Maruti Suzuki Discounts : తక్కువ ధరకు కారు కొనాలా? మారుతీ సుజుకీ కార్లపై బంపర్​ ఆఫర్లు మీకోసమే..

Maruti Suzuki June 2026 Discounts : కొత్త మారుతీ సుజుకీ కారు కొనాలనుకునే వారికి జూన్ 2026 సరైన సమయం. ఈ నెలలో మారుతి సుజుకి అరేనా తన పాపులర్ మోడళ్లయిన విక్టోరిస్, స్విఫ్ట్, బ్రెజ్జా, వ్యాగన్ ఆర్‌లపై రూ. 90,000 వరకు భారీ తగ్గింపులు, ఆఫర్లను ప్రకటిస్తోంది.

Published on: Jun 8, 2026, 09:08:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maruti Suzuki Swift : మీరు ఈ నెలలో సరికొత్త మారుతీ సుజుకీ కారును ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది ఖచ్చితంగా మంచి అవకాశం. జూన్ 2026లో సరికొత్త కారు కొనుగోలుపై భారీగా డబ్బు ఆదా చేసుకునేందుకు మారుతీ సుజుకీ అరేనా డీలర్‌షిప్‌లు అద్భుతమైన ఆఫర్లను ముందుకు తెచ్చాయి. మారుతీ సుజుకీ విక్టోరిస్, మారుతీ సుజుకీ స్విఫ్ట్, మారుతీ సుజుకీ బ్రెజ్జాతో పాటు కంపెనీకి చెందిన పలు పాపులర్ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు లభిస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ స్విఫ్ట్..
మారుతీ సుజుకీ స్విఫ్ట్..

మారుతీ సుజుకీ విక్టోరిస్..

ఈ నెలలో అన్నింటికంటే గరిష్టంగా మారుతీ సుజుకీ విక్టోరిస్ మోడల్‌పైనే అత్యధిక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులోని ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లపై కస్టమర్లు గరిష్టంగా రూ. 90,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా విక్టోరిస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్లపై ఎక్స్​ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో ఈ భారీ ఆఫర్లు లభిస్తున్నాయి.

మరోవైపు, మారుతీ సుజుకీ విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్లపై రూ. 80,000 వరకు, అలాగే పెట్రోల్ వేరియంట్లపై రూ. 60,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్​లో మారుతీ సుజుకీ విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

మారుతీ సుజుకీ స్విఫ్ట్..

మార్కెట్​లో ఎంతో ఆధరణ పొందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా ఈ నెల భారీ ఆఫర్లు ఉన్నాయి. స్విఫ్ట్ ఏఎంటీ ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 45,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, మ్యాన్యువల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

కంపెనీ పోర్ట్‌ఫోలియోలోనే అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటైన మారుతీ సుజుకీ స్విఫ్ట్ ప్రస్తుతం మార్కెట్​లో రూ. 5.79 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో అమ్మకానికి ఉంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా, వ్యాగన్​ఆర్..

మారుతీ సుజుకీ బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారు పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ ఆఫర్లలో నగదు బహుమతులు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ స్కీమ్‌లు కలిసి ఉన్నాయి.

వీటితో పాటు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో నచ్చే హ్యాచ్‌బ్యాక్ మారుతీ సుజుకీ వ్యాగన్​ఆర్​పై కూడా రూ. 52,500 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ విభాగంలో ఇప్పటికీ అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్రాక్టికల్ ఛాయిస్‌గా వ్యాగన్ ఆర్ నిలుస్తోంది.

ఆల్టో కే10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకో..

మారుతీ సుజుకీ ఆల్టో కే10 మోడల్‌పై వేరియంట్‌ను బట్టి రూ. 52,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మారుతీ సుజుకీ సెలెరియో, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో, మారుతీ సుజుకీ ఈకో వ్యాన్‌లపై రూ. 37,500 వరకు తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ పరిమితులు ఉన్న కొనుగోలుదారులకు ఈ ఎంట్రీ లెవల్ కార్లపై లభిస్తున్న అదనపు డిస్కౌంట్లు మరింత లాభదాయకంగా మారనున్నాయి.

డిజైర్, ఎర్టిగాలపై ఎలాంటి డిస్కౌంట్లు లేవు!

ఇదిలా ఉంటే, మారుతీ సుజుకీ నుంచి విపరీతమైన క్రేజ్ ఉన్న పాపులర్ మోడళ్లు డిజైర్, ఎర్టిగా వంటి కార్లపై ఈ నెల ఎలాంటి అధికారిక అరేనా డిస్కౌంట్లు ప్రకటించలేదు. మార్కెట్​లో ఈ రెండు మోడళ్లకు ఉన్న భారీ డిమాండ్, లాంగ్ వెయిటింగ్ పీరియడ్ కారణంగానే కంపెనీ వీటికి ఎలాంటి ప్రమోషనల్ ఆఫర్లను అందించడం లేదని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

అయితే ఈ ఆఫర్లు నగరాలు, డీలర్‌షిప్‌లు, కార్ల స్టాక్ లభ్యత, వేరియంట్లను బట్టి మారే అవకాశం ఉందని కొనుగోలుదారులు గమనించాలి. అందుకే మీ సమీపంలోని మారుతీ సుజుకీ షోరూమ్​ని సందర్శించడం ఉత్తమం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More