అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ప్రాణనష్టాన్ని మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. యుద్ధం మొదలైన మొదటి వారంలోనే పెంటగాన్ సుమారు 6 బిలియన్ డాలర్లు (రూ. 50 వేల కోట్లకు పైగా) ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే సగటున రోజుకు 891.4 మిలియన్ డాలర్లు కరిగిపోతున్నాయి. ఈ ఖర్చు ఎంతో తెలుసా? మన దేశం (భారతదేశం) ఏడాది పొడవునా అంతరిక్ష ప్రయోగాల (ISRO) కోసం ఖర్చు చేసే బడ్జెట్ కంటే.. అమెరికా యుద్ధం కోసం ఒక్క రోజులో ఖర్చు చేసే మొత్తమే ఎక్కువ!
ఖర్చుల లెక్కలివే..

వాషింగ్టన్‌కు చెందిన 'సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్' (CSIS) విశ్లేషణ ప్రకారం ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి:
- మందుగుండు సామగ్రి: మొదటి వారంలో ఖర్చయిన 6 బిలియన్ డాలర్లలో, 4 బిలియన్ డాలర్లు కేవలం క్షిపణులు, బాంబులకే సరిపోయింది. ముఖ్యంగా ఇరాన్ ప్రయోగించే క్షిపణులను అడ్డుకునే 'ఇంటర్సెప్టర్ల' కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది.
- వైమానిక కార్యకలాపాలు: రోజుకు సుమారు 30 మిలియన్ డాలర్లు.
- నౌకాదళం: రోజుకు 15 మిలియన్ డాలర్లు.
- సైన్యం: యుద్ధ క్షేత్రంలో 50,000 మందికి పైగా సైనికులు, యుద్ధ విమానాలు, నౌకల నిర్వహణ కోసం రోజుకు మరో 1.6 మిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయి.
ఈ యుద్ధం గనుక రెండు నెలల పాటు కొనసాగితే, ప్రత్యక్ష సైనిక ఖర్చు 95 బిలియన్ డాలర్లకు (రూ. 8 లక్షల కోట్లు) చేరుకోవచ్చని పెన్సిల్వేనియా యూనివర్సిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇరాన్ తన 'ఆపరేషన్ మ్యాడ్ మ్యాన్' వ్యూహంతో అమెరికాను, దాని మిత్రదేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది.
- చమురు ధరలు: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 119.50 డాలర్లకు చేరింది.
- ఇంధన సంక్షోభం: ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' మార్గంలో రవాణా దాదాపు నిలిచిపోయింది.
- సప్లై చైన్: ఖతార్ నుంచి గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవడం, సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
విమర్శలను లెక్కచేయని ట్రంప్
ఒకవైపు అమెరికాలో సామాన్యుడిపై భారం పడుతుంటే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ 'నిర్వందంగా లొంగిపోవాల్సిందే' అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. "ప్రజల ఆరోగ్యం, ఆహార పథకాలకు కోతలు విధిస్తూ, యుద్ధం కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను మధ్య ప్రాచ్యానికి పంపుతున్నారు" అని హౌస్ డెమొక్రాటిక్ కాకస్ చైర్ పీట్ అగ్యిలర్ విమర్శించారు.
{{/usCountry}}ఒకవైపు అమెరికాలో సామాన్యుడిపై భారం పడుతుంటే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ 'నిర్వందంగా లొంగిపోవాల్సిందే' అని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై డెమొక్రాట్లు మండిపడుతున్నారు. "ప్రజల ఆరోగ్యం, ఆహార పథకాలకు కోతలు విధిస్తూ, యుద్ధం కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను మధ్య ప్రాచ్యానికి పంపుతున్నారు" అని హౌస్ డెమొక్రాటిక్ కాకస్ చైర్ పీట్ అగ్యిలర్ విమర్శించారు.
{{/usCountry}}అయితే, ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "ఇరాన్‌ను వినాశనం అంచు నుంచి వెనక్కి తీసుకొస్తాం.. దాన్ని మునుపటి కంటే ఆర్థికంగా బలోపేతం చేస్తాం" అంటూ 'మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్' అనే నినాదాన్ని ఇస్తున్నారు.
మరోవైపు, తమ వద్ద అత్యాధునిక ఆయుధాలు ఇంకా ఉన్నాయని, ఈ యుద్ధాన్ని నెలల తరబడి కొనసాగించగలమని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, అమెరికా ఖజానాకు ఇంకెంత గండి పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.