UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025- పరీక్ష తేదీ, డౌన్‌లోడ్ వివరాలు ఇవే..

యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ పరీక్ష నవంబర్ 30న జరగనుంది. అడ్మిట్ కార్డుల విడుదల తేదీ, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానంతో పాటు ఇతర ముఖ్య సమాచారాన్ని ఇక్కడ డిటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Nov 25, 2025 5:31 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది.

UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025 వివరాలు..
UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025 వివరాలు..

ఆ నోటీసు ప్రకారం, అడ్మిట్ కార్డులను పరీక్ష జరగడానికి ఐదు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ పరీక్ష నవంబర్ 30, 2025న జరగనుంది.

కార్మిక- ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్​ఓ సంస్థలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ (ఈఓ/ఏఓ), అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్​సీ) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తాజా సమాచారం కోసం యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.

యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ అడ్మిట్ కార్డులను upsc.gov.in, upsc.nic.in అనే యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేస్తారు. దరఖాస్తు చేసుకున్నవారు తమ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ ఉపయోగించి లాగిన్ అయి తమ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ నియామకం 2025 వివరాలు

స్పెషల్ అడ్వర్టైజ్‌మెంట్ నెం. 52/2025 ద్వారా యూపీఎస్సీ ఈ నియామక పరీక్షను నిర్వహిస్తోంది. మొత్తం 230 పోస్టుల భర్తీకి ఈ పరీక్ష జరగనుంది. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 156 సీట్లు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 74 సీట్లు ఉన్నాయి.

పరీక్ష కేంద్రం వివరాలను అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది.

యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ పరీక్ష సమయం, కేంద్రాలు

ఈ ఈపీఎఫ్​ఓ పరీక్ష నవంబర్ 30 (ఆదివారం) రోజున, ఉదయం 09:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 78 కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

పరీక్ష అనేది 'పెన్ అండ్ పేపర్' ఆధారంగా ఆఫ్‌లైన్‌లో జరుగుతుందని యూపీఎస్సీ తెలిపింది. పరీక్ష ప్రారంభానికి 90 నిమిషాల ముందు అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

యూపీఎస్సీ ఈపీఎఫ్​ఓ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ చేసుకోండిలా..

మీరు మీ అడ్మిట్ కార్డ్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి కింద ఇచ్చిన సూచనలను పాటించండి:

స్టెప్​ 1- ముందుగా upsc.gov.in అనే యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్‌పేజీలో కనిపించే “What's New” విభాగంలో లేదా "ఎగ్జామినేషన్​" మెనూ కింద ఉన్న అడ్మిట్ కార్డ్స్​ ట్యాబ్‌లో చూడండి.

స్టెప్​ 3- “EPFO EO/AO & APFC Examination Admit Card” లింక్ యాక్టివేట్ అయిన తర్వాత దానిపై క్లిక్ చేయండి.

స్టెప్​ 4- ఆ తర్వాత డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇది మిమ్మల్ని upsconline.nic.in అనే పేజీకి దారి తీస్తుంది.

స్టెప్​ 5- అక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ లేదా రోల్ నంబర్ ఉపయోగించి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్​ 6- రిజిస్ట్రేషన్ ఐడీ/రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ క్యాప్చా వంటి అవసరమైన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

స్టెప్​ 7- సరైన వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, సబ్మిట్​ బటన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 8- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు అందులోని తమ పేరు, పరీక్షా కేంద్రం, సమయాలు, ఇతర సూచనలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.

News/News/UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025- పరీక్ష తేదీ, డౌన్‌లోడ్ వివరాలు ఇవే..
News/News/UPSC EPFO అడ్మిట్ కార్డ్ 2025- పరీక్ష తేదీ, డౌన్‌లోడ్ వివరాలు ఇవే..