Vaibhav Sooryavanshi Brother: ఐపీఎల్ 2026 (IPL 2026) లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలిచి, సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఇంట్లో మరో పరుగుల మెషిన్ తయారైంది. వైభవ్ తమ్ముడు, 10 ఏళ్ల ఆశీర్వాద్ సెంచరీతో సంచలనం క్రియేట్ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ తమ్ముడు

వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా తన అన్న బాటలోనే సాగుతున్నాడు. చిన్న వయసులోనే క్రికెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం అలవాటు చేసుకుంటున్నాడు. బీహార్ స్థానిక మ్యాచ్‌లో కేవలం 87 బంతుల్లోనే 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ చిన్నారి ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అన్న రియాక్షన్
తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీపై అన్న వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ కూడా వైరల్ గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో స్కోరుబోర్డు, తమ్ముడి ఫొటోలు పోస్టు చేసిన వైభవ్.. ‘‘కంగ్రాచ్యులేషన్స్ ఆశీర్వాద్’’ అని మెన్షన్ చేశాడు.
సూర్యవంశీ బ్రదర్స్
భారత క్రికెట్ చరిత్రలో గవాస్కర్ బ్రదర్స్, పఠాన్ బ్రదర్స్, పాండ్యా బ్రదర్స్‌ను చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసుకే ఒకరు సీనియర్ టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం, అదే సమయంలో 10 ఏళ్ల వయసున్న తమ్ముడు వందల స్ట్రైక్ రేట్‌తో సెంచరీలు బాదడం బహుశా ఇదే మొదటిసారి. క్రికెట్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఈ సూర్యవంశీ బ్రదర్స్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.
ఆశీర్వాద్ సూర్యవంశీ విధ్వంసం
{{/usCountry}}భారత క్రికెట్ చరిత్రలో గవాస్కర్ బ్రదర్స్, పఠాన్ బ్రదర్స్, పాండ్యా బ్రదర్స్‌ను చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసుకే ఒకరు సీనియర్ టీమిండియాకు సెలెక్ట్ అవ్వడం, అదే సమయంలో 10 ఏళ్ల వయసున్న తమ్ముడు వందల స్ట్రైక్ రేట్‌తో సెంచరీలు బాదడం బహుశా ఇదే మొదటిసారి. క్రికెట్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఈ సూర్యవంశీ బ్రదర్స్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది.
ఆశీర్వాద్ సూర్యవంశీ విధ్వంసం
{{/usCountry}}సమస్తీపూర్‌లోని లీగ్ లో 'తాజ్‌పూర్ క్రికెట్ అకాడమీ' తరఫున ఆడిన 10 ఏళ్ల ఆశీర్వాద్.. పెద్దల పిచ్‌పై సీనియర్ బౌలర్లను సైతం వణికించాడు. కేవలం 87 బంతుల్లో 103 పరుగులు చేయడం, వన్డే/స్థానిక ఫార్మాట్‌లో 118.39 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం సాదాసీదా విషయం కాదు.
అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల రూపంలోనే ఏకంగా 86 పరుగులు రాబట్టాడు. అన్న వైభవ్ లాగే ఆశీర్వాద్ కూడా ప్రొఫెషనల్ అగ్రెసివ్ బ్యాటింగ్ శైలిని అలవర్చుకున్నాడని ఈ ఇన్నింగ్స్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న అన్న వైభవ్ సూర్యవంశీ ఈ స్కోరు చూసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తమ్ముడిని అభినందించడం విశేషం.
సచిన్ రికార్డు బ్రేక్
రీసెంట్ గా ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ ల కోసం టీమిండియాకు సెలెక్ట్ అయిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన ఆటగాడిగా వైభవ్ (15) నిలిచాడు.
People Also Ak- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: వైభవ్ సూర్యవంశీ తమ్ముడు సాధించిన ఘనత ఏమిటి?
జవాబు: వైభవ్ తమ్ముడు 10 ఏళ్ల ఆశీర్వాద్ బీహార్‌లో జరిగిన ఒక లోకల్ మ్యాచ్‌లో కేవలం 87 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 103 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
ప్రశ్న: వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్ ఏ రికార్డును బద్దలు కొట్టాడు?
జవాబు: కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపిక కావడం ద్వారా, 36 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్ రికార్డును వైభవ్ అధిగమించాడు.
ప్రశ్న: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ఎలా ఉంది?
జవాబు: రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.