెక్ క్యాబిన్: ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం ట్విన్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు, పానోరమిక్ సన్‌రూఫ్, బాస్ సౌండ్ సిస్టమ్, అంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, లెవెల్-2 అడాస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సీఎన్జీ ఆప్షన్: 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న హ్యుందాయ్ ఎస్‌యూవీలలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ పొందుతున్న మొదటి కార్ ఇదే కావడం విశేషం. బూట్ స్పేస్ తగ్గకుండా అండర్‌బాడీ సీఎన్జీ ట్యాంక్ అమర్చే అవకాశం ఉంది.
ఇంజిన్: 115హెచ్‌పీ పవర్, 144ఎన్ఎం టార్క్‌ను ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రానుంది.
టాటా సఫారీ ఈవీ, మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ కూడా!
కేవలం హోండా, హ్యుందాయ్ మాత్రమే కాకుండా, దేశీయ దిగ్గజాలు కూడా ఈ పండుగ సీజన్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేవు.
టాటా సఫారీ ఈవీ : ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి టాటా సంస్థ సరికొత్త సఫారీ ఈవీని రేంజ్, పవర్ కాంబినేషన్‌తో తీర్చిదిద్దింది.
మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్ : ఆఫ్‌రోడింగ్ ప్రియుల గుండెకాయ అయిన థార్‌ను మరిన్ని హంగులు, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌తో మహీంద్రా అప్‌డేట్ చేస్తోంది.
ఈ అక్టోబర్ లాంచ్‌లు భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త కళను తేనున్నాయి. కొనుగోలుదారులకు రకరకాల ఆప్షన్లు అందుబాటులోకి రావడం వల్ల కాంపాక్ట్, మిడ్‌సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ మరింత తీవ్రం కానుంది.