పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరాయి. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన పెట్రోకెమికల్ హబ్‌లపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడ్డాయి. నైరుతి ఇరాన్‌లోని మాహ్‌షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్‌తో పాటు బందర్ ఇమామ్ సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయని, పలు కంపెనీలు దెబ్బతిన్నాయని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది.

"మాహ్‌షహర్ ప్రత్యేక పెట్రోకెమికల్ జోన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి" అని ఖుజెస్థాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌ను ఉటంకిస్తూ ఫ్రాన్స్ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఈ సంయుక్త దాడుల్లో ఆ ప్రాంతంలోని అబూ అలీ, రిజాల్, అమీర్ కబీర్ పెట్రోకెమికల్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆస్తినష్టం ఏ మేరకు జరిగిందనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ దాడుల వల్ల ఇప్పటివరకు ఐదుగురు గాయపడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు పెట్రోకెమికల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అత్యవసర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దాడుల తీవ్రత దృష్ట్యా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అన్ని పారిశ్రామిక విభాగాల నుంచి సిబ్బందిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పేలుళ్లు ఎక్కడ జరిగాయి, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉందనే అంశాలపై అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు.
ఖుజెస్థాన్ ప్రావిన్స్‌లోని బందర్ ఇమామ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌పై కూడా వైమానిక దాడులు జరిగాయని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. ఈ దాడుల వల్ల కాంప్లెక్స్‌లోని కొన్ని విభాగాలు దెబ్బతిన్నాయని ఇరాన్ వార్తా సంస్థ మెహర్ తెలిపింది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఆర్థిక వనరులే లక్ష్యంగా దాడులు చేయాలని ఇజ్రాయెల్ రాజకీయ నాయకత్వం గత వారమే ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళాలు)కు ఆదేశాలు జారీ చేసినట్లు 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పత్రిక కథనం ప్రచురించింది. ఇరాన్ పాలకులకు భారీ ఆర్థిక నష్టం కలిగించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఈ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
{{/usCountry}}ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఆర్థిక వనరులే లక్ష్యంగా దాడులు చేయాలని ఇజ్రాయెల్ రాజకీయ నాయకత్వం గత వారమే ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ రక్షణ దళాలు)కు ఆదేశాలు జారీ చేసినట్లు 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పత్రిక కథనం ప్రచురించింది. ఇరాన్ పాలకులకు భారీ ఆర్థిక నష్టం కలిగించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఈ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
{{/usCountry}}