భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి మరో అంతర్జాతీయ దిగ్గజం అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఈవీ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. 2027లో భారత మార్కెట్లోకి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది! ఇప్పటికే వియత్నాం రోడ్లపై విజయవంతంగా నడుస్తున్న ‘ఇవో’, ‘క్యో’, ‘కైనెట్’ స్కూటర్ల ఆధారంగా భారత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మోడళ్లను తీర్చిదిద్దుతోంది. మన దేశ రహదారులు, వాతావరణం, రైడింగ్ అవసరాలకు తగ్గట్లుగా వీటి డిజైన్, ఛాసిస్, పనితీరులో కీలక మార్పులు చేయనుంది. ఈ మూడు స్కూటర్లను సంస్థ సొంతంగా నిర్మించనున్నప్పటికీ, భారత్‌లో వీటి పేర్లు, పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

భారత రహదారులపై ఉండే పెద్ద స్పీడ్ బ్రేకర్లు, వర్షాకాలంలో గుంతల రోడ్లను తట్టుకోవాలంటే స్కూటర్లకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం తప్పనిసరి. అంతేకాదు, కూరగాయల సంచులు, హెల్మెట్లు పెట్టుకోవడానికి సీటు కింద విశాలమైన స్టోరేజీ స్పేస్ కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది.
సరిగ్గా ఇదే అంశాలను విన్‌ఫాస్ట్ గుర్తించింది. భారత్ కోసం రూపొందించే స్కూటర్లలో గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడంతో పాటు సీటు కింద పెద్ద స్టోరేజీ స్పేస్ ఇవ్వనున్నట్లు విన్‌ఫాస్ట్ వెల్లడించింది. వియత్నాం మోడళ్లతో పోలిస్తే భారత వెర్షన్లలో బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ ధరలో స్కూటర్ కోరుకునే సామాన్యుల నుంచి అధిక వేగం, స్పోర్టీ పనితీరు ఆశించే యువత వరకు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఈ మూడు మోడళ్లను తీసుకొస్తోంది.
బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్ మోడల్.. ‘ఇవో’ విశేషాలివే!
మీడియా నివేదికల ప్రకారం.. విన్‌ఫాస్ట్ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో 'ఇవో' ఆధారిత మోడల్ ఎంట్రీ-లెవల్ వాహనంగా నిలవనుంది. వియత్నాంలో విక్రయిస్తున్న ఇవో స్కూటర్‌లో 1.5 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీతో పాటు అవసరమైతే బయటకు తీసి ఛార్జ్ చేసుకునే అదనపు 1.5 కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ ఉంది. వెనుక చక్రానికి అమర్చిన హబ్ మోటార్ గరిష్టంగా 2.45 కేడబ్ల్యూ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. రెండు బ్యాటరీల సాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముందువైపు డిస్క్ బ్రేక్, 12-అంగుళాల చక్రాలు, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, సీటు కింద 12 లీటర్ల స్టోరేజీ ఇందులో ఉన్నాయి. వియత్నాం మార్కెట్లో ఇవో ప్రారంభ ధర 18.8 మిలియన్ వియత్నామీస్ డాంగ్‌లుగా (సుమారు రూ. 68,300) ఉంది.
మరిన్ని ప్రీమియం ఫీచర్లతో ‘క్యో’ ఆధారిత స్కూటర్
విన్‌ఫాస్ట్ ఇవో మోడల్ కంటే పైస్థాయిలో, మెరుగైన ఫీచర్లతో 'క్యో' ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. వియత్నాం వెర్షన్ క్యో స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 3 కేడబ్ల్యూ సామర్థ్యం గల శక్తివంతమైన హబ్ మోటార్‌ను అమర్చారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 160 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండేలా 14-అంగుళాల పెద్ద చక్రాలు, ఆధునిక టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కీ-లెస్ ఎంట్రీ , ఎత్తుపల్లాల వద్ద వాహనం వెనక్కి జారకుండా ఆపే హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. సీటు కింద 21 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం లభిస్తుంది. వియత్నాంలో దీని ధర 30 మిలియన్ డాంగ్‌లుగా (సుమారు రూ. 1.09 లక్షలు) నిర్ణయించారు.
వేగం, స్పోర్టీ లుక్ కోరుకునే వారి కోసం ‘కైనెట్’..
{{/usCountry}}విన్‌ఫాస్ట్ ఇవో మోడల్ కంటే పైస్థాయిలో, మెరుగైన ఫీచర్లతో 'క్యో' ఆధారిత ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. వియత్నాం వెర్షన్ క్యో స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 3 కేడబ్ల్యూ సామర్థ్యం గల శక్తివంతమైన హబ్ మోటార్‌ను అమర్చారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 160 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. నగర ప్రయాణాలకు అనువుగా ఉండేలా 14-అంగుళాల పెద్ద చక్రాలు, ఆధునిక టీఎఫ్‌టీ డిస్‌ప్లే, కీ-లెస్ ఎంట్రీ , ఎత్తుపల్లాల వద్ద వాహనం వెనక్కి జారకుండా ఆపే హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. సీటు కింద 21 లీటర్ల స్టోరేజీ సామర్థ్యం లభిస్తుంది. వియత్నాంలో దీని ధర 30 మిలియన్ డాంగ్‌లుగా (సుమారు రూ. 1.09 లక్షలు) నిర్ణయించారు.
వేగం, స్పోర్టీ లుక్ కోరుకునే వారి కోసం ‘కైనెట్’..
{{/usCountry}}రాబోయే మూడు స్కూటర్లలో విన్‌ఫాస్ట్ 'కైనెట్' ఆధారిత మోడల్ అత్యంత స్పోర్టీగా, మెరుగైన పనితీరుకు పెద్దపీట వేసే వాహనంగా నిలవనుంది. ఇందులోని 5.2 కేడబ్ల్యూ శక్తివంతమైన హబ్ మోటార్ సాయంతో ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 3 కేడబ్ల్యూహెచ్ కంబైన్డ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. వియత్నాం మార్కెట్లో లభించే కైనెట్ మోడల్‌లో 14-అంగుళాల చక్రాలు, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, సీటు కింద 22 లీటర్ల స్టోరేజీ స్పేస్ అందించారు. అక్కడ దీని ధర 40 మిలియన్ డాంగ్‌లు (సుమారు రూ. 1.45 లక్షలు) గా ఉంది.
టీవీఎస్, ఏథర్, బజాజ్‌లకు గట్టి పోటీ.. సవాళ్లు కూడా
భారత మార్కెట్ అవసరాలు, తుది ధరలు, ఖచ్చితమైన విడుదల తేదీలపై విన్‌ఫాస్ట్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భారతీయ వినియోగదారులకు సులభంగా గుర్తుండిపోయేలా ఈ మూడు స్కూటర్ల పేర్లను మార్చే ఆలోచనలో కూడా కంపెనీ ఉంది.
దేశీయంగానే ఉత్పత్తి కానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో నేరుగా తలపడనున్నాయి. వేగంగా విస్తరిస్తున్న
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో నిలదొక్కుకోవాలంటే, విన్‌ఫాస్ట్ సంస్థ బ్యాటరీ సామర్థ్యం, రోజువారీ అవసరాలకు సరిపడే స్టోరేజీ, వాస్తవ రేంజ్, పోటీతత్వ ధరలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.