ISRO URSC Recruitment 2026 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)కి చెందిన ప్రతిష్ఠాత్మక యు ఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ursc.gov.in ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగియడానికి చివరి తేదీ నవంబరు 13, 2026. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఎంపిక విధానం మరియు రుసుము వివరాలను నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
- టెక్నీషియన్ బీ : 46 పోస్టులు
- లైట్ వెహికల్ డ్రైవర్ : 5 పోస్టులు
- హెవీ వెహికల్ డ్రైవర్ : 10 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో అభ్యర్థులు సమర్పించిన విద్యా అర్హతలు, మార్కులు మరియు ఇతర వివరాల ఆధారంగా మొదట ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
ఈ స్క్రీనింగ్‌లో ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన ప్రతిభ, ఇస్రో/యుఆర్‌ఎస్సీ నిర్ణయించిన కటాఫ్ నిబంధనలు మరియు ఖాళీల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను తదుపరి దశ అయిన స్కిల్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు.
అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు కింద రూ. 500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రూ. 400 మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లోకి రీఫండ్ చేస్తారు. వాస్తవ నాన్-రీఫండబుల్ దరఖాస్తు రుసుము రూ. 100 మాత్రమే. రాత పరీక్షకు హాజరుకాని వారికి ఎలాంటి నగదు రీఫండ్ లభించదు.
దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ (DD), చెక్కులు, నగదు, మనీ ఆర్డర్ లేదా పోస్టల్ ఆర్డర్ల రూపంలో ఇచ్చే రుసుములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. రాత పరీక్ష తేదీలు, సిలబస్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
{{/usCountry}}దరఖాస్తు రుసుమును కేవలం ఆన్‌లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ (DD), చెక్కులు, నగదు, మనీ ఆర్డర్ లేదా పోస్టల్ ఆర్డర్ల రూపంలో ఇచ్చే రుసుములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు. రాత పరీక్ష తేదీలు, సిలబస్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా యుఆర్‌ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
{{/usCountry}}
ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు