...
...
Next Story

TVK Vijay Govt : విజయ్‌కి వామపక్షాల మద్దతు - TVK ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..!

TVK Vijay Magic Figure 118 : తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో మ్యాజిగ్ ఫిగర్ దాటనుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది.

Published on: May 8, 2026, 16:41:27 IST
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకుంది. కేవలం 10 సీట్ల తేడాతో మ్యాజిక్ ఫిగర్‌కు దూరమైన విజయ్‌కు, కాంగ్రెస్ మరియు ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించడంతో లైన్ క్లియర్ అయింది.

సమీకరణాలు ఇలా…

TVK ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..!(ఫైల్ ఫొటో) (PTI)
TVK ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..!(ఫైల్ ఫొటో) (PTI)

234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. కానీ టీవీకే పార్టీ 108 స్థానాల వద్దే ఆగిపోయింది. దీంతో విజయ్ పార్టీకి మరో 10 సీట్లు అవసరం. చర్చల అనంతరం… కాంగ్రెస్ తో పాటు ఇతర వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

  • కాంగ్రెస్ మద్దతు: ఇప్పటికే 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మద్దతు తెలపడంతో టీవీకే బలం 113కు చేరింది.
  • వామపక్షాలు : సీపీఐ (2 సీట్లు), విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK - 2 సీట్లు), సీపీఐ(యం) 2 సీట్లు గెలిచాయి. సుదీర్ఘ చర్చల తర్వాత… వామపక్ష పార్టీలు కూడా విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వీరందరి బలంతో… విజయ్ బలం 119కి చేరుతుంది.

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ…. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతోనే తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

గవర్నర్‌తో 'తలపతి' భేటీ

ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత కోసం విజయ్ ఈ వారంలో రెండుసార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. అయితే…. కేవలం మాటలతో కాకుండా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను సమర్పించాలని గవర్నర్ సూచించారు. అదనపు పార్టీల మద్దతుపై కూడా క్లారిటీ కావాలని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం చెన్నైలో నిర్వహించే సమావేశంలో అన్ని పార్టీల మద్దతుతో విజయ్ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది.

డీఎంకే-అన్నాడీఎంకే పొత్తు పుకార్లు?

ఈ పుకార్ల నేపథ్యంలో టీవీకే పార్టీ మరింత అప్రమతమైంది. వేగంగా పావులు కదుపుతూ… అవకాశం ఉన్న పార్టీలతో చర్చలను వేగవంతం చేసింది. కాంగ్రెస్ ముందుగానే మద్దతు ప్రకటించినప్పటికీ… సుదీర్ఘ చర్చల అనంతరం వామపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు అందింది. ఫలితంగా విజయ్… మ్యాజిగ్ ఫిగర్ మార్కను చేరుకోగలిగారు.

మొత్తానికి, వెండితెరపై రికార్డులు సృష్టించిన విజయ్…. ఇప్పుడు తమిళనాడు రాజకీయ యవనికపై ముఖ్యమంత్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. పూర్తి మెజార్టీతో కూడిన లేఖను గవర్నర్ కు సమర్పిస్తే…. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe