రష్యాలో ప్రాణాంతక న్యుమోనిక్ ప్లేగ్ (Pneumonic Plague) వ్యాప్తి చెందుతోందన్న అనుమానాలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు ఎలాంటి ప్రయాణాలు చేయవద్దంటూ అత్యున్నత స్థాయి 'లెవెల్ 4' ప్రయాణ హెచ్చరికను (Do Not Travel Advisory) పునరుద్ఘాటించింది. ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఓ పరిశోధకురాలు మృతి చెందడంతో పాటు స్థానిక ఆసుపత్రులను క్వారంటైన్ చేసినట్లు సమాచారం అందడంతో యూఎస్ ప్రభుత్వం ప్రత్యేక ఆరోగ్య హెచ్చరికను విడుదల చేసింది.
అసలేం జరిగింది?

ఇర్కుట్స్క్ యాంటీ-ప్లేగ్ ఇన్స్టిట్యూట్‌లో పనిచేస్తున్న పరిశోధకురాలు దారియా షిపిలోవా అక్టోబర్ 1న పరిశోధనల సమయంలో ప్రత్యక్ష బ్యాక్టీరియా సంపర్కంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. ఆమెతో ప్రాథమిక సంపర్కంలోకి వచ్చిన సుమారు 200 మందిని రష్యా అధికారులు వెంటనే క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం వారెవరికీ ఎలాంటి రోగ లక్షణాలు కనిపించనప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా స్థానిక ఆసుపత్రులలో మూసివేతలు, ప్రత్యేక క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
అమెరికా పౌరులు వెంటనే వచ్చేయాలి
రష్యాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మాస్కో నగరం వెలుపల ఉన్న తమ పౌరులకు దౌత్యపరమైన సాయం అందించే సామర్థ్యం చాలా పరిమితంగా ఉందని యూఎస్ ఎంబసీ స్పష్టం చేసింది. అనవసర అరెస్టులు, భద్రతా సమస్యలు, ఆరోగ్య ముప్పు దృష్ట్యా అమెరికా పౌరులు ఎవరూ రష్యాకు వెళ్లకూడదని, ప్రస్తుతం అక్కడ ఉన్నవారు వెంటనే బయటకు వచ్చేయాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి 2022 నుంచే అమెరికా ఈ 'లెవెల్ 4' హెచ్చరికలను అమలు చేస్తోంది.
ఆందోళన వద్దంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ ప్లేగ్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందిస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. రష్యా సరిహద్దులు దాటి ఈ వ్యాధి ఇతర దేశాలకు వ్యాపించే ముప్పు చాలా స్వల్పంగా ఉందని పేర్కొంది.
"మరో మహమ్మారి వ్యాపించే సూచనలేవీ ప్రస్తుతం కనిపించడం లేదు" అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీయర్ స్పష్టం చేశారు. అలాగే క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల నమూనాలను పరీక్షించగా ఎలాంటి ప్రమాదకర అంటువ్యాధి కారకాలు బయటపడలేదని రష్యా దర్యాప్తు అధికారులు కూడా నిర్ధారించారు.
{{/usCountry}}"మరో మహమ్మారి వ్యాపించే సూచనలేవీ ప్రస్తుతం కనిపించడం లేదు" అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీయర్ స్పష్టం చేశారు. అలాగే క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల నమూనాలను పరీక్షించగా ఎలాంటి ప్రమాదకర అంటువ్యాధి కారకాలు బయటపడలేదని రష్యా దర్యాప్తు అధికారులు కూడా నిర్ధారించారు.
{{/usCountry}}