అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయ నిపుణులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) కీలక హెచ్చరిక జారీ చేసింది. నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు, ఉద్యోగ అనుమతుల (EAD) కోసం ఉపయోగించే రెండు అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఫామ్‌లలో సవరణలు చేసింది. 2026 సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
గ్రేస్ పీరియడ్‌కు తావు లేదు

సాధారణంగా ఏదైనా ఫామ్ మారినప్పుడు కొంతకాలం గ్రేస్ పీరియడ్ ఇచ్చి, పాత, కొత్త ఫామ్‌లు రెండింటినీ యూఎస్‌సీఐఎస్ ఆమోదిస్తుంది. అయితే ఈసారి ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వడం లేదని అధికారులు తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత పాత ఫామ్‌లలో దరఖాస్తులను సమర్పిస్తే, అధికారులు వాటిని పరిశీలించకుండానే నేరుగా తిరస్కరిస్తారు.
ఈ మార్పులు ప్రధానంగా 'ఫార్మ్ I-539' (నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు లేదా మార్పు కోసం వాడేది), 'ఫార్మ్ I-765' (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్/EAD దరఖాస్తు)లకు వర్తిస్తాయి. విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు, విదేశీ మీడియా ప్రతినిధుల స్టే వ్యవధిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇటీవల రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌సీఐఎస్ ఈ సవరణలు చేసింది.
భారతీయులపై పడే ప్రభావం ఎంత?
అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయ విద్యార్థులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ఎఫ్-1 (F-1) వీసాలపై ఉంటూ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) లేదా వీసా హోదా మార్పుల కోసం ఐ-539, ఐ-765 ఫామ్‌లపైనే ఆధారపడతారు. వీరితో పాటు హెచ్-1బీ (H-1B) వీసా కలిగిన భారతీయులు కూడా తమ నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపునకు ఈ ఫామ్‌లనే ఉపయోగిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఒక్క రోజు ఆలస్యంగా లేదా పాత ఫామ్‌లో అప్లై చేసినా దరఖాస్తు రద్దవుతుంది. సరైన కొత్త ఫామ్‌లో మళ్లీ దరఖాస్తు చేసేవరకు వారికి ఎలాంటి సడలింపు లభించదు.
ఫామ్‌ల నిబంధనలు, గడువులు ఇవే
ఫార్మ్ I-539 (నాన్-ఇమిగ్రెంట్ హోదా పొడిగింపు/మార్పు):
- ప్రస్తుతం అమల్లో ఉన్న ఎడిషన్: 08/28/24
- కొత్త ఎడిషన్ అమల్లోకి వచ్చే తేదీ: సెప్టెంబర్ 15, 2026 (ఎడిషన్ తేదీ: 09/15/26)
- సెప్టెంబర్ 15 కంటే ముందు 08/28/24 ఎడిషన్ ఫామ్‌ను సమర్పిస్తే అంగీకరిస్తారు.
- సెప్టెంబర్ 15న లేదా ఆ తర్వాత పాత 08/28/24 ఎడిషన్ ఫామ్‌ను పంపితే తిరస్కరిస్తారు.
- సెప్టెంబర్ 15 నుంచి కేవలం 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను మాత్రమే స్వీకరిస్తారు.
- నూతన 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను సెప్టెంబర్ 15 కంటే ముందు సమర్పించకూడదు, ఒకవేళ పంపినా ప్రాసెస్ చేయరు.
ఫార్మ్ I-765 (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ దరఖాస్తు):
- ప్రస్తుతం అమల్లో ఉన్న ఎడిషన్: 08/21/25
- కొత్త ఎడిషన్ అమల్లోకి వచ్చే తేదీ: సెప్టెంబర్ 15, 2026 (ఎడిషన్ తేదీ: 09/15/26)
- సెప్టెంబర్ 15 కంటే ముందు 08/21/25 ఎడిషన్ సమర్పిస్తే ఆమోదిస్తారు.
- సెప్టెంబర్ 15న లేదా ఆ తర్వాత పాత 08/21/25 ఎడిషన్ ఫామ్ పంపితే తిరస్కరిస్తారు.
- సెప్టెంబర్ 15 నుంచి కేవలం 09/15/26 ఎడిషన్ ఫామ్‌ను మాత్రమే స్వీకరిస్తారు.
- కొత్త 09/15/26 ఎడిషన్‌ను సెప్టెంబర్ 15 కంటే ముందు పంపకూడదు.
దరఖాస్తుదారులు ఇప్పుడు ఏం చేయాలి?
అభ్యర్థుల అవగాహన కోసం యూఎస్‌సీఐఎస్ తమ అధికారిక వెబ్సైట్లో ఈ రెండు కొత్త ఫామ్‌ల ప్రివ్యూ వర్షన్లతో పాటు సూచనలను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఫామ్‌లను సెప్టెంబర్ 15కి ముందు దాఖలు చేయకూడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 కంటే ముందే దరఖాస్తు చేసుకోవాల్సిన వారు పాత ఎడిషన్ ఫామ్‌లనే ఉపయోగించి గడువులోగా సబ్మిట్ చేయాలి. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా నూతన ఎడిషన్ ఫామ్‌లనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
{{/usCountry}}అభ్యర్థుల అవగాహన కోసం యూఎస్‌సీఐఎస్ తమ అధికారిక వెబ్సైట్లో ఈ రెండు కొత్త ఫామ్‌ల ప్రివ్యూ వర్షన్లతో పాటు సూచనలను అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఫామ్‌లను సెప్టెంబర్ 15కి ముందు దాఖలు చేయకూడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 కంటే ముందే దరఖాస్తు చేసుకోవాల్సిన వారు పాత ఎడిషన్ ఫామ్‌లనే ఉపయోగించి గడువులోగా సబ్మిట్ చేయాలి. సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా నూతన ఎడిషన్ ఫామ్‌లనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
{{/usCountry}}